ఆసియా అతిపెద్ద సిగరేట్ మేకర్ ITC కూడా కేఫ్ కాఫీ డేలో వాటాలు కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతోందా అంటే అవునని అంటున్నారు. ఎఫ్ఎంసీజీ, హోటల్స్, అగ్రి తదితర వ్యాపార విభాగాలు కలిగి ఉన్న ఐటీసీ కాఫీ డే ఎంటర్ ప్రైజెస్ కొనుగోలును పరిశీలిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కోకాకోలా.. కాఫీడేతో చర్చలు జరుపుతోంది. ఈ నేపథ్యంలో ఐటీసీ కూడా రేసులోకి రావడం గమనార్హం.
కాఫీ డే కొనుగోలు అంశం ఐటీసీ పరిశీలనలో ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కేఫ్ కాఫీడే మదర్ కంపెనీ కాఫీ డే ఎంటర్ ప్రైజెస్ కౌంటర్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. కోకాకోలాకు ఐటీసీ పోటీ ఇవ్వవచ్చునని భావిస్తున్నారు.

భారతదేశంలో పొగాకుపై పన్నులు పెంచుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానాన్ని పరిమితం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సిగరేట్ వ్యాపారంపై ఆధారపడటం తగ్గించాలని ఐటీసీ ఇతర రంగాల్లోను తన బిజినెస్‌ను విస్తరిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పుడు కాఫీ డేపై దృష్టి సారించింది. కాఫీ డే వ్యవస్థాపకులు వీజీ సిద్ధార్థ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
సమాచారం మేరకు చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయి. కోకాకోలాతో పాటు ఐటీసీ కూడా కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో కాఫీడేకు డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నారు. మార్కెట్లోను కాఫీడే షేర్లు బుధవారం 3.45 శాతం ఎగబాకాయి. వీజి సిద్ధార్థ ఆత్మహత్య అనంతరం కాఫీడే షేర్లు భారీగా నష్టపోయాయి. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి.
కాఫీడేకు 1700కు పైగా ఔట్ లెట్స్ ఉన్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications