హైదరాబాద్ : నగరంలో ప్రముఖ ఈక్వివీ కంపెనీ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుడుతోంది. దేశ రక్షణ కోసం ఆ శాఖలో పనిచేసిన వారి కుటుంబ సభ్యులకు,లేదా శారీరకంగా దృఢంగా ఉన్న వారికి మళ్లీ ఉద్యోగం అవకాశం కల్పించేందుకు సిద్దమవుతోంది. రక్షణ బలగాల్లో పని చేసి పదవీ విరమణ పొందిన వారికి కంపెనీల్లో ఉద్యోగావకాశాలు కల్పించడానికి హైదరాబాద్‌కు చెందిన ఈక్వివీ డాట్ ఇన్ కంపెనీ 'ఫ్రాంటియర్స్' పేరుతో జాబ్ మేళా కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది.
కంపెనీల్లో ఇప్పటికే 'ఉమెన్ ఛేంజ్ మేకర్స్ కేరీర్ ఫెయిర్ అండ్ కాన్‌ఫ్లూయన్స్' పేరుతో మహిళలకు జాబ్ మేళాలను నిర్వహించి ఉద్యోగావకాశాలను కల్పిస్తోంది. ప్రస్తుతం మహిళలకు, దివ్యాంగులకు ఉద్యోగాలు కల్పిస్తున్నామని.. త్వరలో రక్షణ బలగాల్లో పని చేసి పదవీ విరమణ చేసిన వారికి కూడా కంపెనీ కొత్త ప్లాట్‌ఫారమ్‌ను కల్పించనుందని ఈక్వివీ డాట్ ఇన్ వ్యవస్థాపకుడు, సీఈఓ నరేన్ కృష్ణ తెలిపారు. ట్రాన్స్‌జెండర్ల (ఎల్‌జీబీటీక్యూఐఏ)కు ఉద్యోగావకాశాలు కల్పించే సేవలందించనున్నట్లు చెప్పారు.

అంతే కాకుడా ఈక్వివీ నుంచి సేవలు పొందుతున్న కంపెనీలో ఇన్ఫోసిస్, అమెజాన్, బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి దాదాపు 63 కంపెనీలు ఉన్నాయి. ఇప్పటి వరకూ మహిళల కోసం 10 ఉమెన్ ఛేంజ్ మేకర్స్ మేళాలను నిర్వహించామని.. తొలిసారిగా హైదరాబాద్‌లో శనివారం నిర్వహిస్తున్నామని కృష్ణ వివరించారు. ఇప్పటి వరకూ జరిగిన మేళాల్లో 63,00 మంది మహిళలు పాల్గొన్నారని 800 మంది ఉద్యోగాలు పొందారని చెప్పారు. ప్రధానంగా ఐటీ, బ్యాంకింగ్, కన్సల్టెంగ్ కంపెనీలకు నియామక సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.
సబ్‌స్ర్కిప్షన్ ప్రాతిపదికన కంపెనీల నుంచి ఈక్వివీ రుసుము వసూలు చేస్తోంది. లాభాల్లో పని చేస్తున్న ఈ స్టార్టప్ మదుపర్ల నుంచి రూ.కోటిన్నర నిధులు సమీకరించింది. ఈ ఏడాది (డిసెంబరు) చివరి నాటికి మరో 20-30 లక్షల డాలర్ల నిధులను సమీకరించనుంది. ప్రస్తుతం కంపెనీలో 19 మంది పని చేస్తున్నారని 2023 నాటికి ఉద్యోగులను 150 మందికి పెంచుకోవాలని భావిస్తున్నట్లు కృష్ణ చెప్పుకొస్తున్నారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications