బాక్సింగ్ మాజీ దిగ్గజం మైక్ టైసన్ ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు. ఇరవై ఏళ్ల వయస్సులోనే హెవీ వెయిట్ ఛాంపియన్‌గా నిలిచాడు. బాక్సింగ్ క్రీడకు గుడ్ బై చెప్పాక కాలిఫోర్నియాలో డ్రగ్ వ్యాపారం చేస్తున్నాడు. అలాగే, హాలీవుడ్ సినిమాల్లోను కనిపిస్తుంటాడు. డ్రగ్ వ్యాపారంలో అతను రాణిస్తున్నాడు.

నెలకు 40 వేల డాలర్ల గంజాయి పీల్చుతాడు
తాజాగా సోమవారం ఓ కార్యక్రమంలో గంజాయి తనకు ఎంత ఇష్టమో చెప్పకనే చెప్పాడు. గంజాయిని పెద్ద మొత్తంలో ఉపయోగిస్తానని షాకింగ్ విషయం చెప్పాడు. ఈ సైకోటిక్ (గంజాయి) డ్రగ్ కోసం తాను ఎంత పెద్ద మొత్తం ఖర్చు చేస్తున్నానో వెల్లడించాడు. ఆయన చేసే ఖర్చు చూస్తే అందరూ షాకవ్వాల్సింది. తాను, తన వ్యాపార భాగస్వామి కలిసి నెలకు 40 వేల డాలర్ల విలువ చేసే వీడ్ తీసుకుంటామని చెప్పాడు. అంటే మన రూపాయల్లో దాదాపు రూ.28 లక్షలు.

మైక్ టైసన్
53 ఏళ్ల మైక్ టైసన్ మూడేళ్ల క్రితం ప్రారంభించిన తన గంజాయి రిసార్టుకు సమయం ఎక్కువగా కేటాయిస్తున్నాడు. ఇప్పుడు 407 ఎకరాల్లో భారీ గంజాయి రిసార్ట్ కోసం ప్లాన్ చేస్తున్నాడు. ఈ రిసార్టులో హోటల్, స్పా, లాడ్జీ, గ్లాంపింగ్ పార్కు ఉండనున్నాయి. అలాగే, రిసార్టు చుట్టూ అతిపెద్ద స్నేకింగ్ రివర్ ఏర్పాటు చేయనున్నాడు.

గంజాయి కోసం..
మరిజునా, మ్యూజిక్ ఫెస్టివెల్స్ నిర్వహించే ప్లాన్ చేస్తున్నాడు. గంజాయిని సాగు చేసే రైతులకు డిగ్రీ స్టైల్ కోర్సుల కోసం టైసన్ యూనివర్సిటీని కూడా ప్లాన్ చేస్తున్నాడు. కాగా, మైక్ టైసన్ తన సొంత ఉత్పత్తుల ప్రచారం కోసం హాట్ బాక్సిన్ పేరుతో వారానికి ఒకసారి కార్యక్రమాన్ని నిర్వహిస్తాడు.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications