భోపాల్: ప్రముఖ వ్యాపారావేత్త కుమార్ మంగళం బిర్లా మధ్యప్రదేశ్‌లో 100 హైటెక్ గోశాలలు నిర్మించనున్నారు. ముఖ్యమంత్రి (మధ్యప్రదేశ్) కమల్ నాథ్ రెండు రోజుల పాటు ముంబైలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆ రాష్ట్రంలో గోశాలలు నిర్మించాలనే ప్రతిపాదన తీసుకు వచ్చారు. ఈ నేపథ్యంలో బిర్లా హైటెక్ గోశాలలు నిర్మించేందుకు సిద్ధమయ్యారు.
కార్పోరేట్ సోషల్ రెస్బాన్సిబిలిటీ (CSR) కింద బిర్లా వీటిని నిర్మించనున్నారు. రానున్న పద్దెనిమిది నెలల్లో వంద హైటెక్ గోశాలలు నిర్మిస్తారు. గతంలో అధికారంలో ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం గోశాలలకు అధిక ప్రాధాన్యతను ఇచ్చింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా గోశాలల నిర్మాణానికి, ఆవుల రక్షణకు పూనుకుంటామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది.
నాలుగు నెలల్లో వెయ్యి గోశాలలు నిర్మిస్తామని కాంగ్రెస్ పార్టీ జనవరిలో హామీ ఇచ్చింది. వీటిల్లో లక్ష గోవులను సంరక్షిస్తామని తెలిపింది. కానీ ఈ ప్రాజెక్టు ఆలస్యం కావడం ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టింది. గోశాలల నిర్మాణానికి స్థలం ఎంపికలలో జాప్యం కారణంగా ఆలస్యమవుతోందని చెబుతున్నారు.

గోశాలల నిర్మాణం నిమిత్తం నిధుల కోసం ముఖ్యమంత్రి కమల్ నాథ్ ఎన్నారైల సహకారం కూడా కోరనున్నారు. వచ్చే అయిదేళ్లలో 300 స్మార్ట్ గోశాలలను నిర్మించేందుకు ఓ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు కుమార్ మంగళం బిర్లా మరో 100 గోశాలలు నిర్మించనున్నారు.
సీఎం కమల్ నాథ్ గోశాలల నిమిత్తం టాటా గ్రూప్‌కు చెందిన చంద్రశేఖరన్, మహీంద్రా అండ్ మహీంద్రాకు చెందిన పవన్ గోయెంకా, టాటా పవర్‌కు చెందిన ప్రవీర్ సిన్హా, గ్రాసిమ్ గ్రూప్‌కు చెందిన దిలీప్ గౌర్, ఆర్పీజీ గ్రూప్‌కు చెందిన హర్ష్ గోయెంగా, ఏసీసీ సిమెంట్‌కు చెందిన దిలీప్ అఖురి, అహిల్య హెరిటేజ్ హోటల్స్‌కు చెందిన యశ్వంత్ హోల్కర్, నార్సీ మోంజీకి చెందిన అమ్రిష్ పటేల్‌లను కూడా కలిశారు. మధ్యప్రదేశ్‌లో గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్ నిర్మిస్తామని గత బుధవారం రిలయన్స్ గ్రూప్‌కు చెందిన ముఖేష్ అంబానీ ప్రకటించారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications