న్యూఢిల్లీ: ఆటోమొబైల్స్ సేల్స్ వలే ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (FMCG) కూడా మందగమనంగా కొనసాగుతోంది. సబ్బులు, బిస్కట్లు వంటి ఇతర రోజువారీ వినియోగ వస్తువులు సేల్స్ తగ్గిపోయాయి. ఆటో సేల్స్ వలే FMCGలోనూ సేల్స్ పడిపోయాయని ఈ రంగంలోని మేజర్ కంపెనీలు చెబుతున్నాయి. ఈ మందగమనం గ్రామీణ భారతంలో ఎక్కువగా కనిపిస్తోంది. భౌగోళికపరంగా ఉత్తరాదిన మరింత ఎక్కువగా ఉంది.

తగ్గిన టాప్ కంపెనీ సేల్స్
అతిపెద్ద FMCG కంపెనీ హిందూస్తాన్ యూనివర్ లిమిటెడ్ అమ్మకాలు జూన్ క్వార్టర్‌లో అంతకుముందు ఇదే ఏడాది ఇదే క్వార్టర్‌తో పోలిస్తే 7 శాతం తగ్గాయి. రెండో అతిపెద్ద బిస్కట్ కంపెనీ బ్రిటానియా ఇండస్ట్రీస్ సేల్స్ కూడా 7 శాతం పడిపోయాయి. అలాగే డాబూర్ ఇండియా సేల్స్ ఏప్రిల్ - జూన్ క్వార్టర్‌లో 15 శాతం తగ్గాయి. జూలై నెలలో వార్షిక టోకు ధరల ద్రవ్యోల్భణం 25 నెలల కనిష్టస్థాయికి చేరుకొని 1.08 శాతం తగ్గింది.

4 నుంచి 6 శాతం తగ్గుదల
ఓ వైపు వ్యాపారం మందగమనంగా కొనసాగుతుండటంతో వ్యాపారులు ధరలు పెంచేందుకు జంకుతున్నారు. హిందూస్థాన్ యూనీవర్ లిమిటెడ్ సంస్థలోని ఫైనాన్స్, ఐటీ, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీనివాస్ పాఠక్ మాట్లాడుతూ... FMCG మందగమనంతో కొనసాగుతోందని అభిప్రాయపడ్డారు. సబ్బుల విభాగంలో ధరలను 4 శాతం నుంచి 6 శాతం వరకు తగ్గించాలని బోర్డు నిర్ణయించినట్లు తెలిపారు. మందగమనాన్ని ఎదుర్కోవడంతో పాటు ఇన్‌పుట్ ప్రయోజనాలు వినియోగదారులకు అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు.

ఆర్థిక మందగమనం
డాబుర్ ఇండియా సీఈవో అండ్ హోల్ టైమ్ డైరెక్టర్ మోహిత్ మల్హోత్రా మాట్లాడుతూ ఏప్రిల్, మే నెలల్లో సేల్స్ బాగానే ఉన్నాయని, జూన్ నెలలో తగ్గిపోయాయని, ఇందుకు ఆర్థిక మందగమనం ప్రధాన కారణమన్నారు. వ్యవసాయ సంక్షోభం కారణంగా గ్రామీణ భారతంలో సేల్స్ తగ్గినట్లుగా అభిప్రాయపడ్డారు. భౌగోళికంగా చూస్తే దక్షిణాది తర్వాత తూర్పు కాస్తా బెట్టర్ అని, ఆ తర్వాత వెస్ట్ ప్రాంతంలో సేల్స్ తగ్గాయన్నారు. ఉత్తరాదిన అయితే చాలా దారుణంగా ఉన్నాయి. గ్రామీణ వేతనాల్లో స్వల్పంగా తగ్గుతల కనిపిస్తోంది.

ITC ltd OR hotels
గ్రామీణ భారతంలో సేల్స్ భారీగా తగ్గడం వల్ల ఇండియా ప్యాకేజ్డ్ గూడ్స్ సెక్టార్ పైన భారీ ప్రభావం పడిందని మార్కెట్ రీసెర్చర్ సంస్థలు చెబుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ భారతంలో మందగమనం రెండింతలు ఎక్కువగా ఉందని మార్కెట్ రీసెర్చర్ నీల్సన్ తెలిపింది. 2018 మూడో త్రైమాసికంతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఎఫ్ఎంసీజీ వృద్ధి 9.7 శాతం పడిపోయింది. ప్యాకేజింగ్, ప్రింటింగ్ వ్యాపారంపై ప్రభావం పడిందని టుబాకో, పేపర్ మేజర్ ఐటీసీ తన స్వతంత్ర ఫలితాలు ప్రకటించిన సమయంలో వెల్లడించింది. హోటళ్ల తీరు కూడా అలాగే ఉంది.

వృద్ధి
డిమాండును పెంచే ప్రయత్నంలో భాగంగా ఎఫ్ఎంసీజీ కంపెనీలు ధరల తగ్గింపువైపు మొగ్గు చూపుతున్నాయి. పెరుగుతున్న స్తోమత, లభ్యత, డిమాండ్ కారణంగా గ్రామీణ భారతదేశం చారిత్రాత్మకంగా పట్టణాల కంటే 3 నుండి 5 శాతం వేగంతో పెరుగుతోంది. ఇటీవల గ్రామీణ వృద్ధి త్రైమాసికాల్లో పట్టణ రేటు కంటే రెట్టింపు అవుతోంది. ఇది గ్రామీణ వృద్ధిని పట్టణ వృద్ధికి దగ్గర చేసిందని మార్కెట్ రీసెర్చర్ సంస్థలు అంటున్నాయి. ఇటీవల రూరల్ వృద్ధి నార్త్ ఇండియాలో ఎక్కువగా ఉంది. హర్యానా, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, అసోంలలో ఎక్కువ మందగమనం ఉంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications