For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పండుగల ప్రభావం: SBI ఐ బంపర్ ఆఫర్లు

|

ప్రభుత్వ రంగంలోని అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా (ఎస్ బీ ఐ ) ఈ పండగల సీజన్ సందర్భంగా తన రిటైల్ బ్యాంకింగ్ కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లను మంగళవారం నాడు ప్రకటించింది. ఇందులో భాగంగా తక్కువ వడ్డీ రేట్లకే రుణాలను పొందే సదుపాయం కల్పిస్తోంది. అంతే కాకుండా ప్రాసెసింగ్ ఫీజు ఎత్తివేత, ప్రీ అప్రూవ్డ్ డిజిటల్ రుణాలు వంటివి ఆఫర్ చేస్తోంది. గృహ, కారు, వ్యక్తిగత రుణాలను తక్కువ వడ్డీ రేట్లకే ఇవ్వనున్నట్టు ప్రకటించింది. వ్యక్తిగత, విద్య రుణాలపై ఎక్కువ కాలం రీపేమెంట్ సదుపాయాన్ని అందిస్తోంది.

<strong>కార్డ్-లెస్ దిశగా... SBI డెబిట్ కార్డులకు చెల్లుచీటి!</strong>కార్డ్-లెస్ దిశగా... SBI డెబిట్ కార్డులకు చెల్లుచీటి!

కారు రుణం

కారు రుణం

* కారు రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును ఎత్తివేసింది. కారు రుణాలు తీసుకునే కస్టమర్లకు 8.70 శాతం ప్రారంభ వడ్డీ రేటుతో రుణాన్ని అందిస్తోంది. వడ్డీలో ఎలాంటి ఎస్కేలేషన్ ఉండదని తెలిపింది.

* బ్యాంక్ డిజిటల్ ప్లాటుఫామ్ యోనో లేదా బ్యాంక్ వెబ్ సైట్ ద్వారా కార్ లోన్ కు దరఖాస్తు చేసుకుంటే 0. 25 శాతం కన్సెషన్ ను అందిస్తోంది.

* వేతనం పొందుతున్న కస్టమర్లు కారు ఆన్ రోడ్ ధర మీద 90 శాతం వరకు రుణాన్ని పొందవచ్చని బ్యాంకు చెబుతోంది.

వ్యక్తిగత రుణం

వ్యక్తిగత రుణం

* వ్యక్తిగత రుణం తీసుకోవాలనుకునే వారికీ కూడా బ్యాంక్ ఆకర్షణీయమైన వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది.

* రూ. 20 లక్షల వరకు వ్యక్తిగత రుణం పై ప్రారంభ వడ్డీ రేటు 10.75 శాతం ఉందని బ్యాంకు పేర్కొంది. రీ పేమెంట్ కాలపరిమితి ఆరేళ్ళు ఉంది. దీని మూలంగా కస్టమర్లపై నెలవారీ వాయిదాల చెల్లింపు భారం తగ్గనుంది.

* వేతన ఖాతా కలిగిన కస్టమర్లు రూ. 5 లక్షల వరకు ప్రీ అప్రూవ్డ్ డిజిటల్ లోన్ ను తీసుకోవచ్చు. యోనో ద్వారా ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నారు.

విద్య రుణం

విద్య రుణం

* ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో బ్యాంకు విద్య రుణాన్ని అందిస్తోంది.

* దేశేయంగా చదువుకునే విద్యార్థులకు సంభందించి రూ. 50 లక్షల వరకు రుణంపై ప్రారంభ వడ్డీ రేటు 8. 25 శాతంగా ఉంది . విదేశాల్లో చదవాలనుకునే వారు తీసుకునే రూ. 1. 50 కోట్ల వరకు రుణాలకు కూడా ఈ వడ్డీ రేటు వర్తిస్తుంది.

* 15 ఏళ్ల వరకు రుణాన్ని తిరిగి చెల్లించే సదుపాయాన్ని కల్పిస్తున్నారు. దీని విద్యార్థులపై ఈ ఎం ఐ భారం తగ్గనుంది.

గృహ రుణం

గృహ రుణం

* ఇటీవలే ఎస్ బీ ఐ గృహరుణాలపై తన నిధుల వ్యయ ఆధారిత వడ్డీ రేటు (ఎం సి ఎల్ ఆర్ ) ను 0. 15 శాతం మేర తగ్గించింది.

* ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఈ వడ్డీ రేటు 0.35 శాతం మేర తగ్గింది. ప్రస్తుతం బ్యాంకు తక్కువ వడ్డీ రేటుకే గృహ రుణాన్ని అందిస్తోంది.

* రేపో లింక్డ్ గృహ రుణ వడ్డీరేటు 8.05 శాతంగా ఉంది. ఈ రేటు వచ్చే సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి పాత, కొత్త రుణ గ్రహితలకు వర్తించనుంది.

English summary

పండుగల ప్రభావం: SBI ఐ బంపర్ ఆఫర్లు | SBI announces special car, personal, education loan benefits ahead of festive season

India's biggest bank State Bank of India (SBI) has announced special offerings ahead of this festive season for retail customers across different product categories.
Story first published: Tuesday, August 20, 2019, 17:11 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X