ఇండెక్స్ ఫ్యూచర్‌లో విదేశీ పెట్టుబడుల బేరిష్ సూచీ ఓవర్ సోల్డ్ జోన్‌లోకి ప్రవేశించింది. చరిత్రను చూస్తే ఇలాంటి వాటి తర్వాత భారత మార్కెట్లో ర్యాలీ కనిపించింది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో సేల్స్ మూడ్ కనిపిస్తోంది. ముఖ్యంగా ఫారెన్ పోర్ట్‌పోలియే ఇన్వెస్టర్లు (FPI) ఫ్యూచర్ మార్కెట్లో విపరీతంగా విక్రయిస్తున్నారు. దీంతో మార్కెట్లు ఓవర్ సోల్డ్ జోన్‌లోకి వెళ్లాయి. ఈ పరిస్థితుల్లో తమ పొజిషన్లను కవర్ చేసుకునేందుకు మళ్లీ కొనుగోళ్లు జరపాల్సిన పరిస్థితిలు నెలకొన్నాయి. ఇదే జరిగితే భారీ ర్యాలీలు ఉంటాయని నిపుణులు అంటున్నారు.

మార్కెట్ ర్యాలీ
FPIలు లక్షకు పైగా నిఫ్టీ కాంట్రాక్టుల్లో షార్ట్ పొజిషన్ తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఇది చాలా ఎక్కువ అని చెబుతున్నారు. FPIలు బేరిష్‌గా ఉన్న నెల తర్వాత మార్కెట్లు కనీసం 5 -8 శాతం వరకు పెరిగినట్లు గత ఐదు సెషన్లలో తేలింది. వ్యాపారులు అతి నిరాశాజనకంగా ఉన్నందున సమీప కాలంలో మార్కెట్ భారీ ర్యాలీ జరిగే అవకాశాలు ఉన్నాయని ఇండియాచార్ట్ డాట్ కామ్ ఫౌండర్ రోహిత్ శ్రీవాత్సవ తెలిపారు.

ఓవర్ సోల్డ్ జోన్‌లోకి వెళ్తే...
సాధారణంగా IPOలు నిరాశజనకంగా ఉన్నప్పుడు ఈ ఓవర్ సోల్డ్ జోన్‌కి వెళుతుంటాయి. గత కొద్ది నెలల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు ఇక్కడ అమ్మకాలకు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం ఎఫ్‌పీఐలు, హెచ్‌ఎన్‌ఐల అదనపు పన్ను విధించాలనే నిర్ణయం కూడా ఇందుకు కారణం. మరోవైపు భారత ఆర్థిక వ్యవస్థ మందగించడమూ కారణం. జూలై నుంచి ఈ సేల్స్ ఎక్కువగా ఉన్నాయి. భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉద్దీపన చర్యలు లేకపోవడం సెంటిమెంటును దెబ్బతీస్తోందంటున్నారు.

పుట్ కాల్ రేషియో..
ఓవర్ సోల్డ్‌కు పుట్ కాల్ రేషియో (PCR) కూడా కారణంగా చెబుతున్నారు. వ్యాల్యూమ్స్ ఆధారంగా ఉండే పుట్ కాల్ నిష్పత్తి ఎక్కువగా ఉంది. గత 31 రోజుల సగటు చూస్తే 0.66 శాతం ఉంది. అంటే మార్కెట్లో కాల్స్ కంటే ఎక్కువగా పుట్స్‌నే కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. ట్రేడర్లు మార్కెట్ పైన నిరాశావాదంతో ఉంటే పుట్స్ కొనుగోలు చేస్తారు. పుట్ కాల్ రేషియో ఇలా ఉండటం 2011 తర్వాత ఇదే మొదటిసారి అని నిపుణులు చెబుతున్నారు.

స్వల్పకాలమే...
సెన్సెక్స్ సోమవారం 52.16 పాయింట్లు మాత్రమే పెరిగి 37402.49 వద్ద క్లోజ్ అయింది. ఈ ఏడాది జూన్ 4న హైరికార్డ్‌కు ఇది 7 శాతం తక్కువ. అయినప్పటికీ మార్కెట్లు తిరిగి పుంజుకుంటాయని, ప్రస్తుత పరిస్థితి స్వల్పకాలమేనని చెబుతున్నారు. మార్కెట్లు పడిపోయిన ప్రతిసారి పుంజుకోవడం చూశామని చెబుతున్నారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications