For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూపాయి ... నీ పయనమెటు?

|

రోజుకు 130 కోట్ల మంది భారతీయులు పొద్దున్న లేచింది మొదలు దాని వెనకాల పరిగెడతారు. ఎవరి దగ్గర ఎంత ఎక్కువ ఉంటె వారే హీరో. అది లేనిదే ఏ పనీ జరగదు. ఇదంతా ఎవరి గురించి అని ఆలోచిస్తున్నారా? అదేనండీ మన రూపాయి. రోజుకు కొందరిని కోటీశ్వరులను చేస్తూ .. మని కొందరిని అప్పుల ఊబిలోకి దించుతూ ఆటాడిస్తూ ఉంటుంది. కానీ... అంతర్జాతీయ కరెన్సీ లతో పోటీలో మాత్రం మన రూపాయి అంతకంతకూ వెనకబడి పోతోంది. ముఖ్యంగా అమెరికా డాలర్ తో అయితే చెప్పనక్కరలేదు. స్టాక్ మార్కెట్లు కుదేలు అవుతున్న ఈ తరుణంలో మన కరెన్సీ కి కష్టమొచ్చింది. నిన్న ఏకంగా డాలర్ తో రో 71.40 కు పడిపోయి ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో రూపాయి పయనం ఎటువైపు అని నిపుణులు కలవరపడుతున్నారు. ఇక్కడితో ఈ కుంగుబాటు ఆగుతుందా ... లేదంటే... మరింతగా పతనమై... బలహీన పడుతుందా అని లెక్కలు వేస్తున్నారు.

<strong>ప్రతినెల ఆదాయం: పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కం గురించి తెలుసుకోండి</strong>ప్రతినెల ఆదాయం: పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కం గురించి తెలుసుకోండి

రూ 72 నుంచి రూ 75 వరకు...

రూ 72 నుంచి రూ 75 వరకు...

కొన్ని రోజులుగా జరుగుతున్నా పరిణామాలను గమనిస్తే... రూపాయి పతనం మరింత అధికంగా ఉంటుందని అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఇది ఏకంగా రూ 72 నుంచి రూ 75 వరకు చేరుకొనే అవకాశం ఉందని వారు విశ్లేషిస్తున్నారు. ఇదే జరిగితే భారత్ దిగుమతి చేసుకొనే పెట్రోలియం ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్, మొబైల్స్, కెమికల్స్, వంట నూనెల ధరలు మరింతగా పెరుగుతాయి. తద్వారా వాణిజ్య లోటు అధికం అవుతుంది. ఇది భారత్ ఆర్థిక వ్యవస్థకు గొడ్డలిపెట్టు లాంటిదే.

అంతర్జీయ పరిణామాలు...

అంతర్జీయ పరిణామాలు...

దేశీయంగా అరువుమోబైల్ అమ్మకాలు అంతకంతకూ పడిపోతూ మడగమం ముందు ఉన్నాడని స్పష్టం చేస్తున్నాయి. ఇతర రంగాలు కూడా పెద్దగా ఆశాజనకంగా ఏమి లేవు. దీంతో దేశంలో ఆర్థిక మాంద్యం ప్రారంభమైందన్న సంకేతాలు వచ్చాయి. బడ్జెట్ లో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించిన కొన్ని ప్రతిపాదనలు నచ్చని విదేశీ సంస్థాగత పెట్టుపడిదారులు స్టాక్ మార్కెట్ల నుంచి వారి పెట్టుబడులను ఉపసంహరిస్తున్నారు. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ నెల చూపులు చూస్తున్నాయి. 300 కు పైగా బలమైన కంపెనీల షేర్లు 52 వరాల కనిష్ట స్థాయిలో ట్రేడ్ అవుతున్నాయి. దీనికి తోడు, అమెరికా - చైనా మధ్య వాణిజ్య యుద్ధం, బ్రేక్సిట్ వంటి పరిణామాలు ప్రప్రఞ్చ వ్యాప్తంగా ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేస్తున్నాయి. ఈ పరిణామాల ప్రభావం భారత్ పై కూడా పడుతోంది. అందుకే... మన కరెన్సీ అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే చిన్న బోతోంది.

బంగారం పెరిగింది..

బంగారం పెరిగింది..

ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వృద్ధిలో కొనసాగుతున్న అనిశ్చితి, ముడి చమురు ధరల ప్రభావం తో పెట్టుబడి దారులు బంగారం లోకి వారి పెట్టుబడులను తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్ దిగుమతి చేసుకొన్నా బంగారానికి అధిక అధిక డాలర్లు వెచ్చించాల్సి వస్తోంది. గత ఆరు నెలల కాలంలో బంగారం దిగుమతులు భారత్ లో పెరగటం దీనినే చూచిస్తోంది.

చైనా ... అర్జెంటీనా ...

చైనా ... అర్జెంటీనా ...

మన రూపాయి పఠనం అవుతున్నట్లే.... పొరుగు దేశం చైనా కరెన్సీ యువాన్ కూడా కొంత పతనమైంది. కరెన్సీ ని కట్టడి చేయడంలో సిద్ధహస్తురాలైన చైనా సైతం ప్రస్తుత పరిణామాల మధ్య యువాన్ పతనాన్ని అడ్డుకోలేదు. ఇది కొంత వరకు ఆ దేశానికి కలిసొచ్చే విషయమే. అదే సమయంలో అర్జెంటీనా కరెన్సీ పేసో కూడా 25% పతనం అవడం ప్రపంచ మార్కెట్లను కుదిపేసింది. ఇది కొంత వరకు భారత స్టాక్ మార్కెట్ల పైన ప్రభం చూపించింది.

ఎగుమతులకు మేలు...

ఎగుమతులకు మేలు...

రూపాయి పతనమై బలహీన పడితే... మన దేశం నుంచి జరిగే ఎగుమతులు పెరుగుతాయి. లేదంటే ... ఎగుమతుల వాళ్ళ లభించే మొత్తం ఆదాయం పెరుగుతుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ గూడ్స్, ఫార్మస్యూటికల్స్, అగ్రి కమోడిటీస్ వంటి రంగాలు మెరుగైన రాబడులను పొందుతాయి. కానీ మన దేశ ఎగుమతుల కంటే.. దిగుమలే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే విషయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం రూపాయి పతనాన్ని కట్టడి చేయాలనీ వారు అభిప్రాయపడుతున్నారు. లేదంటే.. ఇప్పటికే మూలుగుతున్న ఆర్థిక వ్యవస్థపై ఇది తాటికాయ పడినట్లు మారుతుందని చెబుతున్నారు.

English summary

రూపాయి ... నీ పయనమెటు? | Where is the Indian rupee headed?

The Indian rupee has had a terrible year so far but it is only likely to get worse in 2019.
Story first published: Wednesday, August 14, 2019, 10:12 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X