For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నష్టాల్లో మార్కెట్లు: 250 కోల్పోయిన సెన్సెక్స్, 77 పాయింట్ల నష్టంలో నిఫ్టీ

|

న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లు గురువారం ఉదయం మందకోడిగా ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఆ తర్వాత మధ్యాహ్నం సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో సెన్సెక్స్ 161 పాయింట్లు నష్టపోయి 36,899 వద్ద ట్రేడ్ కాగా, నిఫ్టీ 13 పాయింట్లు కోల్పోయి 10,905 వద్ద ట్రేడ్ అయింది. మధ్యాహ్నం గం.11.50 నిమిషాల సమయంలో సెన్సెక్స్ 240.23 (0.65%) కోల్పోయి 36,818.18 వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 77.30 (0.71%) నష్టపోయి 10,841.40 వద్ద ట్రేడ్ అయింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.71.73 వద్ద ఉంది.

సెబి పలు నిబంధనల్లో మార్పులు తీసుకురావడంతో పాటు ఆర్థిక మందగమనం భయంతో మార్కెట్లు నష్టాలను తాకుతున్నాయి. నితిన్ గడ్కరీ ప్రకటన ఆటో సెక్టార్‌కు ఊతమివ్వడంతో పాటు బుధవారం నాడు వాల్‌స్ట్రీట్ లాభాల్లో ముగియడం దేశీయ మార్కెట్లకు ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Market Update: Sensex shes 250 pts, Nifty below 10,900

మధ్యాహ్నం గం.11.30 నాటికి నిఫ్టీలో లాభపడిన కంపెనీల్లో బ్రిటానియా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హెచ్‌యూఎల్, టీసీఎస్, ఐటీసీ. టాప్ లూజర్స్ విషయానికి వస్తే ఇండియాబుల్స్, యస్ బ్యాంకు, యూపీఎల్, బజాజ్ ఫైనాన్స్ సర్వీసెస్, వేదాందలు ఉన్నాయి.

English summary

నష్టాల్లో మార్కెట్లు: 250 కోల్పోయిన సెన్సెక్స్, 77 పాయింట్ల నష్టంలో నిఫ్టీ | Market Update: Sensex shes 250 pts, Nifty below 10,900

Shares of Dewan Housing Finance Corporation (DHFL) fell over 8 percent on BSE in August 22 session amid reports that the lenders are looking to take a 51 percent stake in the company by converting a part of the debt into equity
Story first published: Thursday, August 22, 2019, 11:58 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X