For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.72కు పడిపోయిన రూపాయి, 4 ప్రధాన కారణాలు

|

ముంబై: డాలర్‌తో రూపాయి మారకం విలువ శుక్రవారం ఎనిమిది నెలల కనిష్టానికి దిగజారింది. 2019 క్యాలెండర్ ఇయర్లో తొలిసారి రూ.72ను దాటింది. ఆ తర్వాత మధ్యాహ్నానికి కాస్త కోలుకొని, 71.63 వద్ద నిలిచినప్పటికీ, గత కొద్ది రోజులుగా రూపాయి విలువ పడిపోతోంది. దీనికి పలు కారణాలు ఉన్నాయి.

<strong>తొలిసారి డాలర్‌తో రూ.72కు దిగజారిన రూపాయి!</strong>తొలిసారి డాలర్‌తో రూ.72కు దిగజారిన రూపాయి!

డాలర్‌కు డిమాండ్

డాలర్‌కు డిమాండ్

గత కొద్ది నెలలుగా విదేశీ పోర్ట్‌పోలియో ఇన్వెస్టర్లు (FPIs) మార్కెట్లో స్టాక్స్ విక్రయిస్తున్నారు. ఈ ఆగస్ట్ నెలలోనే దాదాపు రూ.10,655 కోట్ల మొత్తాన్ని వెనక్కి తీసుకున్నారు. ఇది జూలై నెలలో రూ.16,870 కోట్లుగా ఉంది. మార్కెట్లో FPIలు తమ స్టాక్స్ విక్రయిస్తున్న నేపథ్యంలో డాలర్‌కు డిమాండ్ పెరిగింది. రూపాయి బలహీనపడటానికి ప్రధాన కారణాలలో ఇది ఒకటి.

యువాన్ బలహీనత

యువాన్ బలహీనత

చైనా కరెన్సీ యువాన్ హఠాత్తుగా బలహీనపడింది. అభివృద్ధి చెందుతోన్న మార్కెట్ కరెన్సీపై ఈ ప్రభావం పడింది. చైనా ఎగుమతి ఆధారిత వ్యవస్థ అయితే ఈ కరెన్సీ బలహీనత గురించి ఆందోళన చెందరు. కానీ భారత్ విషయానికి వస్తే కరెన్సీ బలహీనపడటం ఆందోళనకర అంశం. భారత్ కీలకమైన ఉత్పత్తులలో దిగుమతులపై ఆధారపడి ఉంది. క్రూడాయిల్ వంటి ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. ఈ ప్రభావం రిటైల్ పైన కూడా పడుతుంది.

బలపడుతున్న డాలర్

బలపడుతున్న డాలర్

ప్రపంచ మార్కెట్లు చాలా వరకు అమెరికా డాలర్‌పై ఆధారపడి ఉన్నాయి. మార్కెట్లు అన్నీ యూఎస్ సెంట్రల్ బ్యాంకు యాన్యువల్ జాక్సన్ హోల్ సింపోజియంపై దృష్టి సారించినందువల్ల డాలర్ బలం అలాగే ఉంది.

ఆర్బీఐ జోక్యం లేకపోవడం

ఆర్బీఐ జోక్యం లేకపోవడం

ఆర్బీఐ మార్కెట్లో జోక్యం చేసుకునే అవకాశం లేదు. డాలర్‌తో రూపాయి మారకం విలువ 72కు చేరడం అస్థిరతకు దారి తీసే అవకాశాలు ఉంటాయి. ఏదేమైనా, ఆర్బీఐ డాలర్స్‌ను విక్రయించాలనుకుంటే విదేశీ నిల్వలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం రూపాయి బలహీనపడటం తాత్కాలికంగానే కనిపిస్తుందని, మరింత పతనం ఉండకపోవచ్చును.

English summary

రూ.72కు పడిపోయిన రూపాయి, 4 ప్రధాన కారణాలు | 4 Reasons Why the Rupee Fell Past 72 To Hit 2019 Low

The rupee today hit a new 2019 low, which saw it moving past the 72 mark with ease. It hit 72.03 against the dollar in intra-day trade in the inter bank currency market. Here are 4 reasons why it hit a new 2019 low.
Story first published: Friday, August 23, 2019, 14:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X