ముంబై: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు (ఆగస్ట్ 23, 2019) ఐదు గంటలకు మీడియా ముందుకు రానున్నారు. ఆటోమొబైల్, ఎఫ్ఎంసీజీ తీవ్ర సంక్షోభంలో ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితి అలాగే ఉంది. దాదాపు అన్ని రంగాలు ఆర్థికమాంద్యం భయంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా మార్కెట్లు తీవ్ర నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. గురువారం నష్టాలను మూటగట్టుకున్న మార్కెట్లు, శుక్రవారం ఉదయం నుంచి కూడా ఒడిదుడుకుల మధ్య ట్రేడ్ అయ్యాయి.

మార్కెట్లకు నిర్మలా ప్రెస్ మీట్ ఉత్తేజం
అయితే నిర్మలా సీతారామన్ మీడియా ముందుకు వస్తారని తెలియడంతో మార్కెట్లు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. చివరి గంటలో సెన్సెక్స్, నిఫ్టీలు పైకి ఎగిరాయి. ముఖ్యంగా FPIల పెట్టుబడులపై ఊరట కలిగించే ప్రకటన ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో మార్కెట్లో సాయంత్రానికి కొత్త ఉత్సాహం కనిపించింది. 228.23 (0.63%) పాయింట్ల లాభంతో 36,701.16 వద్ద సెన్సెక్స్ క్లోజ్ అయింది. నిఫ్టీ కూడా 88.00 (0.82%) ఎగబాకి 10,829.35 వద్ద ముగిసింది. ఉదయం సెన్సెక్స్ 200కు పైగా పాయింట్ల నష్టానికి చేరుకుంది. కానీ సాయంత్రానికి పుంజుకుంది.

సూపర్ రిచ్‌కు ఊరట
వివిధ రంగాల్లో ఆర్థిక మందగమనం నేపథ్యంలో కేంద్రం దిద్దుబాటు చర్యలకు సిద్ధమవుతోంది. విదేశీ ఫోర్టుఫోలియో ఇన్వెస్టర్లను (FPI) సంతృప్తి పరిచేందుకు చర్యలు తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సూపర్ రిచ్ పైన విధించే సర్‌ఛార్జీ నుంచి మినహాయింపు ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ మేరకు ప్రకటన రావొచ్చు. అదే సమయంలో ఆర్థిక మందగమనంపై ఉద్దీపన చర్యలు తీసుకున్నారని తెలుస్తోంది. అధికారికంగా నిర్మల వీటిని వెల్లడించనున్నారని తెలుస్తోంది.

ఎఫ్‌పీఐలు వెనక్కి...
FPIలపై కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవడంతో మార్కెట్లు సాయంత్రానికి ఉత్సాహంతో క్లోజ్ అయ్యాయి. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్ల మధ్య ఆదాయ పన్ను ఉన్నవారికి వర్తించే సర్‌ఛార్జ్ 15%నుంచి 25%, రూ.5 కోట్ల పైన పన్ను ఆదాయం ఉన్న వారికి సర్‌ఛార్జిని 15% నుంచి 37%కు పెంచుతున్నట్లు ప్రకటించారు. దీని పరిధిలోకి FPIలు కూడా వచ్చారు. దీంతో పెట్టుబడులు గత కొన్నాళ్లుగా వెనక్కి తీసుకుంటున్నారు. దీంతో కేంద్రం దిద్దుబాటు చర్యలు తీసుకుంటోందని తెలుస్తోంది. అలాగే, ఆటో రంగానికి సంబంధించి ఉద్దీపన చర్యలు చేపట్టే అవకాశముంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications