For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

6 నెలల కనిష్టానికి రూపాయి, మరో 28 పైసలు పతనం

|

ముంబై: డాలర్‌తో రూపాయి మారకం విలువ మంగళవారం నాడు మరో 28 పైసలు తగ్గి, 71.71 వద్ద క్లోజ్ అయింది. తద్వారా ఆరు నెలల కనిష్టానికి రూపాయి చేరుకుంది. ఫారెక్స్ ట్రేడర్స్ ప్రకారం ఆర్థికమాంద్యం బలపడుతుండం, విదేశీ నిధుల ప్రవాహంపై దృక్పథం వంటి కారణాలతో పెట్టుబడిదారులు రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా లేరు. అయితే ఆటో మొబైల్, ఎఫ్ఎంసీజీ సహా వివిధ రంగాలలోని మందగమనం నేపథ్యంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం త్వరలో సరైన ఉద్ధీపన చర్యలతో ముందుకు వస్తోందని భావిస్తున్నారు.

అధిక ముడి చమురు ధరలు కూడా రూపాయి ట్రేడింగ్ సరళి పైన ప్రభావం చూపించాయి. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్‌కు 0.07 శాతం పెరిగి 59.78 డాలర్ల వద్ద ఉంది. మంగళవారం రూపాయి బలహీనంగానే ట్రేడ్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత ఓ దశలో డాలర్‌తో 71.80కి పడిపోయింది. ఆ తర్వాత 71.71 వద్ద క్లోజైంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో డాలర్‌తో రూపాయి మారకం విలువ 71.80 వద్ద ఉంది. అప్పటి నుంచి ఈస్థాయికి పడిపోవడం ఇదే.

Rupee hits fresh 6 month low, dives 28 paise

సోమవారం నాడు డాలర్‌తో రూపాయి మారకం విలువ 71.43 వద్ద ముగసింది. ముడి చమురు ధరలు రికవరీ కావడంతో ఫారన్ బ్యాంకులు డాలర్ వైపు చూస్తున్నాయని, ఈ నేపథ్యంలో ఈ వారంలో రెండో రోజు కూడా రూపాయి విలువ పడిపోయిందని చెబుతున్నారు. ఓ వైపు రూపాయి విలువ పడిపోతుంటే, బంగారం ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఆర్థిక మాంద్యం ఆందోళనల కారణంగా అందరూ సురక్షిత పెట్టుబడుల కోసం బంగారం వైపు చూస్తున్నారు.

బంగారం ధరలు మంగళవారం కూడా పెరిగాయి. పది గ్రాముల బంగారం నలభై వేల రూపాయల మార్కుకు చేరువగా ఉంది. బులియన్ ట్రేడింగ్‌లో 10 గ్రాముల పసిడి రూ.200 పెరిగి, రూ.38,770 వద్ద ఆల్ టైమ్ రికార్డ్ స్థాయికి చేరుకుంది. జెవెల్లరీ మేకర్స్ నుంచి డిమాండ్ పెరిగింది. దీంతో పసిడి ధర పెరుగుతోంది. వెండి ధర కూడా కిలో రూ.1,11 పెరిగి రూ.43,900కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ఉండటం, రూపాయి బలహీనపడుతుందటం, వ్యాపారుల నుండి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో బంగారం ధర దిగి రావడం లేదని చెబుతున్నారు. అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం 1500 డాలర్లు దాటింది.

English summary

6 నెలల కనిష్టానికి రూపాయి, మరో 28 పైసలు పతనం | Rupee hits fresh 6 month low, dives 28 paise

The Indian rupee on Tuesday furthered its loss by another 28 paise to close at a new six-month low of 71.71 against the US dollar as economic uncertainties continued to weigh.
Story first published: Tuesday, August 20, 2019, 20:28 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X