న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 73వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తొలుత రాజ్‌ఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. అనంతరం ఎర్రకోట వద్ద త్రివిధ దళాల గౌరవవందనం స్వీకరించారు. పతాక ఆవిష్కరణ అనంతరం ప్రధాని మోడీ మాట్లాడారు. ఎంతోమంది త్యాగాల ఫలితమే ఈ స్వతంత్ర్యం అన్నారు. శాంతి, సమృద్ధి, భద్రత కోసం స్వాతంత్రం తర్వాత అందరూ కృషి చేశారన్నారు.

ఇన్‌ఫ్రాలో 100 లక్షల కోట్లు ఇన్వెస్ట్
మోడర్న్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం రూ.100 లక్షల కోట్లను ఇన్వెస్ట్ చేస్తామని వెల్లడించారు. రానున్న అయిదేళ్లలో 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను నిర్మించేందుకు ఇలా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తామని చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భారత్ టాప్ 50 దేశాల్లో ఉండేలా సంస్కరణలు చేపడతామన్నారు.

5 ట్రిలియన్ డాలర్లకు ఆర్థిక వ్యవస్థ
అయిదేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లకు చేయాలనే లక్ష్యం కొంతమందికి కష్టంగా కనిపించవచ్చునని, కానీ స్వాతంత్రం వచ్చిన ఏడు దశాబ్దాలలో సాధించిన 2 ట్రిలియన్ డాలర్ల పరిమాణంతో పోలిస్తే 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చాక అయిదేళ్ల కాలంలో 1 ట్రిలియన్ డాలర్లను ఆర్థిక వ్యవస్థకు జోడించిందని మోడీ చెప్పారు. వచ్చే అయిదేళ్లలో 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా నిర్మించడం అసాధ్యమేమీ కాదన్నారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవచ్చునని చెప్పారు.

వైద్య రంగంలో కొత్త సంస్కరణలు
వైద్య రంగంలోను కొత్త సంస్కరణలు తీసుకు వచ్చామని మోడీ చెప్పారు. ఆయుష్మాన్ భారత్ దేశ ప్రజలకు ఓ వరం అన్నారు. వైద్యాన్ని ప్రతి సామాన్యుడికి అందుబాటులోకి తేవాలన్నదే తమ లక్ష్యం అన్నారు. రైతులకు పింఛన్లు అందిస్తున్నామన్నారు. అయిదేళ్లలో మెరుగైన భారత్‌ను నిర్మించేందుకు కృషి చేస్తున్నామన్నారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అనే నినాదంతో ముందుకు సాగుతున్నామన్నారు.
ప్రధాని కీలక ప్రకటనలు
ప్రధాని మోడీ ఈ ప్రసంగంలో కీలక ప్రకటనలు చేశారు. జనాభా నియంత్రణకు సరికొత్త పాలసీ తీసుకు వస్తామని ఆయన వెల్లడించారు. ప్రజల ఆకాంక్ష మేరకు ఆర్టికల్ 370ని రద్దు చేశామన్నారు. దీంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ కలను సాకారం చేశామన్నారు. 70 ఏళ్లుగా చేయని వాటిని తాము 70 రోజుల్లో చేసి చూపించామన్నారు. ఈ 70 రోజుల్లో చిన్నారుల భద్రత నుంచి చంద్రయాన్ దాకా, అవినీతిపై పోరు నుంచి ట్రిపుల్ తలాక్ వరకు, కాశ్మీర్ నుంచి రైతుల దాకా ఎన్నో చేశామన్నారు. ప్రజల సమస్యలకు పరిష్కారాలు అన్వేషిస్తున్నామన్నారు.
More From GoodReturns

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications