For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉల్లి ధరలు ఇంకా పెరగొచ్చు .. అప్రమత్తంగా ఉండండి..

|

ఉల్లి లేని వంటిల్లు ఉండదు. ఏ కూరలో నైనా ఉల్లి ఉండాల్సిందే. అందుకే దీని వినియోగం భారీ స్థాయిలో ఉంటుంది. ఉల్లి ధరలు ప్రభుత్వాలకు ఎసరు తెచ్చిన ఉందంతాలు కూడా ఉన్నాయి. అందుకే ఉల్లి ధరలు పెరుగుతున్నాయంటే దడ మొదలవుతుంది. ఉల్లిపాయ కొస్తే కన్నీరు వస్తుంది. కానీ రానున్న కాలంలో అదే ఉల్లిపాయను కొనుగోలు చేసే సమయంలోను కన్నీళ్లు వచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలను వరదలు అతలాకుతలం చేస్తున్న వి షయం తెలిసిందే.

వరదల మూలంగా ఉల్లి పంట కూడా బాగానే దెబ్బ తిన్నదని రైతులు అంటున్నారు. ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంలో ఉల్లి పంట ఎక్కువగా ప్రభావితం అయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఉల్లి ధరలు పెరగడం మొదలైంది. మార్కెట్లో కిలో ఉల్లి ధర రూ. 30 దాటేసింది. కర్ణాటకలో పంటపై దెబ్బపడినట్టు వార్తలు రావడంతో మహారాష్ట్రలోని రైతులు తమ పంటను మార్కెట్లోకి తీసుకురాకుండా అట్టిపెట్టుకుంటున్నట్టు సమాచారం. మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకోవచ్చని చాలా మంది భావిస్తున్నారని ఈ నేపథ్యంలోనే సరుకు లభ్యత కాస్త ప్రభావితమైనట్టు తెలుస్తోంది.

Onion price may hike

అయితే ఉల్లికి డిమాండ్ పెరగడం కూడా ధరలు పెరగడానికి కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ధరల పెరుగుదల మరో రెండు నెలల పాటు ఉండవచ్చని, ఆ తర్వాత కొత్త పంట మార్కెట్లోకి వస్తుంది కాబట్టి ధరలు మళ్ళి దిగిరావడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

పాడయింది ఎంత..

* మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం రైతుల వద్ద సరుకు ఎక్కువగానే నిల్వ ఉంది. అయితే వర్షాల నేపథ్యంలో తేమ శాతం పెరిగి సరుకు కొంతవరకు దెబ్బ తిన్నట్టు సమాచారం.
* కాగా మే నుంచి అక్టోబర్ వరకు మహారాష్ట్ర మార్కెట్ నుంచి మార్కెట్లోకి సరుకు వస్తుంది. ఇక్కడి రైతులు ఉల్లి ని నిల్వ చేసుకునేందుకు మంచి సదుపాయాలున్నాయి. కాబట్టి వారివద్ద ఎక్కువ పంట పాడుకాకుంటా ఉంటుంది.
* ఉల్లి ఉత్పత్తిలో మహారాష్ట్ర అగ్ర స్థానంలో ఉంది. మధ్య ప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. కర్ణాటకలో కూడా మధ్య ప్రదేశ్ స్థాయిలో ఉల్లి ఉంటుంది.
* అయితే ఇటీవలి వర్షాల కారణంగా కర్ణాటకలో ఖరీఫ్ పంట బాగానే దెబ్బతిన్నది. అంతకు ముందు వర్షాలు లేకపోవడం వల్ల పంట సాగు విస్తీర్ణం తగ్గింది. ఈ పంటను ఇప్పుడు వర్షాలు దెబ్బతీయడం వల్ల పంట మరింత తగ్గిపోయింది.
* ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ లోను ఉల్లి సాగు ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడి నుంచి దక్షిణ కర్ణాటక, చెన్నైకి ఉల్లి వెళుతుంది. ఇక్కడి నుంచి సప్లై పెరిగితే ధరలు కట్టడిలోనే ఉండవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నారు.
* హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ తదితర మార్కెట్లలో ఉల్లి ధరలు రూ. 30 నుంచి రూ. 40 వరకు ఉన్నట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మహారాష్ట్రలో వరదల కారణంగా కొన్ని రోజుల్లోనే ధరలు పెరిగినట్టు చెబుతున్నారు.

Read more about: onion price ధరలు
English summary

ఉల్లి ధరలు ఇంకా పెరగొచ్చు .. అప్రమత్తంగా ఉండండి.. | Onion price may hike

Onion price may hike soon after heavy rains and floods in various parts of India.
Story first published: Tuesday, August 20, 2019, 16:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X