ముంబై : దేశంలో ఆటో మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌లో ఉద్యోగాలకు భారీగా కోత విధించాయి. ఈ ఏడాది నియమించాల్సిన ఉద్యోగాల్లో సగానికిపైగా జాబ్స్ ప్రముఖ కంపెనీలు నిలిపివేశాయి. ఇందుకు గల కారణాలను కూడా ఆయా కంపెనీలు అంగీకరించాయి. గత 19 ఏళ్లలో ఎన్నడూ లేని కనిష్టానికి విక్రయాలు పడిపోయాయని .. అందుకే ఉద్యోగ నియామకాల్లో కోత పెట్టినట్టు వివరించాయి.
ఏటా మహీంద్ర అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, మారుతి సుజుకీ, అశోక్ లేలాండ్ కంపెనీలు క్యాంపస్ రిక్రూట్ మెంట్ చేస్తుంటాయి. కానీ ఈసారి అవి సగానికి పైగా తగ్గించాయి. కార్ల ఉత్పత్తి, అమ్మకాల్లో తగ్గుదలతో కొత్త ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు. దేశంలో ప్రముఖ పేరున్న కంపెనీ మహీంద్ర .. వాహనాలు, ట్రాక్టర్లను ఉత్పత్తి చేస్తుంది. కానీ ఈ ఏడాది ఉద్యోగ నియామకాల ప్రక్రియను సగానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.

సాధారణంగా ఏడాదికి కొత్తగా 400 మంది ఉద్యోగాలు కల్పిస్తుంటారు. కానీ ఉత్పాదక రంగంలో నెలకొన్న అనిశ్చితితో దానిని 200 మందికి తగ్గించారు. క్యాంపస్ హైరింగే కాదు .. ఇంటర్నల్ జాబ్ రొటేషన్స్ కూడా చేపట్టడం లేదని టాటా మోటార్స్ అధికార ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు. జూలైలో వాహనాల విక్రయం ఘోరంగా పడిపోయింది. 19 ఏళ్ల కనిష్టానికి చేరడంతో ఈ మేరకు కంపెనీలు ఉద్యోగ నియామకాలు చేపట్టడం లేదు. వాహనాల విక్రయం 18.7కి పడిపోగా .. అది ప్రయాణ వాహనాల విక్రయం 31 శాతానికి పడిపోయిందని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫాక్చరర్స్ పేర్కొంది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications