మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టాలనుకునే ఇన్వెస్టర్లు ఏ ఫండ్స్ ఎంచుకోవాలన్న విషయంలో సందిగ్ధంలో ఉంటారు. మార్కెట్లో తీవ్ర హెచ్చుతగ్గులు ఉన్నప్పుడు పెట్టుబడులపై నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితిలో ఇన్వెస్టర్లు మల్టీ క్యాప్ ఫండ్స్ ను ఎంచుకోవచ్చని చాలామంది అడ్వైజర్లు చెబుతున్నారు.

మల్టీ క్యాప్ ఫండ్ అంటే?
* మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లో లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఫండ్స్ ఉంటాయి. ఇది వివిధీకరించిన ఈక్విటీ మ్యూచువల్ ఫండ్. వివిధ షేర్లలో దీని ద్వారా పెట్టుబడి పెడతారు.
* సెబీ నిబంధనల ప్రకారం ఇలాంటి స్కీం లు ఈక్విటీ, ఈక్విటీ సంభందిత సాధనాల్లో కనీసం 65 శాతం పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
* ఈ పోర్ట్ ఫోలియో లో లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కంపెనీల షేర్లు ఉంటాయి.
* విభిన్న రకాల మార్కెట్ క్యాపిటలైజేషన్, రంగాలకు చెందిన షేర్లు ఇందులో ఉంటాయి.
* ఈ పోర్ట్ ఫోలియో ద్వారా ఇన్వెస్టర్లు మంచి షేర్లను ఎంచుకునే అవకాశం ఉంటుంది.

మల్టీ క్యాప్ ఫండ్ కేటగిరీ ద్వారా
* మల్టీ క్యాప్ ఫండ్ కేటగిరీ ద్వారా ఫండ్ మేనేజర్లు ఫండ్ హోల్డింగ్స్ ను లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ మధ్య మార్పులు చేసుకునే అవకాశం ఉంటుంది. మార్కెట్ లో చోటుచేసుకునే మార్పులకు అనుగుణంగా ఇవి చోటుచేసుకుంటాయి.
* మిడ్, స్మాల్ క్యాప్ లోని షేర్లు ఖరీదుగా మారితే ఫండ్ మేనేజర్ లార్జ్ క్యాప్ షేర్లను ఎంచుకుంటారు. లేదా ఇవి ఖరీదుగా మారితే మిడ్, స్మాల్ క్యాప్ షేర్లను ఎంచుకుంటారు.
* పూర్తిగా లార్జ్ క్యాప్ ఫండ్స్ అయితే తమ పోర్ట్ ఫోలియో లో కనీసం 80 శాతం టాప్ 100 షేర్లలో పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది.
* దీర్ఘ కాలంలో ఈ కేటగిరీ ఫండ్స్ పూర్తి మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఫండ్స్ తో పోల్చితే తక్కువ రిస్క్ ను కలిగి ఉంటాయి.

ఎవరు ఎంచుకోవచ్చు..
* రిస్కుతో పాటు మార్కెట్ హెచ్చుతగ్గులను సమం చేసుకోవాలనుకునే ఇన్వెస్టర్లు మల్టీ క్యాప్ ఫండ్స్ ను ఎంచుకోవచ్చు.
* మంచి రిటర్న్ ను ఇచ్చే షేర్లను ఎంచుకోవడంలో కష్టం ఉంటుంది. తమకు తగిన విధంగా ఉండే షేరును గుర్తించడం కూడా ఇబ్బందే. ఇలాంటి వారు మల్టీ క్యాప్ ఫండ్స్ పై దృష్టి సారించవచ్చని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
* లార్జ్ క్యాప్ ఫండ్స్ తో పోల్చితే మల్టీ క్యాప్ క్యాటగిరీ ఫండ్స్ ఎక్కువ సంపదను అందిస్తాయని అంటున్నారు.
* రిటైర్ మెంట్, ఉన్నత విద్య వంటి దీర్ఘ కాలిక ఆర్ధిక అవసరాలకు ఈ ఫండ్స్ బాగా దోహదపడతాయని చెబుతున్నారు.
* క్రమానుగత పెట్టుబడి ప్లాన్ (సిప్) ద్వారా పెట్టుబడులు పెట్టాలనుకునే వారు కూడా వీటిపై ద్రుష్టి సారించవచ్చని సూచిస్తున్నారు.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications