న్యూఢిల్లీ: ఆటోమొబైల్, ఎఫ్ఎంసీజీ రంగాలు మందగమనంలో ఉన్నాయి. టీవీ, రిఫ్రిజరేటర్స్ సేల్స్ కూడా అలాగే ఉన్నాయి. గత కొన్నాళ్లుగా దాదాపు 20 శాతం వృద్ధి కనబర్చిన టెలివిజన్ రంగం గత ఏడాది మాత్రం కేవలం 3 శాతం వృద్ధికి పరిమితమైంది. యూనిట్ల విక్రయం పరంగా పురోగతి లేదు. ఈ ఏడాది అంతకంటే దారుణ పరిస్థితి ఉంది. జనవరి - మార్చి క్వార్టర్‌లో ఆఫ్‌లైన్ విక్రయాలు 15 నుంచి 20 శాతం, ఏప్రిల్ - జూన్ క్వార్టర్లో 10 నుంచి 20 శాతం మేర సేల్స్ తగ్గాయి. భారీ డిస్కౌంట్లు ఇస్తున్నప్పటికీ సేల్స్ ఆశించిన మేర పెరగడం లేదట.

క్రికెట్ వరల్డ్ కప్ సమయంలోనూ నిరాశ
గత ఏడాది డిసెంబరులో ప్రభుత్వం 32 ఇంచుల వరకు సైజు టీవీలపై జీఎస్టీని తగ్గించింది. పైగా కంపెనీలు డిస్కౌంట్స్ ఇస్తున్నప్పటికీ సేల్స్ పెరగకపోవడం ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది ఫెస్టివల్ సీజన్ ముగిసిన తర్వాత నుంచి టీవీ సేల్స్ తగ్గిపోయాయని, పరిశ్రమ ప్రతికూల పరిస్థితుల్ని చూస్తోందని పానాసోనిక్ ఇండియా, దక్షిణాసియా విభాగ సీఈఓ మనీష్ శర్మ అన్నారు. సాధారణంగా క్రికెట్ వరల్డ్ కప్ సమయంలో టీవీల సేల్స్ పెరుగుతాయని, ఈసారి వరల్డ్ కప్ సమయంలో అందుకు భిన్నంగా ఉందన్నారు.

దసరా - దీపావళి కీలకం
ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు దసరా - దీపావళి సీజన్ కీలకం. స్వాతంత్ర దినోత్సవం నుంచే ఆఫర్లు వెల్లువెత్తుతాయి. అయితే ఈసారి సేల్స్ దాదాపు 20 శాతం తగ్గాయని చెబుతున్నారు. టీవీ వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై జీఎస్టీని మరింత తగ్గించాలని కంపెనీలు ఇప్పటికే ప్రభుత్వానికి మొరపెట్టుకున్నాయి.

తగ్గిన సేల్స్
రిఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్, ఏసీ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు రోజువారీ అవసరాల కోసం కొనుగోలు చేస్తారు. ఎల్ఈడీ వంటి టీవీలను వినోదం కోసం తీసుకుంటారు. కానీ కొత్త ఉద్యోగాలు లేకపోవడం, ఎన్బీఎఫ్‌సీ సంక్షోభం, యువతకు ఆసక్తి లేకపోవడం వంటి పలు కారణాల వల్ల టీవీలతో పాటు ఫ్రిడ్జ్, ఏసీ, వాషింగ్ మెషీన్ల సేల్స్ తగ్గాయంటున్నారు.

కొనుగోలు ఆసక్తి లేకపోవడానికి పలు కారణాలు
పరిమిత సంపాదన, ఐటీ సహా పలు రంగాల్లో ఉద్యోగాల కోత, అప్పులు చేసి కొనుగోలు చేసేందుకు భయపడటం వంటి పలు కారణాలతో కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపడం లేదట. కచ్చితంగా అవసరం అయితేనే కొనుగోలు చేస్తున్నారట. గృహోపకరణాలను వాయిదాల్లో వడ్డీ లేకుండా కొనే వీలును ఫైనాన్స్ కంపెనీలు కల్పిస్తుంటాయి. వీటి ఆధారంగానే సగానికి పైగా సేల్స్ ఉంటాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత కూడా విక్రయాలు తగ్గాయట.

యువతకు మొబైల్ ఫోన్లపై పెరిగిన ఆసక్తి
దాదాపు అందరి ఇళ్లలో టీవీలు ఉన్నాయి. సీఆర్డీ మోడల్ నుంచి ఎల్‌సీడీ, ఎల్ఈడీ వరకు ఉన్నాయి. స్మార్ట్ టీవీలకు అప్ గ్రేడ్ అవుతున్నారు. ప్రస్తుతం చాలాంది కొనుగోలు విషయంలో వేచి చూసే ధోరణితో ఉన్నారని చెబుతున్నారు. యువత కూడా ఇప్పుడు టీవీల కంటే స్మార్ట్ ఫోన్లపై దృష్టి సారించింది. టీవీల విక్రయంపై యువతకు ఆసక్తి సన్నగిల్లింది.

సంక్షోభంలో NBFC
ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోలు చేసేవారికి రుణాలు ఇచ్చే NBFC సంక్షోభంలో ఉంది. అదే సమయంలో ప్రభుత్వం జీఎస్టీ తగ్గిస్తుందేమోననికూడా ఎదురు చూస్తున్నారు. అందుకు కూడా వాయిదా వేసుకుంటున్నారని చెబుతున్నారు.

కొత్తవాటిని మార్చుకుంటున్నారు..
టీవీలు, రిఫ్రిజరేటర్లు, ఏసీలు కొనుగోలు చేయడానికి బదులు పాతవి ఉంటే మార్చుకుంటున్నారట. సాధారణ సీఆర్డీ, ఎల్ఈడీ టీవీలను మార్చుకొని వాటి స్థానంలో లార్జ్ స్క్రీన్ స్మార్ట్ టీవీలు తీసుకుంటున్నారట. అలాగే రిఫ్రిజిరేటర్లు, ఏసీలు కూడా మార్చుకుంటున్నారట. ఈసారి ఎండలు మరీ ఎక్కువగా ఉండటంతో ఏసీ, ఫ్రిడ్జ్ విక్రయాలు కాస్త సంతృప్తికరంగా ఉన్నాయని చెబుతున్నారు.

దిగ్గజ సంస్థలకు దెబ్బ
దిగ్గజ కంపెనీల సేల్స్ తగ్గడానికి ఎంఐ, మైక్రోమ్యాక్స్, థామ్సన్ వంటి పలు కంపెనీల టీవీలు తక్కువ ధరకు రావడం కూడా కారణంగా చెబుతున్నారు. ఈ కంపెనీలు ఆన్ లైన్ ద్వారా అతి తక్కువ ధరకు టీవీలను విక్రయిస్తున్నాయి. ఈ పోటీని తట్టుకునేందుకు ఎల్‌జీ, శాంసంగ్, సోనీ వంటి కంపెనీలు ధరలు తగ్గించాయి. బ్రాండెడ్ ఎల్ఈడీ టీవీల ధరలు దాదాపు 25 శాతం వరకు తగ్గాయి. అలాగే, చైనా నుంచి టీవీల అక్రమ దిగుమతి కూడా ఓ కారణమని చెబుతున్నారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications