మ్యూచువల్ ఫండ్స్ లోకి పెట్టుబడులు పెరుగుతున్నాయి. గత జులై లో మ్యూచువల్ ఫండ్స్ లోకి మొత్తంగా రూ. 87,087 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈక్విటీ, లిక్విడ్, మనీ మార్కెట్ ఫండ్స్, ఎక్స్చేంజి ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్) లోకి భారీగా పెట్టుబడులు వచ్చాయి. అయితే క్రెడిట్ రిస్క్ ఫండ్స్ నుంచి మాత్రం పెట్టుబడులు ఎక్కువగా తరలి పోయాయి. మొత్తంగా మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలోని ఆస్తులు (ఏయుఎం) జులై చివరి నాటికీ రూ. 24.5 లక్షల కోట్లుగా ఉన్నాయి. స్టాక్ మార్కెట్ల పనితీరు మరీ అంత ఆకర్షనీయంగా లేకపోవడం వల్ల ఏయుఎం లో వృద్ధి ఫ్లాట్ గానే ఉంది. స్టాక్ మార్కెట్లు బలహీనంగా ఉన్నప్పటికి ఈక్విటీ పథకాల్లోకి పెట్టుబడులు జూన్ నెలతో పోల్చితే జులై లో 7 శాతం మేర పెరిగాయి.
లిక్విడ్ ఫండ్స్ హవా..
* గత జులై నెలలో లిక్విడ్, మనీ మార్కెట్ ఫండ్స్ లోకి రూ. 56,000 కోట్లు వచ్చాయి.
* జూన్ నెలలో ఈ ఫండ్స్ నుంచి రూ. 1,50,000 కోట్ల పెట్టుబడులు తరలి పోయాయి. ఇందుకు కారణం లేకపోలేదు. చాలా మంది కార్పొరేట్లు తమ అడ్వాన్స్ టాక్స్ చెల్లింపుల కోసం లిక్విడ్ ఫండ్స్ నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ఫలితంగా నిధులు వెళ్లిపోయాయి. అయితే తర్వాతి నెలలో మల్లి వీరి పెట్టుబడులు తిరిగి వెనక్కు వచ్చాయి.
ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ స్కీమ్స్..
* ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ స్కీమ్స్ లోకి జులైలో రూ. 8,113 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అయితే క్లోజ్ ఎండెడ్ ఈక్విటీ స్కీమ్స్ నుంచి రూ. 21 కోట్ల పెట్టుబడులు తరలి పోయాయి. దీంతో నికర పెట్టుబడులు రూ. 8,092 కోట్లకు చేరుకున్నాయి.
* మార్కెట్లలో దిద్దుబాటు చోటుచేసున్నందువల్ల ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఎక్కువ ఆసక్తి చూపారు.
* లార్జ్, మిడ్ కాప్ ఫండ్స్ లోకి ఎక్కువ పెట్టుబడులు వచ్చాయి.

సిప్ సిప్ హుర్రే
* క్రమానుగత పెట్టుబడి పథకాల (సిప్) ద్వారా ఈక్విటీ ఫండ్స్ లోకి పెట్టుబడులు భారీగా పెరిగాయి. జులై ఈ పెట్టుబడులు రూ. 8,324 కోట్లుగా ఉన్నాయి.
* సిప్ ల పెట్టుబడులు పెరగడం వల్ల వీటికి మంచి ఆదరణ లభిస్తున్నట్టు స్పష్టమవుతోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
* సిప్ ల్లో పెట్టుబడులు ఇదే స్థాయిలో పెరిగితే ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం పెట్టుబడులు రూ. లక్ష కోట్లు దాటె అవకాశం ఉంటుందని అంటున్నారు.
* మ్యూచువల్ ఫండ్స్ ఆస్తుల్లో వ్యక్తిగత ఇన్వెస్టర్ల వాటా 54.3 శాతంగా ఉంది. రానున్న కాలంలో ఈ పెట్టుబడులు మరింతగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
* బ్యాంకుల్లో వడ్డీ రేట్లు తగ్గుతున్న విషయం తెలిసిందే. ఇంతకు ముందు కొంతమంది మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు తక్కువ పెట్టి బ్యాంకుల్లో ఎక్కువ పెట్టుబడులు పెట్టె వారు. అయితే ఎప్పుడు ఎక్కువగా మ్యూచువల్ ఫండ్స్ లోకి పెట్టుబడులను తరలిస్తున్నారు.
More From GoodReturns

Stock market: మార్కెట్ షాక్ ఇచ్చినా భయం వద్దు.. ఇన్వెస్టర్లకు ఇవే సేఫ్ ఆప్షన్లు!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications