స్టాక్ మార్కెట్లో ఉన్నట్టుండి లాభాల వరద కొనసాగింది. ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లపై ఈ బడ్జెట్లో విధించిన పన్నును కేంద్రం ఉపసహరించడంతో పాటు వాహన రంగానికి కూడా ప్రోత్సాహకాలు అందించే విషయంలో కేంద్రం ప్రకటనలు చేయడం మార్కెట్లలో కాస్త ఉత్సాహాన్ని నింపింది. అయితే ఈ ఉదయం స్థిరంగా 11వేల పాయింట్ల దగ్గర ప్రారంభమైన నిఫ్టీ.. ఒక దశలో అనూహ్యంగా ఎవరూ ఊహించని విధంగా 10756 పాయింట్లకు పడిపోయింది. సుమారు 250 పాయింట్లు నీరసించడం ఉక్కిరి బిక్కిరి చేసింది. మళ్లీ అదే సమయంలో విపరీతంగా షార్ట్ కవరింగ్‌తో నిఫ్టీ మళ్లీ రెట్టించిన ఉత్సాహంతో పైకెగసింది. 11 వేల పాయింట్ల మార్కును కూడా క్రాస్ చేసి పైకి దూకింది. ముఖ్యంగా ప్రభుత్వ బ్యాంకులు, ఆర్థిక సేవల సంస్థల స్టాక్స్ భారీగా లాభపడ్డాయి. చివరకు సెన్సెక్స్ 793 పాయింట్ల లాభంతో 37,494 పాయింట్ల దగ్గర ముగిసింది. నిఫ్టీ 228 పాయింట్ల లాభంతో 11057 దగ్గర, బ్యాంక్ నిఫ్టీ 993 పాయింట్ల లాభంతో 27951 దగ్గరా క్లోజైంది. మూడు నెలల్లో ఒకే రోజు మార్కెట్లు ఇంట్రాడేలో ఈ స్థాయిలో పెరగడం ఇప్పుడే మొదలు.
ఇక మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు సుమారు 2 శాతం వరకూ పెరిగాయి. ఈ రోజు సెక్టోరల్ ఇండిసెస్‌లో ఒక్క మెటల్ మినహా అన్ని రంగాల సూచీలూ లాభాల్లోనే ముగిశాయి. మీడియా, పీఎస్‌యూ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్, రియాల్టీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ స్టాక్స్ మూడున్నర నుంచి నాలుగు శాతం వరకూ లాభపడ్డాయి. మెటల్ ఇండెక్స్ మాత్రమే 1 శాతం వరకూ కోల్పోయింది.

అదానీ పోర్ట్స్, హెచ్ డి ఎఫ్ సి, బజాజ్ ఫైనాన్స్, యెస్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్ స్స్టాక్స్ టాప్ ఫైవ్ గెయినర్స్‌గా నిలిచాయి. జెఎస్‌డబ్ల్యు స్టీల్, వేదాంతా, టాటా స్టీల్, హీరోమోటోకార్ప్, సన్ ఫార్మా టాప్ ఫైవ్ లూజర్స్ జాబితాలో చేరాయి.
హెచ్‌యూఎల్ ఆల్ టైం గరిష్టం
మార్కెట్లు అంతంతమాత్రంగా ఉన్నా హిందుస్తాన్ యునిలివర్ స్టాక్ మాత్రం దూసుకుపోతోంది. ఈ రోజు స్టాక్ 1883.70 స్థాయికి చేరింది. చివరకు 1 శాతం లాభంతో రూ.1875 దగ్గర స్థిరపడింది.
హెచ్ డి ఎఫ్ సికి మ్యూనిచ్ బూస్ట్
హెచ్ డి ఎఫ్ సి ఎర్గోలో అపోలో మ్యూనిచ్‌లో విలీనానికి మార్గం సుగమం అయింది. అపోలో మ్యూనిచ్‌లో హెచ్ డి ఎఫ్ సి వాటా కొనుగోలుకు ఈ రోజు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనుమతినివ్వడం కలిసొచ్చింది. దీంతో హెచ్ డి ఎఫ్ సి స్టాక్ ఈ రోజు 5 శాతం వరకూ పెరిగింది. చివరకు రూ.2148 దగ్గర క్లోజైంది.
రోడ్డు ప్రాజెక్టులను అమ్మేస్తున్న దిలీప్ బిల్డ్
ఐదు రోడ్డు ప్రాజెక్టుల్లో వాటాల అమ్మకానికి దిలీప్ బిల్డ్ కాన్ సిద్ధమైంది. మౌలిక రంగం అంతంతమాత్రంగా ఉన్న తరుణంలో ప్రస్తుతం ఈ సంస్థ జాగ్రత్తపడింది. భవిష్యత్తులో మరింత ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రాజెక్టుల్లో వాటాను అమ్ముకుని అప్పులు భారాన్ని తగ్గించుకుంటోంది. ఈ నేపధ్యంలో దిలీప్ బిల్డ్ స్టాక్ 4 శాతానికి పైగా పెరిగి రూ.371.50 దగ్గర క్లోజైంది.
డెల్టా కార్ప్ జూమ్..
వరుస పతనాలతో క్షీణిస్తున్న డెల్టా కార్ప్ స్టాక్‌కు ఈ రోజు కలిసొచ్చింది. ప్రత్యేకించి కారణం ఏదీ లేకపోయినప్పటికీ డెల్టా కార్ప్ స్టాక్ మాత్రం పది శాతం వరకూ పెరిగింది. క్యాసినో చైన్లను నడుపుతున్న ఈ కంపెనీ స్టాక్ ఈ రోజు మార్కెట్ ముగిసే సమయానికి 9 శాతం లాభపడి రూ.161 దగ్గర క్లోజైంది.
ప్రభుత్వ బ్యాంకులకు తాయిలం
లిక్విడిటీ సమస్యలతో ఇబ్బంది పడ్తున్న ప్రభుత్వ బ్యాంకులకు మూలధన కేటాయింపును ఇవ్వబోతున్నట్టు ప్రభుత్వం ప్రకటించడం ఈ బ్యాంక్ స్టాక్స్‌లో జోష్ పెంచింది. ఇండియన్ బ్యాంక్ 12 శాతం, సెంట్రల్ బ్యాంక్ 10 శాతం, అలహాబాద్ బ్యాంక్ 8 శాతం లాభపడ్డాయి. జెకె బ్యాంక్, ఎస్బీఐ, సిండికెట్ బ్యాంక్ వంటి స్టాక్స్ 3 శాతం వరకూ లాభపడ్డాయి.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications