2 రోజుల్లో రూ.29,000 కోట్లు సంపాదించిన ముఖేష్ అంబానీ
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) అధినేత ముఖేష్ అంబానీ రెండురోజుల్లోనే రూ.29,000 కోట్లు పెరిగింది. మూడ్రోజుల క్రితం(సోమవారం, ఆగస్ట్ 12) AGM-వార్షిక సమావేశంలో ఆయన కీలక ప్రకటలు చేశారు. ఈ నేపథ్యంలో రిలయన్స్ షేర్లకు మార్కెట్లో కొత్త ఊపు వచ్చింది. భారతదేశంలోని అత్యంత ధనవంతుడైన ముఖేష్ ఆస్తులు కూడా గతంలో ఎన్నడూ లేనివిధంగా అదే విధంగా పెరిగాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో ఆయన అతిపెద్ద షేర్ హోల్డర్. సోమవారం AGM సమావేశం అనంతరం మంగళ, బుధవారాల్లో అతని ఆస్తులు 29వేల కోట్లు పెరిగాయి.

అంబానీ ప్రకటనతో రిలయన్స్‌కు మరింత ఊపు
42వ రిలయన్స్ AGMలో ఆరామ్‌కోకు 20శాతం వాటాలు విక్రయిస్తున్నట్లు, రానున్న 18 నెలల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ రుణాలు సున్నాకు తీసుకు వెళ్లేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పడంతో పాటు యావత్ భారతం వేచి చూస్తున్న గిగా ఫైబర్‌ను సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రకటన మార్కెట్లో రిలయన్స్‌కు కొత్త ఊపు తీసుకు వచ్చింది.

షేర్లు ఎంత పెరిగాయంటే...
మంగళ, బుధవారాలు రిలయన్స్ షేర్లు జోరుమీద కనిపించాయి. బుధవారం మార్కెట్లు క్లోజ్ అయ్యే సమయానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు రూ.1,288.30 వద్ద క్లోజ్ అయ్యాయి. అంతకుముందు శుక్రవారం నాడు ఈ షేర్లు రూ.1,162 వద్ద ముగిశాయి. ఆగస్ట్ 12వ తేదీ ప్రకటన తర్వాత రూ.126 పెరిగింది. షేర్లు 11 శాతం పెరిగాయి. అదే విధంగా అంబానీ ఆస్తులు 4 బిలియన్ డాలర్లు అంటే మన రూపాయల్లో 28,684 కోట్లు పెరిగింది.

13వ వరల్డ్ రిచ్చెస్ట్ పర్సన్
బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం ముఖేష్ అంబానీ వరల్డ్ రిచ్చెస్ట్ వ్యక్తుల్లో 49.9 బిలియన్ డాలర్లతో 13వ స్థానంలో ఉన్నారు. ఇయర్ టు డేట్ ప్రాతిపదికన 5.57 డాలర్లు సంపాదించారు. రిలయన్స్ షేర్లు 15 శాతం పెరిగాయి. జూన్ 30 నాటికి రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రమోటరు, ప్రమోటర్ గ్రూపు వాటా 47.29 శాతంగా ఉంది.


Click it and Unblock the Notifications