భారీ షాక్, హైదరాబాద్‌లో రూ.40,000 మార్క్ దాటిన బంగారం ధర

న్యూఢిల్లీ: బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు, అమెరికా - చైనా వాణిజ్య యుద్ధం వంటి వివిధ కారణాల వల్ల పసిడి ధర రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా సోమవారం బంగారం ధర రికార్డ్ హైకి చేరుకుంది. వెండి ధర కూడా భారీగానే పెరిగింది. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం ధర 1 శాతం పెరిగి 39,152కు చేరుకుంది. ఇటీవలే రూ.39,196కు చేరుకున్న అనంతరం ఈ సమీపానికి రావడం గమనార్హం. వెండి ధర ఆల్ టైమ్ హైకి చేరుకుంది. కిలో వెండి రూ.45,148కి చేరుకుంది. అక్టోబర్ 2016 నుంచి ఇది రికార్డ్ ధర.

పసిడిపై రూపాయి 'భారం'

పసిడిపై రూపాయి 'భారం'

అమెరికా - చైనా వాణిజ్య ఉద్రిక్తల నేపథ్యంలో ఇన్వెస్టర్లు బంగారం వైపు చూస్తున్నారు. బంగారంపై పెట్టుబడి పెడుతున్నారు. దీంతో బంగారం ధర పెరుగుతోంది. అంతర్జాతీయ పరిణామాలతో పాటు డాలర్‌తో రూపాయి బలహీనపడుతుండటంతో కూడా మన వద్ద బంగారం ధర పెరుగుతోంది. రూపాయి బలహీనపడటం వల్ల బంగరం దిగుమతుల ఖర్చు పెరుగుతోంది. ఈ ప్రభావం పసిడి పైన పడుతోంది.

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర...

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర...

అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ప్రైస్ 1 శాతం పెరిగి ఔన్సుకు $1,544.23గా ఉంది. ఏప్రిల్ 2013 నుంచి అత్యధికం ఇదే. తక్కువ వడ్డీ రేటు అమెరికాలో బంగారం పెరుగుదలకు కారణంగా మారింది. వెండి ఔన్స్ ధర 17.42 డాలర్లకు చేరుకుంది.

25 శాతం పెరిగిన బంగారం ధర...

25 శాతం పెరిగిన బంగారం ధర...

భారత్‌లో గత వారం వరుసగా పెరిగిన బంగారం ధర.. సోమవారం కూడా పెరిగింది. దీంతో వరుసగా ఆరు రోజులు పెరిగినట్లయింది. బంగారం ధర దాదాపు 25 శాతం పెరిగింది. కొద్ది రోజుల క్రితం రూ.32 నుంచి రూ.33 వేల మధ్య ఉన్న బంగారం తక్కువ వ్యవధిలోనే రూ.40,000 మార్క్‌కు చేరుకుంది.

హైదరాబాదులో రూ.40,000

హైదరాబాదులో రూ.40,000

పది గ్రాముల బంగారం (24 క్యారెట్) ధర హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం నాడు రూ.40,000 మార్క్ చేరుకుంది. ధర ఏకంగా రూ.670 పెరగడంతో రూ.40,150కి చేరుకుంది. అంతర్జాతీయ ఉద్రిక్తతలకు తోడు జువెల్లర్స్, రిటైలర్ల నుంచి డిమాండ్ ఉండటంతో ఈ ప్రభావం పడిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇదే ధర..

తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇదే ధర..

హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.590 పెరిగి రూ.36,800కు చేరుకుంది. కిలో వెండి ధర రూ.45 పెరిగి రూ.47,845కు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నంలలో కూడా దాదాపు ఇదే ధరలు ఉన్నాయి.

దీపావళి కంటే ముందే..

దీపావళి కంటే ముందే..

ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.39వేల వద్ద ఉంది. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.400 పెరిగింది. ద్రవ్యోల్భణం, అంతర్జాతీయ మార్కెట్లో పసిడిపై పెట్టుబడులు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జ్యువెల్లరీ షాపుల నుంచి డిమాండ్, అమెరికా - చైనా ట్రేడ్ వార్.. వంటి పలు కారణాలు పసిడిపై ప్రభావం చూపుతున్నాయి. దీపావళి నాటికి రూ.40వేల మార్క్ చేరుకుంటుందని అంచనా వేశారు. కానీ అంతకుముందే ఈ మార్క్‌ను దాటింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+