For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఊరట, భారీగా తగ్గిన బంగారం ధరలు

|

ఢిల్లీ: గత కొద్ది రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం బుధవారం రోజు దిగి వచ్చింది. వెండి ధర స్వల్పంగా తగ్గింది. అంతర్జాతీయంగా మాత్రం బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర బుధవారం నాడు రూ.425 తగ్గి రూ.37,945గా ఉంది. వెండి ధర కిలోకు రూ.690 తగ్గి రూ.44,310గా ఉంది. ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం రూ.425 తగ్గి రూ.37,945గా ఉండగా, 99.5 శాతం స్వచ్చత కలిగిన బంగారం రూ.37,775కు తగ్గింది. వెండి ధర రూ.44,310కు తగ్గింది.

హైదరాబాద్ మార్కెట్లో గురువారం ఒక్కరోజులోనే బంగారం ధర రూ.2వేలకు పైగా తగ్గింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.2490 తగ్గి రూ.37 వేలకు చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.360 తగ్గి రూ.35,760 వద్ద ఉంది. అంతర్జాతీయంగా బంగారం ధరలు ఎక్కువే ఉన్నప్పటికీ దేశీయ మార్కెట్లో ఇన్వెస్టర్ల అమ్మకాలు, జ్యువెల్లర్స్, రిటైలర్ల నుంచి డిమాండ్ పడిపోవడంతో ధర తగ్గింది.

బ్యాంకు అకౌంట్ క్లోజ్ చేయాలా: ఎలా చేయాలి, ఎంత ఛార్జ్?బ్యాంకు అకౌంట్ క్లోజ్ చేయాలా: ఎలా చేయాలి, ఎంత ఛార్జ్?

Gold prices slump after hitting record high, silver rates tumble

అమెరికా - చైనా మధ్య ట్రేడ్ వార్ తెలిసింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లలో, దేశీయ మార్కెట్లలో రూపాయి బలహీనపడటంతో పాటు బంగారం ధర పెరిగింది. చైనా ఉత్పత్తుల దిగుమతిపై టారిఫ్ అమలును డిసెంబర్ వరకు వాయిదా వేస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీంతో రూపాయి పుంజుకోవడంతో పాటు ఈక్విటీ మార్కెట్లు ఊపందుకున్నాయి. బంగారం ధర తగ్గింది.

English summary

ఊరట, భారీగా తగ్గిన బంగారం ధరలు | Gold prices slump after hitting record high, silver rates tumble

Gold and silver prices today tumbled after they hit record highs recently. In spot markets, gold prices today slumped ₹425 to ₹37,945 per 10 gram in Delhi markets.
Story first published: Thursday, August 15, 2019, 14:04 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X