బర్త్ డే గిఫ్ట్‌గా కారు అడిగిన వ్యక్తికి ఆనంద్ మహింద్రా ఇలా..
ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ ఆనంద్ మహీంద్రా నెటిజన్లకు పరీక్ష పెట్టారు. తన పుట్టిన రోజు సందర్భంగా ఓ ఎస్‌యూవీని ఇవ్వగలరా అని అడిగిన ఓ యువకుడికి.. ఆనంద్ మహీంద్రా ఇచ్చిన సమాధానం నెటిజన్లను కట్టి పడేసింది. ఇప్పుడు ఇది వైరల్‌గా మారింది. సాధారణంగా ఆనంద్ మహీంద్రా చేసే ట్వీట్లు అందరినీ ఆకట్టుకుంటాయి.
నిర్భయంగా పరిగెత్తు ద్యూతి చంద్, పేపర్ బాయ్‌కు సెల్యూట్, మా అత్యుత్తమ ఉత్పత్తి కూడా భారత్ మీమ్స్ క్యూలో ఉందని తెలియదు.. అంటూ తనదైన శైలిలో ట్వీట్ చేస్తూ, పారిశ్రామికవేత్తల్లో డిఫరెంట్‌గా నిలిచారు. సామాజిక కోణం, సున్నితమైన పంచ్.. ఇలా పలు కోణాలు ఆయన ట్వీట్లలో కనిపిస్తాయి. ఇప్పుడు ఆయన చేసిన ట్వీట్ మరింత వైరల్‌గా మారింది.
తనకు ఓ కారును బహుమతిగా ఇవ్వాలని ట్వీట్ చేసిన నెటిజన్‌కు ఆనంద్ మహీంద్రా అందర్నీ ఆలోచింప చేసేలా సమాధానం ఇచ్చారు.ఈ ట్వీట్‌లో అరుదుగా ఉపయోగించే ఓ ఆంగ్ల పదాన్ని పరిచయం చేశారు. దాని అర్థాన్ని కూడా వివరించారు.

విపుల్ అనే ఓ వ్యక్తి ఆనంద్ మహీంద్రాను ఉద్దేశించి 'సర్.. నేను మీకు పెద్ద అభిమానిని. నా పుట్టిన రోజు సందర్భంగా మహీంద్రా థార్ కారును బహుమతిగా ఇవ్వాగలరా' అని ట్వీట్ చేశారు. దానికి ఆనంద్ మహీంద్రా స్పందించారు.
వరల్డ్ లెస్సన్ ఫర్ డే అంటూ 'CHUTZPAH'అనే పదాన్ని ట్వీట్ చేశారు. ఈ పదానికి అతివిశ్వాసం, నిర్భయం అనే అర్థాలు వస్తాయని తెలిపారు. 'విపుల్‌ని ప్రశంసించినా లేదా విమర్శించినా.. అతని (CHUTZPAH) అతివిశ్వాసం, నిర్భయత్వాన్ని మాత్రం మెచ్చుకోవాల్సిందే. విపుల్ నీ CHUTZPAHకి ఫుల్ మార్క్స్. కానీ దురదృష్టవశాత్తూ నీ కోరికను నేను మన్నించలేను. అలా చేస్తే నా వ్యాపారం దెబ్బతింటుంది' అని బదులిచ్చారు. ఈ కామెంట్స్‌పై నెటిజన్లు తెగ స్పందిస్తున్నారు.


Click it and Unblock the Notifications