ఆ సమాచారమిస్తే రూ.కోటి నజరానా, ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి!

న్యూఢిల్లీ: సెబి బుధవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రేటింగ్ నిబంధనలు కఠినతరం చేసింది. బ్యాంకులు అన్ని రుణాల వివరాలను ప్రకటించడాన్ని తప్పనిసరి చేసింది. ఇన్‌సైడర్ ట్రేడింగ్ పైన సమాచారం ఇస్తే నజారానా ప్రకటిస్తుంది. మున్సిపల్ బాండ్లను జారీ చేసేందుకు స్మార్ట్ సిటీలకు అనుమతి ఇచ్చింది. సూచీల్లోకి స్టార్టప్స్‌ను తీసుకు వస్తుంది. మ్యుచువల్ ఫండ్స్‌కు ఇన్వెస్ట్‌మెంట్ సూచనలు చేసింది. లిస్టెడ్ సెక్యూరిటీల్లోనే పెట్టుబడి పెట్టాలని సూచించింది. అదే సమయంలో షేర్ హోల్డింగ్‌ను 35%కు పెంచాలనే ప్రతిపాదనపై సమీక్ష అవసరమని అభిప్రాయపడింది. ఈ మేరకు బోర్డు సమావేశంలో కీలక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. వాటాదార్లు, ఇన్వెస్టర్ల ప్రయోజనాలను పరిరక్షించే ఉద్దేశ్యంతో సెబి పలు నిర్ణయాలు తీసుకుంది. ఎఫ్‌పీఐల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసేందుకు నిబంధనలను సరళతరం చేసింది. బైబ్యాక్ నిబంధనల్లో కూడా మార్పులు చేర్పులు చేసింది.

ఇన్‌సైడర్ ట్రేడింగ్... కోటి నజరానా

ఇన్‌సైడర్ ట్రేడింగ్... కోటి నజరానా

ఎవరైనా ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడుతున్నట్లు సమాచారం ఇస్తే రూ.1 కోటి వరకు నజారానా ఇవ్వనున్నట్లు సెబి తెలిపింది. షేరును ప్రభావితం చేసే అప్రకటిత సమాచారం ఆధారంగా కొందరు మాత్రమే ట్రేడింగ్‌ చేయడాన్ని ఇన్‌సైడర్ ట్రేడింగ్‌గా వ్యవహరిస్తారు. ఎవరైనా ఇలా చేసినప్పుడు అందుకు సంబంధించిన సమాచారాన్ని హాట్ లైన్ ద్వారా ఇవ్వాలి. ఇందుకు సెబీ కొత్త వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. అయితే ఈ నజరానా వ్యక్తులు, కార్పోరేట్లకు మాత్రమే. రూ.1 కోటి వరకు అక్రమ లాభాన్ని పొందకుండా నిలువరిస్తే లేదా వసూలు చేసినా.. ఈ బహుమతికి అర్హులు. అక్రమార్జనలో వసూలైన దానిలో కనీసం 10 శాతం, గరిష్టంగా రూ.1కోటి వరకు ఇస్తారు. చిన్న చిన్న తప్పులకు పాల్పడిన వాళ్లు విచారణకు సహకరిస్తే శిక్ష తగ్గింపు అవకాశం కల్పిస్తుంది. ఇన్‌సైడర్ ట్రేడింగ్ సమాచారం అందించే వ్యవస్థ ఏర్పాటుకు వీలు కల్పిస్తూ ఇన్‌సైడర్ ట్రేడింగ్ నిషేధం నిబంధనల కింద ఇన్ఫర్మాంట్ మెకానిజం పేరుతో కొత్త నిబంధన ప్రవేశపెట్టాలని, ఆఫీస్ ఆఫ్ ఇన్ఫార్మెంట్ ప్రొడక్షన్ పేరుతో కొత్త యంత్రాంగం ఏర్పాటు చేయాలని సెబి నిర్ణయించింది. అయితే సమాచారం అందించే వ్యక్తి ఎవరైనా తమకు ఆ విషయం సెబిలో పని చేస్తున్న వ్యక్తుల ద్వారా అందలేదని ధ్రువీకరించాలి.

