న్యూఢిల్లీ : ఎంపిక చేసిన చానెళ్లే కాకుండా సెలక్ట్ చేయని చానళ్లను కూడా అంటగడుతున్నారనే విషయం నిర్ధారణ అయ్యింది. బ్రాడ్ కాస్టర్లు, డిస్ట్రిబ్యూటర్లు అవసరం లేని చానెళ్లను అంటగడుతున్నారని టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) గుర్తించింది. వినియోగదారులు ఎంపిక చేసుకునే చానళ్లక సంబంధించి ధరల్లో సమస్యలు ఉన్నట్టు గుర్తించింది. ఈ మేరకు సదరు సంస్థలపై చర్యలు తప్పవనే సంకేతాలను ఇచ్చింది.
చానెళ్లకు సంబంధించిన అంశంలో వాటాదారులు తమ అభిప్రాయాలను వెల్లడించాలని ట్రాయ్ కోరింది. బ్రాడ్ కాస్టింగ్, కేబుల్ సర్వీసులకు సంబంధించి 2017 మార్చిలో న్యూ రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్‌ను ట్రాయ్ నోటిఫై చేసింది. ఈ ముసాయిదా మార్గదర్శకాలు 2018 డిసెంబర్ 29 నుంచి అమల్లోకి వచ్చాయి. ట్రాయ్ కొత్త మార్గదర్శకాల ప్రకారం వినియోగదారులు తమకిష్టమైన చానెళ్లను ఎంపిక చేసుకునే అధికారాన్ని కల్పించింది.

బ్రాడ్ కాస్టింగ్ రంగంలో పారదర్శకతకు ఇది మార్గం వేసిందని టీవీ రంగ నిపుణులు పేర్కొన్నారు. వాస్తవానికి బ్రాడ్ కాస్టర్లు వినియోగదారులకు చానళ్లను ఎంపిక చేసుకునే అవకాశం కల్పించటం లేదని వెల్లడైంది. బొకేల పేరుతో అనవసరమైన చానెళ్లను చేర్చి వినియోగదారుల నుంచి డబ్బులు వసూల్ చేస్తున్నట్టు ట్రాయ్ గుర్తించింది. దీనిపై వారి అభిప్రాయాలను వెల్లడించాలని కోరింది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications