చిత్తూరు: రెండు రోజుల క్రితం 73 స్వాతంత్ర దినోత్స వేడుకలు యావత్ భారతం అంగరంగ వైభవంగా నిర్వహించింది. చిత్తూరు జిల్లా సీటీఎం గ్రామంలోని జెడ్పీ హైస్కూల్లో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే నవాజ్ బాషా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన యువ సమాజ్ సంస్థను, సంస్థ లోగోను ఆవిష్కరించారు.
యువసమాజ్ ఆధ్వర్యంలో మొక్కల పెంపకం, నిరుపేద విద్యార్థులకు సహాయం చేయడం, నిరుపేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు సరఫరా చేయడమే ఉద్దేశ్యం.

దీని వ్యవస్థాపకులు జబీర్ బాషా, కోఆర్డినేటర్లు సయ్యద్ బాషా, సునీల్, ప్రెసిడెంట్ అసదుల్లా, వైస్ ప్రెసిడెంట్ వసీమ్ అక్రమ్. ఖాదర్, జాఫర్, అశోక్, నాగి, నాదెర్షా, జిలానీ, రెడ్డి మహేష్, మనికంఠ, ఖాదర్ వల్లి, భరత్ ఆర్గనైజర్లుగా ఉన్నారు.

కాగా, ఈ కార్యక్రమానికి జింక చలపతి, ఖాజాహుస్సేన్, సీటీఎం వైసీపీ నాయకులు ఆనంద, వెలుగుచంద్ర, జెడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు హ్రుషి, గిరిలు సహాయసహకారాలు అందించారు. వీరికి యువ సమాజ్ ధన్యవాదాలు తెలిపింది.


Click it and Unblock the Notifications