For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూపాయి విలువ క్షీణిస్తే ఎలాంటి సమస్యలు ఉంటాయో తెలుసా?

|

డాలర్ మారకంలో రూపాయి విలువ గత కొంత కాలంగా క్షీణిస్తోంది. ప్రస్తుతం రూపాయి 70 స్థాయిలో ఉంది. అంటే ఒక డాలర్ కోసం రూ.70 ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. రూపాయి మరింతగా బలహీన పడితే అనేక రకాల ప్రతికూల పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. సామాన్యుడి బడ్జెట్ కట్టుతప్పుతుంది. వివిధ రకాల ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. దీనివల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. రూపాయి విలువ క్షీణిస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో చూద్దాం...

<strong>దీనికోసమే వేచిచూస్తున్నాం: కాశ్మీర్‌కు పెట్టుబడుల వెల్లువ</strong>దీనికోసమే వేచిచూస్తున్నాం: కాశ్మీర్‌కు పెట్టుబడుల వెల్లువ

నిత్యావసర సరుకులు భగ్గు

నిత్యావసర సరుకులు భగ్గు

* రూపాయి విలువ తగ్గడం వల్ల విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వివిధ రకాల ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. ముడి చమురు, ఫెర్టిలైజర్స్, ఔషదాలు, ఇనుప ఖనిజం ధరలు పెరుగుతాయి. ముడిచమురు ధర పెరగడం వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి. డీజిల్ ధరలు పెరిగితే రవాణా వ్యయాలు పెరిగి నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతాయి. ఫలితంగా కుటుంబ బడ్జెట్ పై ప్రభావం ఉంటుంది.

* సబ్బులు, డిటెర్జెంట్స్, డియోడరెంట్స్, షాంపూలు వంటి వాటి ధరలు కూడా పెరుగుతాయి. ఎఫ్ ఎం సీజీ కంపెనీలు వివిధరకాల ఉత్పత్తులను తయారు చేయడానికి దిగుమతి చేసుకున్న ముడిసరుకులు వినియోగిస్తుంటాయి. వీటి ధరలు పెరిగితే తయారైన ఉత్పత్తుల ధరలు కూడా పెరుగుతాయి.

* వంట నూనెల ధరలు పెరుగుతాయి.

* ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు కూడా మండిపోతాయి.

విదేశీ విద్య అందని ద్రాక్ష

విదేశీ విద్య అందని ద్రాక్ష

* మన దేశం నుంచి ఏటా వేలాది మంది విద్యార్థులు విదేశాలకు ఉన్నత విద్య కోసం వెళుతుంటారు. వీసాతోపాటు విమాన టికెట్, ఫీజులు పెద్దమొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. రూపాయి విలువ క్షీణిస్తే వీటి కోసం ఎక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది.

* విదేశాల్లో అద్దెల కోసం ఇతర ఖర్చుల కోసం అధిక మొత్తం వెచ్చించాల్సి ఉంటుంది.

* విదేశీ విద్య కోసం రుణం తీసుకునే వారిపైనా ప్రభావం పడుతుంది.

విహార యాత్రలు తగ్గుతాయ్...

విహార యాత్రలు తగ్గుతాయ్...

* రూపాయి విలువ తగ్గడం అంటే విదేశాలకు వెళ్లే వారికీ నిరాశ కలిగించే అంశమే. విమాన టికెట్ల ధరలు పెరుగుతాయి. విదేశాల్లో విడిది దాదాపు అయిదు శాతం పెరుగుతుంది. ఆహారం కోసం కూడా ఎక్కువ వెచ్చించాల్సి ఉంటుంది.

* రూపాయి విలువ తగ్గడానికి ముందు విహారయాత్రలు బుక్ చేసుకున్నవారికి మాత్రం కొంత ఊరట లభిస్తుంది.

వాహనాల ధరలు పెరుగుతాయి...

వాహనాల ధరలు పెరుగుతాయి...

* కార్లు, టూవీలర్లలో అనేక రకాల విడిభాగాలను వినియోగిస్తుంటారు. వీటి తయారీలో దిగుమతి చేసుకున్న ముడిసరుకులు వినియోగిస్తే ఆ మేరకు ధరలు పెరగడానికి అవకాశం ఉంటుంది.

* ఉక్కు, టైర్లు, విడిభాగాల తయారీ ప్రియమైతే వాహనాల ధరలు పెరగడానికి అవకాశం ఉంటుంది.

ప్రభుత్వానికీ ఇబ్బందే..

ప్రభుత్వానికీ ఇబ్బందే..

* రూపాయి విలువ క్షీణిస్తే ప్రభుత్వానికి కూడా ఇబ్బంది. భారత్ దిగుమతి చేసుకునే వాటికీ ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది.

* భారత్ దిగుమతుల్లో బంగారం, ముడి చమురు వాటాయే అధికంగా ఉంటుంది. ముడి చమురు ధర పెరిగితే అది ఆర్థిక వ్యవస్థ వృద్ధిని దెబ్బతీస్తుంది. బ్యారెల్ ముడిచమురు ధర 10 డాలర్లు పెరిగితే దేశ ఆర్థిక వ్యవస్థ 0.3 శాతం వరకు తగ్గుతుందని విశ్లేషకులు చెబుతుంటారు.

పెట్టుబడులు తరలి పోవచ్చు..

పెట్టుబడులు తరలి పోవచ్చు..

* డాలర్ మారకంలో రూపాయి విలువ తగ్గిపోతే విదేశీ పెట్టుబడి దారులు స్టాక్ మార్కెట్ నుంచి తమ పెట్టుబడులను ఉపసంహరించు కునే అవకాశం ఉంటుంది. తమ పెట్టుబడుల విలువ తగ్గిపోతుందని భావించడమే ఇందుకు కారణం.

* రూపాయి విలువ క్షీణిస్తుంటే స్టాక్ మార్కెట్ మరింత నష్టపోవడానికి అవకాశం ఉంటుంది.

ఇలా రూపాయి విలువ తగ్గడం వల్ల అనేక రకాల ప్రతికూల ప్రభావాలు ఉంటాయి.

English summary

రూపాయి విలువ క్షీణిస్తే ఎలాంటి సమస్యలు ఉంటాయో తెలుసా? | How the rupee fall against US dollar affects your budget and country

Usual discussions on the fall in the rupee bring up macro economic matters such as slowing economic growth, corporate earnings and market volatility.
Story first published: Sunday, August 11, 2019, 10:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X