భారత మార్కెట్‌ను దెబ్బకొట్టిన బిస్కట్, పెరిగిన కుకీస్

కోల్‌కతా: కొంతకాలంగా ఎఫ్ఎంసీజీ రంగం మందగమనంతో సాగుతోంది. ఆటో రంగం అనంతరం ఎఫ్ఎంసీజీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. కనీసం రూ.5 బిస్కట్ ప్యాకెట్ కొనుగోలు చేయలేని పరిస్థితులున్నాయనే ఆందోళలు కూడా వ్యక్తమయ్యాయి. ఇదిలా ఉండగా, ఈ రంగంలో బిస్కట్ సేల్స్ తగ్గగా, కుకీస్ డిమాండ్ పెరిగిందట. ఈ రోజుల్లో సిటీలో కుకీస్‌కు భారీగా డిమాండ్ పెరిగిందని రిపోర్ట్స్ చెబుతున్నాయి.

చిన్న ప్యాక్స్ డిమాండ్ తగ్గినా...

చిన్న ప్యాక్స్ డిమాండ్ తగ్గినా...

గ్రామీణ మార్కెట్లలో ఎక్కువగా సేల్స్ ఉంటాయి. ఇక్కడ సేల్స్ తగ్గడంతో ఎఫ్ఎంసీజీ రంగంపై ప్రభావం పడింది. చిన్న కంపెనీల ఏడాది సేల్స్ రూ.100 కోట్ల కంటే తక్కువగా ఉందని నీల్సన్ తాజా రిపోర్ట్ తెలిపింది. వ్యాల్యూ కేటగిరీలు లేదా చిన్న ప్యాక్స్ డిమాండ్ తగ్గినప్పటికీ, ప్రీమియం సబ్ సెగ్మెంట్, పెద్ద ప్యాక్ బిస్కట్ల డిమాండ్ మాత్రం తగ్గలేదని, పైగా వీటి అమ్మకాలు పెరుగుతున్నాయని పార్లే ప్రాడక్ట్స్ కేటగిరీ హెడ్ మయాంక్ షా తెలిపారు.

తగ్గిన బిస్కట్స్, పెరిగిన కుకీస్

తగ్గిన బిస్కట్స్, పెరిగిన కుకీస్

భారతదేశంలో అతిపెద్ద కన్స్యూమర్ ప్రాడక్ట్ సెగ్మెంట్ బిస్కట్. దీని విలువ రూ.35,000 కోట్లుగా ఉంటుంది. ఏప్రిల్-జూన్ క్వార్టర్‌లో వీటి అమ్మకాలు 2.5 శాతం పెరిగాయి. కిలో రూ.100 కంటే ఎక్కువ విలువ కలిగిన ప్రీమియం వర్షన్ బిస్కట్లకు మార్కెట్లో డిమాండ్ 8 శాతం పెరగగా, రూ.100 లోపు ఉన్న బిస్కట్ల డిమాండ్ మాత్రం 9 శాతం తగ్గింది. సాధారణంగా మాస్ ఉత్పత్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని స్పెన్సర్స్ రిటైల్ మేనేజింగ్ డైరెక్టర్ దేవేంద్ర చావ్లా అన్నారు.

ఏవి తగ్గాయి... ఏవి పెరిగాయి...

ఏవి తగ్గాయి... ఏవి పెరిగాయి...

2018 ఏప్రిల్-జూన్ క్వార్టర్, 2019 ఏప్రిల్ - జూన్ క్వార్టర్‌ను తీసుకుంటే ఆయా ఉత్పత్తుల పెరుగుదల, తగ్గుదల ఇలా ఉంది. ఫేస్‌కేర్, బాడీ కేర్, టూత్ పేస్ట్, ఇన్‌స్టాండ్ నూడుల్స్, చాక్లెట్స్‌కు గత ఏడాది కంటే ఈ ఏడాది ఎక్కువ డిమాండ్ ఉంది. వీటిల్లోను చాక్లెల్ట్స్ ఉత్పత్తుల డిమాండ్ దాదాపు 4 శాతం పెరిగింది. అదే సమయంలో సాల్టీ స్నాక్స్, బిస్కట్స్, షాంపూ, టీ తదితర ఉత్పత్తుల డిమాండ్ తగ్గింది. ఇందులో సాల్టీ బిస్కట్స్ డిమాండ్ దాదాపు 3 శాతం తగ్గగా, బిస్కట్ ఉత్పత్తులు ఏకంగా దాదాపు 7.5 శాతం తగ్గిపోయాయి.

