For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమ్ముడుపోని గృహాలు 7.9 లక్షలకు పైనే.... హైదరాబాద్ లో ఎన్నో తెలుసా?

|

దేశంలోని ప్రధాన నగరాల్లో అమ్ముడుపోని ఫ్లాట్ల సంఖ్య పెరుగుతోంది. ధరలు అందుబాటులో ఉంటున్నా వీటిని కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చే వారు తక్కువగా ఉంటున్నారు. ప్రస్తుతం దేశంలోని 9 నగరాల్లో అమ్ముడుపోని అందుబాటు ధరల్లో ఉన్న అపార్టుమెంట్స్ సంఖ్య 4.12 లక్షల వరకు ఉన్నట్టు ప్రాపర్టీ బ్రోకరేజ్ సంస్థ ప్రాప్ టైగర్ డాట్ కామ్ చెబుతోంది. వీటి ధర రూ. 45 లక్షల వరకు ఉంది. అందుబాటు ధరల్లో ఉండే ఇళ్లకు డిమాండ్ ఏర్పడుతున్నప్పటికీ అమ్ముడు పోకుండా ఉంటున్న వాటి సంఖ్య మాత్రం ఎక్కువగానే ఉండటం గమనార్హం.
* జూన్ తో ముగిసిన త్రైమాసికం నాటికి తొమ్మిది నగరాల్లో (హైదరాబాద్,గురుగ్రామ్, నోయిడా, ముంబై, కోల్కతా , చెన్నై, బెంగళూూరు, పూణే, అహ్మదాబాద్) అమ్ముడు పోకుండా ఉన్న గృహాల సంఖ్య 7,97,623 యూనిట్లుగా ఉంది.
* వీటిలో అందుబాటు ధరల్లో ఉన్న గృహాల సంఖ్య 4,12,930.

మున్ముందు మరింత గిరాకీ

మున్ముందు మరింత గిరాకీ

* ఇంతకు ముందు గృహ రుణంపై వడ్డీ మినహాయింపు పరిమితి రూ. 2 లక్షలు ఉండేది. దీన్ని గత బడ్జెట్ లో రూ. 3.5 లక్షలకు పెంచారు. దీనివల్ల కొత్తగా గృహ రుణం తీసుకునే వారి సంఖ్య పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఫలితంగా మున్ముందు అందుబాటు ధరల్లో ఉండే గృహాలకు గిరాకీ పెరుగుతుందని భావిస్తున్నారు.

* భారత రిజర్వ్ బ్యాంక్ రెపోరేటు ను తగ్గించిన నేపథ్యంలో బ్యాంకులు కూడా తమ గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న కాలంలో ఈ రుణాలకు డిమాండ్ పెరగవచ్చని చెబుతున్నారు.

డెవలపర్లు ఏంచేస్తున్నారంటే..

డెవలపర్లు ఏంచేస్తున్నారంటే..

* పెద్ద నోట్ల రద్దు, వస్తు సేవల పన్ను, రెరా వంటి గొప్ప సంస్కరణల మూలంగా రియాల్టీ రంగంపై దెబ్బ పడింది. నోట్ల రద్దు వల్ల నగదుకు ఇబ్బందులు వచ్చాయి. జీఎస్టీ తో పన్నుకు సంబంధించిన గందరగోళం ఏర్పడింది. రెరా తో మరికొంత కాలం ఇళ్ల కొనుగోళ్ల కోసం కొనుగోలు దారులు వేచి చూశారు. వీటన్నింటి ప్రభావం వల్ల అమ్మకాలపై పడినట్టు రియాల్టీ వర్గాలు చెబుతున్నాయి.

* అయితే ఇప్పుడు రియల్టర్లు ప్రస్తుతం తమ చేతిలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడం పై ద్రుష్టి సారిస్తున్నారు. అంతే కాకుండా అమ్ముడు పోకుండా ఉన్న ఇళ్లను విక్రయించుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.

హైదరాబాద్ ఇదీ పరిస్థితి..

హైదరాబాద్ ఇదీ పరిస్థితి..

* ప్రాప్ టైగర్ వెల్లడించిన వివరాల ప్రకారం అమ్ముడుపోని అందుబాటు ధరల్లో గృహాలు ముంబై (1,39,984)లో ఎక్కువగా ఉన్నాయి.

* పుణేలో 98,378, అహ్మదాబాద్ లో 41,791, నోయిడాలో 35,811, కోల్కతా లో 30,923, గురుగ్రామ్ లో 22,307, బెంగళూర్ లో 20,146, చెన్నైలో 18,709, హైదరాబాద్ లో 4,881 యూనిట్లుగా ఉన్నాయి. హైదరాబాద్ లోని అతి తక్కువగా అమ్ముడు పోని గృహాలు ఉండటం గమనార్హం. ఈ నగరంలో అన్ని రకాల వసతులు ఉండటం వల్ల ఇళ్లకు డిమాండ్ ఎక్కువగానే ఉంటోంది.

English summary

అమ్ముడుపోని గృహాలు 7.9 లక్షలకు పైనే.... హైదరాబాద్ లో ఎన్నో తెలుసా? | Home sales fall In Q1 FY20

Indian realty developers continue to struggle with hard times as home sales refuse to pick up, despite several nation-wide corrective measures launched by authorities as well as the builder community.
Story first published: Monday, August 19, 2019, 7:53 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X