న్యూఢిల్లీ: పెన్షనర్లకు గుడ్ న్యూస్! ఈపీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం సంతోషకరమైన వార్తను చెప్పనుంది. ఈపీఎఫ్ కనీస పింఛన్‌ను పెంచే ఆలోచనలో ఉన్నట్లు కేంద్ర కార్మిక శాఖమంత్రి సంతోష్ గాంగ్వార్ తెలిపారు. ప్రస్తుతం కనీస పింఛన్ రూ.1,000 ఉంది. దీనిని రూ.5వేల వరకు పెంచాలనే డిమాండ్స్ ఉన్నాయి. ఆర్థికమంత్రిత్వ శాఖతో చర్చించి పదిహేను రోజుల్లో ఓ నిర్ణయానికి వస్తామన్నారు. పీఎఫ్ఓ ఖాతాదారులు 8 కోట్లకు పైగా పెరిగినట్లు తెలిపారు.
ఈపీఎఫ్ పైన ఉద్యోగులకు 5.65 శాతం వడ్డీ చెల్లించేందుకు త్వరలో ఆర్థిక శాఖ అనుమతి రానుందట. దేశంలో ఉద్యోగిత రేటు పెరుగుతుందని, ఈపీఎఫ్ఓ సబ్‌స్క్రైబర్ల సంఖ్య ఆరు కోట్ల నుంచి 8 కోట్లకు చేరడమే ఇందుకు నిదర్శనమన్నారు. కనీస పింఛన్ ధర రూ.వెయ్యిగా ఉండగా, రూ.2 వేలు, రూ.3వేలు, రూ.5వేలు పెంచాలని డిమాండ్స్ ఉన్నాయి. 15 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు.

కాగా, పెన్షన్ రిస్టోరేషన్ కమ్యూటెడ్ వ్యాల్యూ రికమండేషన్‌కు ప్రభుత్వం గురువారం ఆమోదం తెలిపింది. పెన్షన్ మార్పిడి విలువను పునరిద్ధరించాలనే సిఫార్సు ప్రతిపాదనకు పదిహేనేళ్ల తర్వాత ఆమోదం లభించింది. ఇది ఎంప్లాయీస్ పెన్షన్ స్కీం 1995 సవరణకు సంబంధించినది. ఇది పెన్షనర్ల దీర్ఘకాలిక డిమాండ్. హైదరాబాదులో జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఈపీఎప్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications