ముంబై: గత వారం టాప్ 10 కంపెనీల్లో తొమ్మిది కంపెనీలు రూ.84,354.1 మార్కెట్ వ్యాల్యుయేషన్ నష్టాన్ని మూటగట్టుకున్నాయి. నష్టపోయిన కంపెనీల్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ముందుంది. గత వారం ఎక్కువ సెలవులు వచ్చాయి. బీఎస్ఈ సెన్సెక్స్ గత వారం 231.58 పాయింట్లు నష్టపోయింది. టాప్ 10 కంపెనీల్లో లాభపడిన ఒకే ఒక కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL). ముఖేష్ అంబానీ గిగా ఫైబర్, ఆరామ్కోతో ఒప్పందం తదితర ప్రకటనలు చేసిన తర్వాత రిలయన్స్ షేర్లు దూసుకుపోయాయి.

రూ.72వేల కోట్లు పెరిగిన రిలయన్స్ ఎం-క్యాప్
గత వారం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏకంగా రూ.72,153.08 కోట్లు పెరిగి రూ.8,09,755.16 కోట్లకు చేరుకుంది. టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, హిందూస్తాన్ యూనివర్ లిమిటెడ్, (HUL), HDFC, ఇన్ఫోసిస్, ITC, కొటక్ మహీంద్రా బ్యాంకు, ICICI బ్యాంకు, SBIలు నష్టాలను చవి చూశాయి.

రూ.30వేల కోట్లు కోల్పోయిన టీసీఎస్
టీసీఎస్ ఎం-క్యాప్ శుక్రవారం సాయంత్రం నాటికి రూ.30,807.1 కోట్లు తగ్గి రూ.8,11,828.43 కోట్ల వద్ద నిలిచింది. HDFC వ్యాల్యుయేషన్ రూ.19,495.4 తగ్గి రూ.3,62,123.92 కోట్లుగా, HDFC బ్యాంకు ఎం-క్యాప్ రూ.15,065.8 తగ్గి రూ.6,08,826.25 కోట్లుగా నిలిచింది.

దిగజారిన ఇన్ఫోసిస్
ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ రూ.6,700.27 దిగజారి రూ.3,32,672.51 కోట్లుగా, కొటక్ మహీంద్రా ఎం-క్యాప్ రూ.6,525.48 తగ్గి రూ.2,86,340.99 కోట్లుగా, HUL ఎం-క్యాప్ రూ.2,954.95 తగ్గి రూ.3,95,335.97 కోట్లుగా, ITC ఎం-క్యాప్ రూ.1,657.41 దిగజారి రూ.3,10,488.97 కోట్లుగా ఉంది.

అయినా టీసీఎస్ టాప్
ICICI బ్యాంకు వ్యాల్యుయేషన్ రూ.790.71 కోట్లు పడిపోయి రూ.2,70,569.37, SBI మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.356.99 నష్టపోయి రూ.2,59,661.57గా ఉంది. అత్యధికంగా నష్టపోయిన టాప్ 10 కంపెనీల్లో టీసీఎస్ ఉన్నప్పటికీ ఎం-క్యాప్‌లో అదే నెంబర్ వన్ స్థానంలో ఉంది. టీసీఎస్ తర్వాత వరుసగా RIL, HDFC బ్యాంకు, HUL, HDFC, ఇన్ఫోసిస్, ITC, కొటక్ మహీంద్రా బ్యాంకు, ICICI బ్యాంకు, SBI ఉన్నాయి.
More From GoodReturns

Bengaluru: బెంగళూరు వదిలి ఐర్లాండ్‌కు.. ఖర్చు పెరిగినా సంతోషంగా ఉన్నానంటున్న టెక్కీ!

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

బెంగళూరు రియల్ ఎస్టేట్.. ఈ ఒక్క కారిడార్‌కు పుల్లు డిమాండ్.. ఇళ్లను ఎగబడి కొంటున్న ఇన్వెస్టర్లు..

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

బంగారం ధరలు తగ్గిపోతున్నాయి.. ఈ రోజు ఎంత ఢమాల్ అయిందంటే.. మార్చి 16, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications