ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) అధినేత ముఖేష్ అంబాని సోమవారం (ఆగస్ట్ 12) షేర్ హోల్డర్స్ సమావేశంలో మాట్లాడారు. గత ఏడాది అత్యధిక లాభాలు ఆర్జించి చరిత్ర సృష్టించామన్నారు. భారత ఆర్థిక వ్యవస్థలో రిలయన్స్ భాగస్వామ్యం కీలకం అన్నారు. 2030 నాటికి 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలుస్తుందన్నారు. రిలయన్స్ జియో 340 మిలియన్ల వినియోగదారులను దాటినట్లు తెలిపారు. రిటైల్ రంగంలో లక్షా 30వేల కోట్ల బిజినేస్ చేశామని చెప్పారు. సౌదీ ఆరామ్కోతో భాగస్వామ్యం కుదుర్చుకోనున్నట్లు చెప్పారు. ముఖేష్ అంబానీ, ఆకాశ్ అంబానీలు ఏం చెప్పారంటే...
Aug 12, 2019, 12:20 pm IST
- జియో ఫైబర్ కస్టమర్లు ఏడాది ఆప్షన్ ఎంచుకుంటే వెల్ కం ఆఫర్ కింద కొత్త జియో ఫరెవర్ ప్లాన్ పొందుతారు. ఫుల్ హెచ్డీ టీవీ లేదా హోమ్ పీసీ, 4కే సెట్ టాప్ బాక్స్ ఉచితంగా ఇస్తారు.
Aug 12, 2019, 12:18 pm IST
- థియేటర్లో సినిమా రిలీజైన రోజునే మీ ఇంట్లోనే చూసే సేవలు 2020న అందుబాటులోకి రానున్నట్లు ముఖష్ అంబానీ ప్రకటించారు.
Aug 12, 2019, 12:18 pm IST
- జియో ఫైబర్ ప్రీమియం సర్వీస్‌లను ప్రారంభిస్తుంది. సినిమాలు విడుదలైన రోజునే మీ ఇంట్లో చూడవచ్చు.
Aug 12, 2019, 12:17 pm IST
- జియో ఫైబర్ సబ్‌స్క్రైబర్స్‌కు ఇంటి నుంచి వాయిస్ కాల్స్ పూర్తిగా ఉచితం
Aug 12, 2019, 12:16 pm IST
- జియో ఫైబర్ ప్లాన్ ధర నెలకు రూ.700 నుంచి రూ.10,000 వరకు ఉంటుంది.
Aug 12, 2019, 12:16 pm IST
- జియో ఫైబర్ మోస్ట్ బేసిక్ ప్లాన్ 100 Mbps నుంచి ప్రారంభమవుతుంది. 1Gbps వరకు ఉంటుంది.
Aug 12, 2019, 12:15 pm IST
- ఎంఆర్ హెడ్ సెట్స్ డెవలప్‌ను ఉధ్దేశించి అంబానీ మాట్లాడుతూ.. ఇది యంగ్ ఇండియా పవర్ అని కితాబిచ్చారు.
Aug 12, 2019, 12:15 pm IST
- సరికొత్త ఎంఆర్ (మిక్స్డ్ రియాలిటీ) హెడ్ సెట్స్ ఓ స్టార్టప్ డెలవప్ చేసింది. ఇందులో జియో పెట్టుబడి పెట్టింది. ఇది త్వరలో మార్కెట్లోకి రానుంది.
Aug 12, 2019, 12:13 pm IST
- ఎంఆర్ హెడ్ సెట్స్ పైన అంబానీ డెమో ఇచ్చారు.
Aug 12, 2019, 12:13 pm IST
- జియో కోసం వినియోగించిన ఫైబర్ ఎంత అంటే 11సార్లు భూమిని చుట్టేంత.
Aug 12, 2019, 12:12 pm IST
- జియో సెటప్ బాక్స్ గేమింగ్స్‌ను సపోర్ట్ చేస్తాయి.
Aug 12, 2019, 12:11 pm IST
ఆకాశ్ అంబానీ మాట్లాడుతూ.. వీడియో కాన్ఫరెన్స్‌లపై వేలాది రూపాయలు ఖర్చు చేయడం ఇక హిస్టరీ కానుందని చెప్పారు.
Aug 12, 2019, 12:09 pm IST
- జియో బ్రాడ్ బాండ్ స్పీడ్ 100 Mbps నుండి ప్రారంభమవుతుంది. 1Gbps వరకు ఉంటుంది.
Aug 12, 2019, 11:57 am IST
- చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు బ్రాడ్ బాండ్ సేవల విస్తరణ
Aug 12, 2019, 11:56 am IST
- ఈ ఆర్థిక సంవత్సరం ఐవోటీని దేశవ్యాప్తంగా విస్తరిస్తాం.
Aug 12, 2019, 11:54 am IST
- హోమ్ బ్రాడ్ బాండ్ - అల్ట్రా హై ఇంటర్నెట్, యూహెచ్డీ సెటాప్ బాక్స్. ఒకే కనెక్షన్‌తో ఇంటర్నెట్, డీజీహెచ్ సేవలు.
Aug 12, 2019, 11:50 am IST
- జిగా ఫైబర్ రోలౌట్ రానున్న 12 నెలల్లో పూర్తి.
Aug 12, 2019, 11:50 am IST
- 5 సెప్టెంబర్ 2019న జియో భైపర్ సేవల కమర్షియల్ లాంచ్. భారత్ మొత్తానికి ఇంటర్నెట్ అందించడమే లక్ష్యం. ప్రతి ఇంటికి, ఎంటర్ప్రైస్కు, ఎస్ఎంఈలకు బ్రాడ్ బాండ్ లక్ష్యం.
Aug 12, 2019, 11:48 am IST
- 1,600 పట్టణాల్లో, 20 మిలియన్ల మందికి బ్రాడ్ బాండ్ కనెక్షన్లు.
Aug 12, 2019, 11:44 am IST
- జియో గిగా ఫైబర్ ద్వారా త్వరలో 20 మిలియన్ల ఇళ్లకు సేవలు అందిస్తాం.
Aug 12, 2019, 11:43 am IST
- రిలయన్స్ జియోలో ప్రతి నెల 10 మిలియన్ల మంది భాగస్వాములు అవుతున్నారు.
Aug 12, 2019, 11:42 am IST
- సౌదీ ఆరామ్కోతో ఒప్పందం అనంతరం రిలయన్స్ రిఫైనరీస్‌కు ఆ కంపెనీ రోజుకు 5,00,000 బ్యారెల్స్ క్రూడాయిల్‌ను సరఫరా చేస్తుంది.
Aug 12, 2019, 11:41 am IST
- రిలయన్స్ తన ఫ్యూయల్ రిటైల్ వ్యాపారంలోని 49 శాతం వాటాలను BPకి విక్రయించడం ద్వారా రూ.7,000 కోట్లు రాబడుతుంది.
Aug 12, 2019, 11:36 am IST
- జియోను ఆదరించిన భారతీయులందరికీ కృతజ్ఞతలు. భారత దేశంలో కొన్ని సెక్టార్లు వెనుకబడ్డాయని, కానీ అది తాత్కాలికమే.
Aug 12, 2019, 11:34 am IST
- ప్రతి ఒక్కరికి డిజిటల్ నెట్ వర్క్ అందుబాటులో తేవాలన్నదే లక్ష్యం.
Aug 12, 2019, 11:33 am IST
- రిలయన్స్ జియోని 5Gగా అప్ గ్రేడ్ చేస్తాం. జియో బ్రాడ్ బాండ్ సేవలు త్వరలో ప్రారంభిస్తున్నాం. నాలుగు రకాల బ్రాడ్ బ్యాండ్ సేవలు ప్రారంభిస్తున్నాం. సెప్టెంబర్ 5వ తేదీ నాటికి జియో ఆవిష్కరించి మూడేళ్లు పూర్తవుతుంది.
Aug 12, 2019, 11:31 am IST
- భారతీయ మూల సిద్ధాంతాలు చాలా బలంగా ఉన్నాయి.
Aug 12, 2019, 11:31 am IST
- ప్రయివేటు సెక్టార్ రంగంలో హయ్యెస్ట్ కస్టమ్, ఎక్సైజ్ డ్యూటీ పేయర్‌గా నిలుస్తున్నాం.
Aug 12, 2019, 11:31 am IST
- రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇండియా అతిపెద్ద ఎగుమతిదారు.
Aug 12, 2019, 11:31 am IST
- రిటైల్ రంగంలోని ఇతర అన్ని కంపెనీలతో పోల్చినా రిలయన్స్ రిటైల్ అతి పెద్దది.
Aug 12, 2019, 11:31 am IST
- రిటైల్ రంగంలో లక్షా 30వేల కోట్ల బిజినెస్ చేశాం.
Aug 12, 2019, 11:30 am IST
- భారత ఆర్థిక వ్యవస్థలో రిలయన్స్ భాగస్వామ్యం కీలకం.
Aug 12, 2019, 11:30 am IST
- పెట్రో కెమికల్స్‌లో సౌదీ ఆరాంకోతో ఒప్పందం. రిలయన్స్ పెట్రో కెమికల్స్‌లో సౌదీ ఆరాంకో 20 శాతం పెట్టుబడులు పెడుతుంది. విదేశీ పెట్టుబడుల్లో ఇదే అతిపెద్ద భాగస్వామ్యం.
Aug 12, 2019, 11:30 am IST
- రిలయన్స్ జియో 340 మిలియన్ల వినియోగదారులను దాటింది.
Notifications
Settings
Clear Notifications
No New Notifications
Notifications
Use the toggle to switch on notifications
Block for 8 hours
Block for 12 hours
Block for 24 hours
Don't block
To start receiving timely alerts, as shown below click on the Green “lock” icon next to the address bar
Click it and Unblock the Notifications
Close X
Close X
To Start receiving timely alerts please follow the below steps:
Click on the Menu icon of the browser, it opens up a list of options.
Click on the “Options ”, it opens up the settings page,
Here click on the “Privacy & Security” options listed on the left hand side of the page.
Scroll down the page to the “Permission” section .
Here click on the “Settings” tab of the Notification option.
A pop up will open with all listed sites, select the option “ALLOW“, for the respective site under the status head to allow the notification.
Once the changes is done, click on the “Save Changes” option to save the changes.