మ్యుచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్ల ప్రయోజకర నిర్ణయాలు

మ్యుచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్ల ప్రయోజకర నిర్ణయాలు

మ్యుచువల్ ఫండ్స్‌కు కఠిన నిబంధనలు జారీ చేసింది. లిస్టింగైన లేదా లిస్టింగ్ కాబోయే ఈక్విటీ, డెట్ సెక్యురిటీల్లోనే మ్యుచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తే మంచిది. మ్యుచువల్ ఫండ్ సంస్థలు తమ పెట్టుబడుల్ని క్రమంగా నమోదిత, నమోదుకానున్న ఈక్విటీ, డెట్‌ సెక్యూరిటీల్లోకి బదిలీ చేయాలని సూచించింది. అలాగే రేటింగ్ లేని డెట్ సాధనాల్లో ప్రస్తుతం 25 శాతంగా ఉండే ఇన్వెస్ట్‌మెంట్స్‌ను 5 శాతానికే పరిమితం చేయాలని సూచించింది. లిస్ట్ కానీ మార్పిడి రహిత డిబెంచర్లలో గరిష్ఠంగా పది శాతం వరకు ఫండ్స్ ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ ప్రతిపాదిత పరిమితులపై కాలానుగుణంగా సమీక్షించి, అప్పటి పరిస్థితికి తగినట్లు నిర్ణయాలు ఉంటాయి. నమోదిత సెక్యూరిటీలన్నింటికీ రేటింగ్ తప్పనిసరిగా ఉంటుంది. మ్యుచువల్ ఫండ్ ఇన్వెస్టర్ల ప్రయోజానాల్ని కాపాడేందుకు పలు నిర్ణయాలు తీసుకున్నది.

లిస్టెడ్ కంపెనీల్లో 35 వాటాపై..

లిస్టెడ్ కంపెనీల్లో 35 వాటాపై..

లిస్ట్ అయిన కంపెనీల్లో ప్రజలకు ఉండాల్సిన కనీస వాటాను 25 శాతం నుంచి 35 శాతానికి పెంచాలనే ప్రతిపాదనను పరిశీలించాల్సి ఉందని సెబి తెలిపింది. 35% పబ్లిక్ హోల్డింగ్‌కు సంబంధించిన వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది.

స్టార్టప్స్‌కు ఉత్తేజం

స్టార్టప్స్‌కు ఉత్తేజం

స్టార్టప్స్‌కు కూడా కొత్త ఉత్సాహం ఇచ్చే నిర్ణయాన్ని సెబి తీసుకుంది. ప్రస్తుతం స్టాక్ ఎక్స్చేంజ్‌ల ఇన్నోవేటర్స్ గ్రోత్ ప్లాట్‌ఫాం (IGP) పైన నమోదైన స్టార్టప్స్ ఇక నుంచి స్టాక్ సూచీలకు మారే వెసులుబాటు కల్పించింది. నిబంధనల ప్రకారం ఏడాది తర్వాత సాధారణ ట్రేడింగ్‌కు మారేందుకు స్టార్టప్స్‌కు అనుమతి ఇచ్చింది. దీనికి కొన్ని షరతులు వర్తిస్తాయి. వాటాదార్ల సంఖ్యను కనీసం 200కు పెంచుకోవడం, వరుసగా మూడేళ్ల పాటు లాభాలు నమోదు కావడం, కనీసం 75 శాతం వాటా అర్హులైన సంస్థాగత ఇన్వెస్టర్ల చేతిలో ఉండటం, ప్రమోటర్లు 20 శాతం వాటాను మూడేళ్ల పాటు కొనసాగించడం వంటి నిబంధనలు ఉన్నాయి.

బైబ్యాక్ సరళతరం

బైబ్యాక్ సరళతరం

లిస్టైన కంపెనీల బైబ్యాక్ షేర్ల నిబంధనలను సడలించింది. NBFC, హోమ్ లోన్ విభాగంలో అనుబంధ సంస్థలున్న కంపెనీల బైబ్యాక్ నిబంధనల్లో మార్పులు తీసుకు వచ్చింది. ఈ ప్రతిపాదనలను ఆమోదించింది. సెబి నిబంధనల ప్రకారం ఏ కంపెనీ అయినా ప్రకటించే షేర్ల బైబ్యాక్ మొత్తం పెయిడప్ కేపిటల్‌లో 25 శాతం మించకూడదు. 10 శాతం దాటితే షేర్ హోల్డర్ల అనుమతి అవసరం.

బాండ్స్‌తో నిధులు

బాండ్స్‌తో నిధులు

స్మార్ట్ సిటీలు, సిటీ ప్లానింగ్, అర్బన్ డెవలప్‌మెంట్ విభాగాల్లో నమోదైన సంస్థలు మున్సిపల్ బాండ్స్‌తో నిధులను సమీకరించవచ్చునని తెలిపింది. స్మార్ట్ సిటీలు, వాటిపై పని చేస్తున్న సంస్థలు ఈ బాండ్స్ జారీ ద్వారా నిధులు సమీకరించుకునే వెసులుబాటును కల్పించింది.

FPI కేవైసీ నిబంధనలు సరళతరం

FPI కేవైసీ నిబంధనలు సరళతరం

విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్ల కేవైసీ నిబంధనలను సరళతరం చేసింది. ఎఫ్‌పఐల రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం, సులభం కానుంది. అలాగే, ఏ లిస్టెడ్ కంపెనీ లేదా అన్‌‌లిస్టెడ్‌ కంపెనీ ఐనా రేటింగ్ కోరే ముందు వారి ప్రస్తుత రుణాలు, వాటి చెల్లింపుల ధోరణి, జాప్యాలు, ఎగవేతలు, ముందు తీసుకోబోయే రుణాల వంటి వివరాలు బ్యాంకుల నుంచి సేకరించి వాటిని రేటింగ్ ఏజెన్సీలకు అందించాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+