బంగారం ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్ )కు గిరాకీ జోరుగా పెరుగుతోంది. స్టాక్ మార్కెట్లలో ఆనిచ్చిత పరిస్థితులు నెలకొనడం ఇందుకు దారితీస్తోంది. దీంతో గోల్డ్ ఈటీఎఫ్ ల నిర్వహణ లోని ఆస్తులు (ఏయూఎం) భారీగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల కాలం (ఏప్రిల్-జులై)లో గోల్డ్ ఎక్స్చేంజి ట్రేడెడ్ ఫండ్స్ నిర్వహణలోని ఆస్తులు రూ . 5,079.22 కోట్లకు చేరుకున్నాయి. ఇదేకాలంలో దేశీయ స్టాక్ మార్కెట్ 3 శాతం మేర పడిపోయింది. మార్కెట్ల పతన భయాలతోనే ఇన్వెస్టర్లు పచ్చలోహంలో పెట్టుబడులు పెంచుకుంటున్నట్టు గణాంకాల ద్వారా తెలుస్తోంది.

ఏప్రిల్ నుంచి పెరుగుదల
* మార్న్ఇంగ్ స్టార్ గణాంకాల ప్రకారం గోల్డ్ ఈటీఎఫ్స్ నిర్వహణలో ఆస్తులు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి పెరుగుతున్నాయి. ఇదే కాలంలో (ఏప్రిల్-జులై) బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచి సెన్సెక్స్ 1,191.79 పాయింట్లు తగ్గింది. జులై లో బీఎస్ఈ బెంచ్ మార్క్ ఇండెక్స్ సెన్సెక్స్ మే నెలతో పోల్చితే దాదాపు 5 శాతం తగ్గింది.
* ఇంతకు ముందు బంగారం ధరలు తక్కువ స్థాయిలో ఉండటం వల్ల చాలా వరకు ఇన్వెస్టర్లు ఈటీఎఫ్ లకు దూరంగా ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో ధరలు పెరుగుతున్న కారణంగా మళ్ళి వీటిపై వారి దృష్టిపడింది. అందుకే వీటిలో పెట్టుబడులు పెరుగుతున్నాయి.
* బంగారం అనేది ద్రవ్యోల్భణం పెరుగుదల ఉన్న సందర్భంలో హెడ్జింగ్ కు పనికి వస్తుంది. అంతే కాకుండా ఆర్థిక మాంద్యం పరిస్థితుల్లో ఆదుకుంటుంది.

వాణిజ్య యుద్ధం ఎఫెక్ట్
* అమెరికా - చైనా మధ్య వాణిజ్య యుద్ధం నేపథ్యంలో బాండ్ రాబడులు తగ్గిపోయాయి. ఆర్థిక మాంద్యం భయాలు కూడా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు బంగారం కొనుగోలు చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఫిజికల్ బంగారానికి బదులుగా ఇప్పుడు చాలా మంది గోల్డ్ ఈటీఎఫ్ లను కొనుగోలు చేస్తుంటారు.

గోల్డ్ ఈటీఎఫ్స్ నిర్వహణలోని ఆస్తులు ఇలా ఉన్నాయి..
ఏప్రిల్ : రూ. 4,594.06 కోట్లు
మే : రూ. 4,606.69 కోట్లు
జూన్ : రూ. 4,931.16 కోట్లు
జులై : రూ. 5,079.22 కోట్లు
ఆర్ధిక ఆనిచ్చిత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో రానున్న కాలంలో బంగారం ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉండవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఫలితంగా గోల్డ్ ఏటీఎఫ్ లకు డిమాండ్ ఇంకా వృద్ధి చెందవచ్చని చెబుతున్నారు.
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు ర్యాలీ చేసిందంటే.. ఏప్రిల్ 11, శనివారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు తగ్గాయి. తాజా రేట్లు ఇక్కడ చూడండి

ఈ ఏడాది బంగారం, వెండి పెరుగుదలపై సంచలన నివేదిక.. ఏకంగా ఆ స్థాయి వరకు వెళుతుందంటున్న నిపుణులు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటన దెబ్బకు భారీగా పెరిగిన బంగారం ధరలు

Gold Price: భారీ రికార్డుల నుంచి దిగివచ్చిన పసిడి! లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఇవే..!

Gold: బంగారంపై రుణం కావాలా? గోల్డ్ లోన్ కంటే ఇదే బెస్ట్.. తక్కువ వడ్డీకే డబ్బు!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!



Click it and Unblock the Notifications