ఈ కార్లు మరింత ఖరీదు.. ఐనా డీజిల్ కార్లు అమ్ముతాం: టోయోటా
భారత్‌లో డీజిల్ కార్ల విక్రయాలను తాము కొనసాగిస్తామని టొయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) ప్రకటించింది. కొత్త నిబంధనల నేపథ్యంలో ఈ కార్ల ధరలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే మారుతీ సుజుకీ, టాటా మోటార్స్ డీజిల్ కార్ల ఉత్పత్తిని నిలిపివేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. టొయోటా మాత్రం డీజిల్ కార్లకు డిమాండ్ ఉన్నంత వరకు విక్రయాలు ఉంటాయని తెలిపింది. BS-VI డీజిల్ ఇంజిన్లను తయారు చేసే ప్లాంట్స్‌లో పెట్టుబడులు కూడా పెట్టినట్లు తెలిపింది.

డీజిల్ వేరియంట్స్‌కు డిమాండ్
డీజిల్ వేరియంట్స్‌కు ఇంకా డిమాండ్ ఉందనే విషయాన్ని తాము గమనించాని, తాము మాత్రం వాటి తయారీని కొనసాగిస్తామని, సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చే వరకు ఈ ఉత్పత్తి కొనసాగుతుందని, మేకిన్ ఇండియాను దృష్టిలో ఉంచుకొని దీనిని కొనసాగిస్తామని టొయోటా కిర్లోస్కర్ మోటార్స్ వైస్ ఛైర్మన్ శేఖర్ విశ్వనాథన్ వెల్లడించారు.

ఖరీదు కానున్న డీజిల్ వాహనాలు..
డీజిల్ వాహనాలకు డిమాండ్ ఉన్నందున, ఫ్యూచర్ టెక్నాలజీతో తయారు చేస్తామని ఆయన తెలిపారు. తాము నెలకొల్పిన డీజిల్ ప్లాంట్స్‌ల్లో స్వల్ప పెట్టుబడితో మార్పులు చేస్తామని, తద్వారా BS-VI ప్రమాణాల ఇంజిన్లను తయారు చేస్తామన్నారు. 2020 ఏప్రిల్ 1వతేదీ నుంచి BS-VI ప్రమాణాలు ఉద్గార ప్రమాణాలు అమలు కానున్నాయి. ఈ నేపథ్యంలో కార్ల ఇంజిన్లను మెరుగుపర్చాల్సి ఉంది. ఇవి ఖరీదు కానున్నాయి.

ఎలక్ట్రిక్ వాహనాలపై...
ఇన్నోవా క్రిస్టా, ఫార్చునర్ కార్లను టొయోటా కంపెనీ విక్రయిస్తోంది. ఇందులో డీజిల్ విభాగానికి చెందినవే ఎక్కువగా ఉన్నాయి. డీజిల్, పెట్రోల్ వెహికిల్స్ 82:18 శాతంగా ఉంది. ఇతర పాసింజర్ కార్ల విషయానికి వస్తే పెట్రోల్, డీజిల్ వాటా దాదాపు 50:50గా ఉంది. మార్కెట్ పరిస్థితుల ఆధారంగా ఎలక్ట్రిక్ వాహనాల టెక్నాలజీని తీసుకు వస్తామని తెలిపారు. ప్రభుత్వం హైబ్రిడ్స్ లేదా సెల్ఫ్ చార్జీంగ్ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తే అది శుభపరిణామమే అన్నారు.
తమ పోర్ట్‌పోలియో నుంచి చిన్న డీజిల్ కార్లను రానున్న ఏడాది నుంచి తొలగిస్తున్నట్లు మార్కెట్ లీడర్ మారుతీ సుజుకీ ప్రకటించింది. టాటా మోటార్స్ కూడా చిన్న డీజిల్ కార్లను దశలవారీగా తొలగించే ఆలోచనలో ఉంది.


Click it and Unblock the Notifications