అంతర్జాతీయ, దేశీయ పరిణామాలతో స్టాక్ మార్కెట్లో ప్రతికూల సెంటిమెంట్ ఆవహించింది. దీంతో పెట్టుబడిదారులు పునరాలోచనలో పడుతున్నారు. స్టాక్ మార్కెట్లు క్షీణిస్తే తమ పెట్టుబడులు హారతి కర్పూరంలా కరిగిపోతాయనే ఆందోళనలో ఉన్నారు. ఇందుకు నిదర్శనమే విదేశీ పెట్టుబడిదారుల అమ్మకాలు. ఈ నెలలో ఇప్పటి వరకు జరిగిన పది ట్రేడింగ్ సెషన్లలో తొమ్మిది ట్రేడింగ్ సెషన్లలో విదేశీ పెట్టుబడి దారులు అమ్మకాలకే ప్రాధాన్యం ఇచ్చారు. వీరు విక్రయించిన షేర్ల విలువ రూ. 8, 319 కోట్లు. ఆగస్టు ఒకటో తేదీ నుంచి 16వ తేదీ వరకు విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు రూ. 10,416 కోట్ల షేర్లను విక్రయించారు. ఇదేకాలంలో వీరి ఈక్విటీ, డేట్ మార్కెట్లో కొనుగోళ్లు రూ. 2,096 కోట్లుగా ఉన్నాయి. తొమ్మిది సెషన్లలో అమ్మకాలకే ప్రాధాన్యం ఇచ్చారంటే పూర్తిగా ప్రతికూల సెంటిమెంట్ ఉన్నట్టే నని విశ్లేషకులు చెబుతున్నారు.
* గత జులై లో విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్ నుంచి రూ. 3,002 కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. డెట్ మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్న మొత్తం రూ. 9,433 కోట్లుగా ఉంది. గత అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు ఈ స్థాయిలో పెట్టుబడుల ఉపసంహరణ జరగలేదు.

ఇదీ కారణం...
* విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టపై అధిక సర్ చార్జీ లేదా సూపర్ రిచ్ పన్ను విధించనున్నట్టు గత బడ్జెట్ లో ప్రతిపాదించారు. ఇప్పటి వరకు దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావడం లేదు. పన్ను తగ్గించ వచ్చని ఒకసారి , తగ్గించక పోవచ్చని ఒకసారి వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు గందరగోళానికి గురవుతున్నారు.
* అంతర్జాతీయంగా చూస్తే అమెరికా- చైనా మధ్య వాణిజ్య యుద్ధ భయాలు పెరిగిపోతున్నాయి. ఇది కూడా విదేశీ ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తోంది.
* దేశ, విదేశీ పరిణామాలతో గత జులై లోను విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఉపసంహరించు కున్నారు. ఫలితంగానే స్టాక్ మార్కెట్లు నష్టాలను చవిచూస్తున్నాయి.
* అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న టెన్షన్ వాతావరణం కూడా ఇన్వెస్టర్లను ప్రభావితం చేస్తున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.
* దేశీయంగా చూస్తే దేశ ఆర్ధిక వ్యవస్థ వృద్ధి రేటు తక్కువగా ఉంటోంది. వర్షాలు కూడా ఆశించిన స్థాయిలో ఉండటంలేదు. కంపెనీలు ప్రకటించిన ఆర్ధిక ఫలితాలు కూడా నిరాశ జనకంగా ఉన్నాయి. ఇవి కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను ప్రభావితం చేస్తున్నాయి.
* భారత మార్కెట్లో వచ్చే రిటర్నులు తగ్గుతున్న నేపథ్యంలో అధిక రిటర్న్ వచ్చే ఇతర వర్ధమాన మార్కెట్లలోకి పెట్టుబడులు తరలిస్తున్నారు.
* జనవరిలో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు తగ్గాయి. కానీ ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలలో పెరిగాయి. కానీ బడ్జెట్ దెబ్బకు జులై నుంచి అమ్మకాలు మొదలయ్యాయి.
జాగ్రత్త...
* విదేశీ ఇన్వెస్టర్లు అన్ని రకాల పరిస్థితులనుదృష్టిలో పెట్టుబడులు పెడతారు. కాబట్టి వీరి పెట్టుబడుల తీరును బట్టి దేశీయ ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించాలి. లేకపోతే తమ పెట్టుబడులపై ప్రభావం పడే అవకాశం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications