ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం నాడు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆర్థిక మందగమన భయంతో మూడు రోజులు నష్టాల్లో ట్రేడ్ అయిన మార్కెట్లు ఈ వారంలో క్లోజింగ్ డే కూడా నష్టాల్లోనే ట్రేడింగ్ ప్రారంభించాయి. ఉదయం గం.9.35 నిమిషాలకు సెన్సెక్స్ 311 పాయింట్లు కోల్పోయి 36,161 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 87 పాయింట్లు నష్టపోయి 10,654 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.
ఆ తర్వాత పదకొండు గంటల సమయానికి సెన్సెక్స్ పుంజుకుంది. 28.34 (0.078%) లాభంతో వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 31.65 (0.29%) లాభంతో 10,773.00 వద్ద ట్రేడ్ అయింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 72.01 వద్ద ట్రేడ్ అవుతోంది.

వేదాంత, కోల్ ఇండియా, విప్రో, యస్ బ్యాంకు, ఇన్ఫోసిస్ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడ్ అవగా, ఐసీఐసీఐ, సిప్లా, మారుతీ సుజుకీ, ఇండస్ ఇండ్, టైటాన్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. రంగాలవారీగా చూస్తే ఐటీ, ఆటో షేర్లు మినహా మిగతా షేర్లు నష్టాలను చూశాయి.
రూపాయి విలువ తగ్గుతుండటంతో ఐటీ షేర్లు దూసుకెళ్లాయి. ఓఎఫ్ఎస్ఎస్, టీసీఎస్, టాటాఈఎల్ఎక్స్ఎస్ఐ, మైండ్ ట్రీ, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, ఇన్ఫోసిస్, నిట్ టెక్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. యస్ బ్యాంకు షేర్లు 7 శాతం లాభపడ్డాయి బ్యాంకు, ఎఫ్ఎంసీజీ, ఫార్మా షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఎనర్జీ, ఇన్ఫ్రా, ఐటీ, మెటల్ షేర్లు కొనుగోలు చేస్తున్నారు.
More From GoodReturns

Bengaluru: బెంగళూరు వదిలి ఐర్లాండ్‌కు.. ఖర్చు పెరిగినా సంతోషంగా ఉన్నానంటున్న టెక్కీ!

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

బెంగళూరు రియల్ ఎస్టేట్.. ఈ ఒక్క కారిడార్‌కు పుల్లు డిమాండ్.. ఇళ్లను ఎగబడి కొంటున్న ఇన్వెస్టర్లు..

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

బంగారం ధరలు తగ్గిపోతున్నాయి.. ఈ రోజు ఎంత ఢమాల్ అయిందంటే.. మార్చి 16, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications