ఒక్కరోజులో 2.41 లక్షల కోట్లు పెరిగిన సంపద, కారణాలివే...

ముంబై: FPIలపై సర్‌ఛార్జ్ ఉపసంహరణ, ఆటో, బ్యాంకింగ్ సహా వివిధ రంగాలకు ఊతమిస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ప్రకటన చేయడంతో సోమవారం మార్కెట్లు భారీ లాభాల్లో క్లోజ్ అయ్యాయి. సెన్సెక్స్ 793 పాయింట్లు పెరిగి 37,494 వద్ద, నిఫ్టీ 229 పాయింట్లు ఎగబాకి 11,058 వద్ద ముగిసాయి. మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత కాస్త తడబడ్డాయి. కానీ సూచీలు మళ్లీ పైపైకి లేచాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపద ఒక్క రోజులోనే రూ.2.41 లక్షల కోట్లు పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక భయాలు పక్కన పెట్టారు. డాలర్ మారకంతో రూపాయి విలువ రూ.72.02 వద్ద క్లోజ్ అయింది.

బీఎస్ఈలో రూ.140.34 లక్షల కోట్లకు సంపద!

బీఎస్ఈలో రూ.140.34 లక్షల కోట్లకు సంపద!

బీఎస్ఈలో ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ వ్యాల్యూ సోమవారం ఒక్కరోజే రూ.2,41,975.59 కోట్లు పెరిగి రూ.140.34 లక్షల కోట్లకు చేరుకుంది. కేంద్ర ప్రభుత్వ చర్యల వల్ల ప్రపంచవ్యాప్తంగా అస్థిరత కొనసాగుతున్నప్పటికీ మార్కెట్లు కోలుకున్నాయని, 2 శాతానికి పైగా లాభపడ్డాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు, అమెరికా - చైనా వాణిజ్య యుద్ధం తీవ్రత కూడా తగ్గుతున్న నేపథ్యంలో మార్కెట్ల పరిస్థితి ఆశాజనకంగా ఉంటుందని భావిస్తున్నారు.

22 కంపెనీలు లాభపడ్డాయి..

22 కంపెనీలు లాభపడ్డాయి..

30 షేర్ల సెన్సెక్స్‌లో సోమవారం నాడు 22 లాభపడ్డాయి. యస్ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తదితర స్టాక్స్ లాభపడ్డాయి. బీఎస్ఈలో 1,705 స్టాక్స్ లాభపడగా, 811 నష్టపోయాయి. 123 కంపెనీలలో ఎలాంటి మార్పు లేదు. సెన్సెక్స్‌లో భారీగా లాభపడిన షేరు యస్ బ్యాంకుదే. 6.3 శాతం లాభపడి రూ.63 వద్ద క్లోజైంది.

నిర్మలా సీతారామన్ ప్రకటనోత్సాహం

నిర్మలా సీతారామన్ ప్రకటనోత్సాహం

FPIలపై సర్‌ఛార్జ్‌ని వెనక్కి తీసుకుంటున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆటోరంగంలోని సమస్యలను పరిష్కరించేందుకు ఓ ప్యాకేజీ, ప్రభుత్వరంగ బ్యాంకుల్లోకి రూ.70,000 కోట్ల రూపాయల ముందస్తు ఇన్ఫ్యూజన్ నేపథ్యంలో మార్కెట్లకు కొత్త ఉత్తేజం వచ్చింది. వాహనాలను కొనుగోలు విషయంలో ప్రభుత్వరంగ సంస్థలకు కూడా ఊరట కల్పించింది. GDP వృద్ధి పుంజుకోవడానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఉద్దీపనలు ప్రకటించడం ఇన్వెస్టర్లకు ఆనందం కలిగించింది.

అమెరికా-చైనా టాక్స్, క్రూడాయిల్...

అమెరికా-చైనా టాక్స్, క్రూడాయిల్...

అమెరికా- చైనా మధ్య ఆగిపోయిన ట్రేడ్ టాక్స్ తిరిగి ప్రారంభం కావొచ్చనే సంకేతాలు మార్కెట్లకు కలిసి వచ్చాయి. G-7 దేశాల సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఇందుకు సంకేతాలు ఇవ్వడం కూడా మార్కెట్లకు ఊతమిచ్చింది. ఆయిల్ ధరలు తగ్గాయి. బ్రెంట్, నైమెక్స్‌ ముడి చమురు ధరలు దాదాపు ఒక శాతం మేర తగ్గాయి.

ఆర్బీఐ ఎఫెక్ట్

ఆర్బీఐ ఎఫెక్ట్

సోమవారం రోజు జలన్ ప్యానెల్ తన నివేదికను రిజర్వ్ బ్యాంకుకు సమర్పించింది. ఇది మార్కెట్లకు ఊతమిచ్చింది. అందుకు తగినట్లుగా కేంద్ర ప్రభుత్వానికి రూ.1.76 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వానికి బదలీ చేసేందుకు ఆర్బీఐ బోర్డు సోమవారం ఆమోదం తెలిపింది. ఓ వైపు ద్రవ్యలోటు పెరగకుండానే మరోవైపు మందగమనం పాలవుతున్న ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు అందించాల్సిన సమయంలో ప్రభుత్వానికి ఈ నిధులు వస్తున్నాయి.

మార్కెట్స్ అప్..

మార్కెట్స్ అప్..

ఇంటర్నేషనల్ బ్రోకరేజ్ సంస్థ NOMURA భారత్ రేటింగ్‌ను ఓవర్‌వెయిట్‌‌కు అప్‌గ్రేడ్ చేసింది. ప్రపంపవ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్నప్పటికీ, దేశీయంగా సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటుండటంతో భారత్‌ రేటింగ్‌ను అప్‌గ్రేడ్‌ చేసింది. మరోవైపు ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి సెన్సెక్స్ 40,500 పాయింట్లకు చేరుతుందని మరో బ్రోకరేజ్ సంస్థ బీఎన్‌పీ పారిబా తెలిపింది. ఈ ప్రభావం కూడా మార్కెట్లపై పడింది.

మూడు షేర్ల వాటా ఇలా...

మూడు షేర్ల వాటా ఇలా...

హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ షేర్లు భారీగా లాభపడ్డాయి. ఈ మూడుషేర్ల వాటాయే 61 సాతంగా ఉంది. సెన్సెక్స్ మొత్తం లాభంలో ఈ మూడు షేర్ల వాటా 61 శాతంగా ఉంది. 793 పాయింట్ల సెన్సెక్స్ లాభంలో హెచ్‌డీఎఫ్‌సీ వాటా 195 పాయింట్లు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వాటా 180 పాయింట్లు, ఐసీఐసీఐ బ్యాంకు వాటా 102 పాయింట్లుగా ఉంది. ఈ మూడు షేర్ల వాటా 477 పాయింట్లు.

టాప్ షేర్లు...

టాప్ షేర్లు...

సెన్సెక్స్‌లో ఎక్కువగా లాభపడిన షేర్లలో బ్యాంకింగ్, ఫైనాన్స్‌వే. 6.33 శాతం పుంజుకున్న యస్ బ్యాంక్ సూచీ టాప్ గెయినర్. హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ, ఎల్ అండ్ టీ, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంకు, ఇండస్ ఇండ్ బ్యాంకు, ఐటీసీ, కోటక్ మహీంద్రా, మహీంద్రా అండ్‌ మహీంద్రా బ్యాంకుల షేర్లు 2 నుంచి 4 శాతం మేర లాభపడ్డాయి. టాటా స్టీల్ అత్యధికంగా రెండు శాతం నష్టాలను చవి చూసింది. బీఎస్ఈలో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు కూడా పెరిగాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+