ప్రోత్సాహకాలు, పన్ను తగ్గింపు, మాంద్యానికి మోడీ మందు! భారత్ కాస్త సేఫ్
న్యూఢిల్లీ: అమెరికా - చైనా వాణిజ్య యుద్ధం సహా పలు కారణాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ దీనిపై దృష్టి సారించారు. గురువారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, ఆ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఆర్థిక మాంద్యాన్ని తట్టుకునే పరిష్కార మార్గాల గురించి చర్చించారు. ఏయే రంగాలపై ఏ మేర ప్రభావం ఉంటుంది, ఎలా ఎదుర్కోవాలి, ఉద్యోగాలు కోల్పోకుండా ఏం చేయాలనే అంశాలపై చర్చించారు.

ఆటో, ఎఫ్ఎంసీజీ రంగాలకు దెబ్బ
ఆర్థిక మాంద్యం ప్రభావం భారత్ పైన ఎలా ఉంటుందనే అంశంపై ప్రధానంగా దృష్టి సారించారు. మాంద్యం బారినపడకుండా ఏం చేయాలనే దానిపై ప్రధానంగా చర్చ జరిగిందట. ఇప్పటికే ఆటోమొబైల్ ఇండస్ట్రీ దారుణంగా పడిపోయింది. వీటి సేల్స్ 19 ఏళ్ల కనిష్టానికి పడిపోయింది. FMCG సేల్స్ కూడా తగ్గాయి. రియాల్టీ కూడా ఆశించినంతగా లేదు. NBFC సంక్షోభంలో ఉంది. ఈ నేపథ్యంలో మాంద్యం బారినపడకుండా ఆయా రంగాల వారీగా ప్రభుత్వం ప్రోత్సాహకాలు కల్పించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.

రంగాలవారీగా ప్రోత్సాహకాలు
అంతర్జాతీయ పరిణామాలతో పాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు తగ్గుతున్నాయి. ఈ ప్రభావం కూడా పడుతోంది. అమెరికా - చైనా వాణిజ్య యుద్ధ ప్రభావం మిగతా అన్ని దేశాలపై పడుతోందని, ఇది పెను నష్టం కలిగించే అవకాశాలు ఉన్నాయని యావత్ ప్రపంచం ఆందోళన చెందుతోంది. ఈ ప్రభావం భారత్ పైన కూడా ఉంటుందంటున్నారు. ఈ మాంద్యం ప్రభావం భారత్ పైన ఎక్కువగా ఉండేలా చర్యలు తీసుకోవడానికి మోడీ సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆయా రంగాలకు ప్రోత్సాహకాలు త్వరలో ప్రకటించనున్నారని, తద్వారా ఆయా రంగాలకు భారీ ఊరట కలిగించనున్నారని చెబుతున్నారు. పన్ను తగ్గింపు లాంటి చర్యలు తీసుకోనుంది.

మాంద్యం ప్రభావం భారత్‌పై తక్కువేనా?
2018-19 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వృద్ధి 6.8 శాతంగా ఉంది. 2015-16 తర్వాత ఇదే అత్యల్పం. అయితే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక మాంద్య ప్రభావం మన దేశం మీద అంతగా ఉండకపోవచ్చునని మోర్గాన్ స్టాన్లీ ఇటీవల అంచనా వేసింది. పారిశ్రామిక ఉత్పత్తి, మౌలిక సదుపాయాలు, వాహన పరిశ్రమల లాంటివి మందగమనంలో ఉన్నప్పటికీ మాంద్యం దరిచేరకపోవచ్చునని పేర్కొంది. దశాబ్దం క్రితం ఇలాగే మాంద్యం ఏర్పడినప్పుడు అమెరికా, ఐరోపా దేశాలతో పోలిస్తే భారత్ పైన ప్రభావం తక్కువగా పడింది. మిగతా దేశాల కంటే త్వరగా కోలుకుంది.


Click it and Unblock the Notifications