దెబ్బకొట్టిన బిస్కట్!

దెబ్బకొట్టిన బిస్కట్!

క్రీమ్, డిటర్జెంట్స్, టూత్‌పేస్ట్, డియోడరెంట్స్, ఫుడ్ ఐటమ్స్ (చాక్లెట్స్, మాల్టెడ్ బీవరేజెస్, నూడుల్స్) వంటి డైలీ హోమ్, పర్సనల్ ప్రాడక్ట్స్ ఉత్పత్తులు ఏప్రిల్ - జూన్ క్వార్టర్‌లో భారీగా పెరిగాయని నీల్సన్ డేటా వెల్లడించింది. అయితే గ్రామీణ ప్రాంతంలో బిస్కట్లు, సాల్టీ స్నాక్స్, సబ్బులు, టీ సేల్స్ భారీగా తగ్గిపోయాయి. దీంతో ఎఫ్ఎంసీజీ మార్కెట్ వృద్ధి ఈ క్వార్టర్లో 60 బేసిస్ పాయింట్స్ తగ్గింది.

గ్రామీణ భారతం దెబ్బ...

గ్రామీణ భారతం దెబ్బ...

సఫోలా, పారాచూట్ ఆయిల్స్ సెల్లర్ మారికోకు గ్రామీణ భారతంలో మంచి మార్కెట్ ఉంది. ఇక్కడ వీటి మార్కెట్ తగ్గింది. అదే సమయంలో మోడర్న్ ట్రేడింగ్, ఈ-కామర్స్ వంటి వాటి ద్వారా పట్టణ ప్రాంతంలో మాత్రం సేల్స్ ఉన్నాయి. దేశంలో గ్రామీణ ప్రాంతంలోనే మూడొంతుల మార్కెట్ ఉంది. దీంతో ఓ వైపు పట్టణ ప్రాంతంలో వృద్ధి సాధిస్తున్నప్పటికీ గ్రామీణ భారతంలో సేల్స్ లేకపోవడంతో ఒత్తిడిలో కూరుకుపోయింది.

ఈ ఉత్పత్తులకు పెరిగిన డిమాండ్

ఈ ఉత్పత్తులకు పెరిగిన డిమాండ్

ఏప్రిల్ - జూన్ క్వార్టర్‌లో చాక్లెట్స్, డియోడెంట్స్, మాల్టెడ్ డ్రింక్స్, నూడుల్స్ అన్ని కూడా 10 శాతం నుంచి 15 శాతం మధ్య పెరిగాయి. లాండ్రీ, టూత్ పేస్ట్, స్కిన్ క్రీములు వంటి వాటికి కూడా డిమాండ్ ఎక్కువే ఉంది.

బలహీన పరిస్థితులే....

బలహీన పరిస్థితులే....

ఎఫ్ఎంసీజీ కంపెనీలు కొత్త కస్టమర్లను టార్గెట్‌గా చేసుకొని ముందుకు సాగుతున్నాయని, ఈ సమయంలో అప్పటికే డిమాండ్ ఉన్నచోట సబ్బులు, బిస్కట్లు వంటి కొనుగోళ్ళు బలహీనపడితే ఇబ్బందిక పరిస్థితులేనని, ఇప్పుడు జరుగుతున్నది అదేనని అంటున్నారు. గత నాలుగు క్వార్టర్లుగా ఎఫ్ఎంసీజీ రెవెన్యూ గ్రోత్, వ్యాల్యూ తగ్గుతూ వస్తోందని చెబుతున్నారు. గత ఏడాది జూలై - సెప్టెంబర్ క్వార్టర్‌లో 16.2 శాతం ఉండగా, ఇప్పుడు 10 శాతంగా ఉంది తెలిపారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+