For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హైదరాబాద్‌లో ప్రపంచంలో అతిపెద్ద అమెజాన్ క్యాంపస్, ప్రత్యేకత

|

హైదరాబాద్: ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్ ప్రపంచంలోనే (అమెరికాలో కాకుండా) అతిపెద్ద క్యాంపస్‌ను హైదరాబాదులో ప్రారంభిస్తోంది. ఈ రోజు (బుధవారం, ఆగస్ట్ 21, 2019) దీనిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఈ క్యాంపస్‌కు 2016 మార్చి 31వ తేదీన నాటి మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. ఇప్పుడు కేసీఆర్ దీనిని ప్రారంభిస్తున్నారు. ఐటీ హబ్ గచ్చిబౌలి ప్రాంతంలో దీనిని ఏర్పాటు చేశారు.

<strong>రూ.5 బిస్కట్ పాకెట్ కూడా కొనలేకపోతున్నారు</strong>రూ.5 బిస్కట్ పాకెట్ కూడా కొనలేకపోతున్నారు

ఈ క్యాంపస్ ప్రత్యేకతలు

ఈ క్యాంపస్ ప్రత్యేకతలు

దాదాపు పదిహేను అంతస్తుల్లో 30 లక్షల చ.అ. స్థలంలో దీనిని నిర్మించారు. ఇందులో 10 లక్షల చ.అ.ను పార్కింగ్ కోసం కేటాయించారు. ఆధునిక టెక్నాలజీ, ఆధునిక సౌకర్యాలతో దీని నిర్మాణం చేపట్టారు. 9,000 నుంచి 10,000 మంది సీటింగ్ కెపాసిటీ కలిగి ఉంది. ప్రస్తుతం అమెజాన్‌కు 7వేల మంది ఉద్యోగులు ఉన్నారు. త్వరలో ఈ సంఖ్య పదివేలకు చేరుకోనుంది. ఈ క్యాంపస్ నుంచి అమెజాన్ ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలను నిర్వహించనుంది.

హైదరాబాదులో అమెజాన్...

హైదరాబాదులో అమెజాన్...

ఈ హైదరాబాద్ క్యాంపస్‌లో అమెజాన్.. ప్రపంచ వ్యాపార, సాంకేతిక బృందాలకు బ్యాకెండ్ కార్యకలాపాలను కూడా నిర్వహిస్తుంది. బిజినెస్ నిర్వహణ ప్రణాళికలతో పాటు కొత్త సాప్టువేర్ రూపకల్పన, వాణిజ్య విస్తరణ కార్యాచరణకు ఈ క్యాంపస్ కేంద్రం కానుంది. హైదరాబాదులో అమెజాన్ మొదటి సెంటర్ ఇదే కాదు. హైదరాబాదులో మూడు ఫుల్‌ ఫిల్‌మెంట్ సెంటర్లతో పాటు 3.2 మిలియన్ క్యూబిక్ స్క్వేర్ ఫీట్‌లతో స్టోరేజ్ స్పేస్ కలిగి ఉంది. 1 లక్ష స్క్వేర్ ఫీట్స్‌తో రెండు స్టోరేజ్ సెంటర్లు కలిగి ఉంది.

రూ.400 కోట్లతో అతి పెద్ద క్యాంపస్

రూ.400 కోట్లతో అతి పెద్ద క్యాంపస్

అమెజాన్‌ 2005-06లో భాగ్యనగరంలో బ్యాకెండ్ ఆపరేషన్‌ను ప్రారంభించింది. శంషాబాద్‌ ఎయిర్ పోర్టు దగ్గర 4 లక్షల చ.అ. విస్తీర్ణంలో ఫుల్‌ఫిల్‌మెంట్ కేంద్రాన్ని నిర్మించింది. హైదరాబాదులో రూ.400 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్‌తో ప్రపంచంలోనే అతి పెద్ద ప్రాంగణం నిర్మించాలని భావించింది. దీనికి తెలంగాణ ప్రభుత్వం 10 ఎకరాల భూమిని ఇచ్చింది.

హైదరాబాదుకు దిగ్గజ కంపెనీలు

హైదరాబాదుకు దిగ్గజ కంపెనీలు

అమెజాన్ తన అతిపెద్ద క్యాంపస్‌ను హైదరాబాదులో నిర్మించడం తెలంగాణకు ప్లస్. ఇప్పటికే హైదరాబాదును పెట్టుబడుల కేంద్రంగా చూస్తున్నారు. ఇది పెట్టుబడులకు మరింత అనుకూలతలను తీసుకు వస్తుందని చెబుతున్నారు. మరెన్నో సంస్థలు హైదరాబాదును ఎంచుకోవచ్చును. మైక్రోసాఫ్ట్, గూగుల్, IBM, ఒరాకిల్, యాపిల్ వంటి దిగ్గజాలు ఇప్పటికే ఆఫీస్‌లు నిర్వహిస్తున్నాయి. హైదరాబాదులో రూ.1000 కోట్లతో గూగుల్ తమ క్యాంపస్‌ను ఏర్పాటు చేసుకుంది. ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, విప్రో వంటి ఐటీ దిగ్గజాలు కూడా హైదారాబాదులో ఉన్నాయి.

English summary

హైదరాబాద్‌లో ప్రపంచంలో అతిపెద్ద అమెజాన్ క్యాంపస్, ప్రత్యేకత | Amazon's largest campus building in world to open in Hyderabad

E-commerce firm Amazon will open a 10-acre campus here, its biggest outside the United States, on Wednesday.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X