భారీ లాభాల్లో మార్కెట్లు, దారుణంగా పడిపోయిన రూపాయి!
ముంబై: ఓ వైపు బంగారం ధరలు భారీగా పెరుగుతుంటే, మరోవైపు డాలర్‌తో రూపాయి మారకం విలువ రోజు రోజుకు బలహీనపడుతోంది. సోమవారం నాడు బంగారం భారీగా పతనమైంది. ఉదయం డాలర్ మారకంతో రూ.72.03 వద్ద ప్రారంభమైంది. ఆ తర్వాత రూ.72.25కు పడిపోయింది. చైనా యువాన్ పదకొండేళ్ల కనిష్టానికి పడిపోయింది. ఈ ప్రభావం కూడా రూపాయిపై పడింది. గత కొద్ది రోజులుగా రూపాయి బలహీనంగా ట్రేడ్ అవుతోంది.

యువాన్ దెబ్బతీస్తే, ఆదుకున్న ఆయిల్ ధరలు
ఉదయం డాలర్‌తో పోలిస్తే రూ.72.03 దగ్గరలో ట్రేడింగ్ ప్రారంభించి ఓ దశలో రూ.72.25కు చేరుకుంది. అంతకుముందుముగింపుతో పోలిస్తే ఇది 59 పైసలు తక్కువ. ఈ క్యాలెండర్ ఇయర్లో (2019) రూపాయి ఇంత భారీ నష్టాన్ని చవి చూడటం ఇదే మొదటిసారి. చైనా యువాన్‌తో కారణంగా భారీగా బలహీనపడినరూపాయి... ఆయిల్ ధరల పతనం వల్ల కొంత కోలుకుంది. లేదంటే మరింత నష్టపోయేది. గ్లోబల్ మార్కెట్లో ఆయిల్ ధరలు ఈ రోజు తగ్గిన విషయం తెలిసిందే. చివరకు రూ.71.94 వద్ద ముగిసింది.

భారీ లాభాల్లో మార్కెట్లు
సోమవారం నాడు భారతీయ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 792.96 (2.16%) పాయింట్లు ఎగిసి 37,494.12 వద్ద ముగిసింది. నిఫ్టీ 11,000 మార్క్ దాటింది. ఇది 228.5 (2.11%) పాయింట్లు పెరిగి 11,057.85 వద్ద ముగిసింది.

తగ్గిన క్రూడాయిల్...
సాయంత్రం నాలుగు గంటల సమయంలో క్రూడాయిల్ ధర 3,940.00 (77 +1.99%), బంగారం ధర 39,001.00 (236 పాయింట్లు/+0.61%) వద్ద, వెండి ధర రూ.45,050.00 (రూ.448 +1.00%) ఉంది.

ఆసియా మార్కెట్లు డౌన్
అమెరికా - చైనా వాణిజ్య యుద్ధం మరోసారి తీవ్రతరం కావడంతో ఆసియా ఈక్విటీలు సోమవారం భారీగా పడిపోయాయి. ట్రేడ్ వార్ సెంటిమెంట్ ప్రపంచవ్యాప్తంగా రిస్క్ సెంటిమెంట్ కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్లతో పాటు రూపాయి పతనం కారణంగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications