మార్కెట్ అప్‌డేట్: లాభాల్లో మార్కెట్లు, బలపడిన రూపాయి
ముంబై: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ప్రకటన నేపథ్యంలో సోమవారం మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. సోమవారం అమెరికా - చైనా మధ్య నిలిచిపోయిన వాణిజ్య చర్చలు కూడా తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయనే సంకేతాలు రావడంతో మార్కెట్లు మంగళవారం కూడా లాభాల్లోనే ప్రారంభమయ్యాయి. అదనపు నిధులను కేంద్ర ప్రభుత్వానికి బదలీ చేసేందుకు ఆర్బీఐ ఆమోదం తెలపడం కూడా మార్కెట్లకు కలిసి వచ్చింది.
ఉదయం గం.9.51 ని.ల సమయంలో సెన్సెక్స్ 81 పాయింట్స్ ఎగిసి 37,545 వద్ద, నిఫ్టీ 31 పాయింట్స్ లాభపడి 11,089 వద్ద ట్రేడ్ అయింది. డాలరుతో రూపాయి 32 పైసలు బలపడి 71.70 వద్ద ట్రేడ్ అయింది. ఉదయం గం.10.18 నిమిషాలకు సెన్సెక్స్ 159.03 (0.42%) లాభపడి 37,652.25 వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 57.15 (0.52%) లాభపడి 11,115.00 వద్ద ట్రేడ్ అయింది.

టాటా మోటార్స్, టాటా స్టీల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండస్ ఇండ్ బ్యాంకు, ఎల్ అండ్ టీ, బ్రిటానియా, యూపీఎల్, అల్ట్రా టెక్ సిమెంట్ తదితర కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. హెచ్‌సీఎల్, ఇన్ఫోసిస్, సిప్లా, టెక్ మహీంద్రా నష్టాలను చవి చూశాయి. ఐటీ మినహా మిగతా షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి.


Click it and Unblock the Notifications