జైపూర్ : డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరిగాయి. దానికి అనుగుణంగా ప్రణాళిక రచిస్తోంది ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ . ఈ మేరకు కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది. జైపూర్లో జరిగిన ఓ సమావేశంలో ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ .. కీలక నిర్ణయాలను వెల్లడించారు. యోనో క్యాష్ పాయింట్లను పెంచుతామని పేర్కొన్నారు. ఆటోరంగం అనిశ్చితికి గల కారణం అన్వేషించాల్సి ఉందని పేర్కొన్నారు.
యోనో క్యాష్ పాయింట్ల సంఖ్యను మరింత పెంచుతామని రజనీశ్ తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 70 వేల క్యాష్ పాయింట్లు ఉన్నాయని వివరించారు. వచ్చే 18 నెలల్లో అవి 10 లక్షలకు చేరతాయని తెలిపారు. డిజిటల్ చెల్లింపుల వినియోగం పెరిగడం వల్ల .. డెబిట్ కార్డు వాడకం తగ్గిపోతుందని అపోహ లేదన్నారు. అలాగే డెబిట్ కార్డులను నిలిపివేసే యోచన కూడా తమకు లేదన్నారు.

ఆటోరంగం తిరోగమనానికి గల కారణాలను కనుక్కొవాల్సి ఉందన్నారు. ఉద్యోగాల్లో అనిశ్చిత వల్ల వినియోగదారులు తమ సొంత కార్లను కొనుగోలు చేయడం లేదన్నారు. క్యాబ్, అద్దెకార్లకే మొగ్గుచూపుతున్నారని వివరించారు. అయితే ఇది ఎప్పటివరకు ఉంటుందనే అంశంపై క్లారిటీ లేదన్నారు. దానిపై లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications