For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒడిదుడుకుల్లో మార్కెట్లు, 75 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్

|

ముంబై: స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకుల మధ్య నష్టాల్లో ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాల నేపధ్యంలో నిఫ్టీ ఫ్లాట్‌గా ప్రారంభమైంది. అక్కడి నుంచి కొద్దిగా లాభాల్లోకి వచ్చినప్పటికీ.. ఆ తర్వాత మళ్లీ కోలుకున్న దాఖలాలు కనిపించలేదు. ఉదయం నుంచి సెల్లింగ్ ప్రెషర్ కొనసాగింది. ఇంట్రాడేలో 10985 పాయింట్ల కనిష్ట స్థాయికి నిఫ్టీ దిగొచ్చింది. చివరి సెషన్‌లో మళ్లీ నిఫ్టీ నిలదొక్కుకోలేకపోయింది. చివరకు సెన్సెక్స్ 75 పాయింట్ల నష్టంతో 37328 దగ్గర క్లోజైంది. నిఫ్టీ 37 పాయింట్లు దిగొచ్చి 11,017 దగ్గర స్థిరపడింది. ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీ మరింత దిగొచ్చింది. సుమారు 200 పాయింట్లు కోల్పోయి 27982 దగ్గర క్లోజైంది. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు ఒక్క శాతం వరకూ దిగొచ్చాయి. ఇక సెక్టోరల్ ఇండిసెస్‌లో మెటల్, పీఎస్‌యూ బ్యాంక్స్, రియాల్టీ, బ్యాంకింగ్ రంగ షేర్లలో ఎక్కువ సెల్లింగ్ నమోదైంది. ఆటో, ఐటీ రంగ షేర్లు కొద్దిగా కోలుకున్నాయి.

Share market Update: Nifty around 11K, Sensex down 100 points

స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్పలాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.45 ని.లకు సెన్సెక్స్ 107 పాయింట్ల లాభంతో 37,509 వద్ద, నిఫ్టీ 20 పాయింట్ల లాభంతో 11,073 వద్ద ట్రేడ్ అయ్యాయి. అయితే ఆ తర్వాత కాసేపటికే నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. మధ్యాహ్నం గం.11.20 ని.ల సమయానికి సెన్సెక్స్ నిన్నటి ముగింపుతో 114.98 (0.31%) పాయింట్లు దిగజారి 37,287.51 వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ నిన్నటి ముగింపుతో 46.15 (0.42%) పాయింట్లు దిగజారి 11,006.95 ట్రేడ్ అయింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.71.57 వద్ద ట్రేడ్ అయింది.

ఇన్ఫోసిస్‌, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, హీరో మోటో కార్ప్, టీసీఎస్ కంపెనీలు ఉదయం లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. నిఫ్టీలో ఐటీ సూచీలు భారీగా లాభపడ్డాయి. మెటల్ సూచీలు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ఫ్లాట్‌గా ఉంది. మెటల్‌తో పాటు ఎఫ్ఎంసీజీ సేల్స్ కూడా ఒత్తిడిలో ఉన్నాయి. అదే సమయంలో ఐటీ, ఆటో, ఇన్ఫ్రా, ఫార్మా షేర్ల కొనుగోళ్లు సాగాయి.

English summary

ఒడిదుడుకుల్లో మార్కెట్లు, 75 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ | Share market Update: Nifty around 11K, Sensex down 100 points

Among sectors, FMCG and metal are witnessing selling pressure, while buying seen in the auto, infra, IT and pharma. BSE midcap and smallcap are trading flat.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X