For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అప్పు తీసుకోవడానికి రెడీ... ఎందుకంటే..

|

ప్రతి వ్యక్తికీ అనేక రకాల అవసరాలు ఉంటాయి. వీటిని తీర్చుకోవాలంటే డబ్బు కావాల్సిందే. దానికి కొంత మంది ఉద్యోగం చేస్తారు, మరికొంతమంది వ్యాపారం నిర్వహిస్తారు, ఇంకొందరు వివిధ రకాల సేవలు అందిస్తారు. అయినప్పటికీ వారి ఆర్ధిక అవసరాలు తీరవు. అలాంటప్పుడు అప్పు తీసుకోవడానికి ప్రాధాన్యం ఇస్తుంటారు. ఈ అప్పును బ్యాంకు లేదా తెలిసిన వారి వద్ద నుంచి తీసుకుంటారు. అయితే కన్జ్యూమర్ ఫైనాన్స్ కంపెనీ హోమ్ క్రెడిట్ ఇండియా తాజా సర్వే ప్రకారం ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఇద్దరు రుణం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు వెల్లడైంది. ఈ సర్వేలో చాలా ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.

<strong>అలర్ట్: ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన, కొత్త పెనాల్టీ పూర్తి లిస్ట్</strong>అలర్ట్: ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన, కొత్త పెనాల్టీ పూర్తి లిస్ట్

ఇవీ కోరికలు...

ఇవీ కోరికలు...

* తమ కుటుంబ అవసరాలతో పాటు వారికున్న కోరికలను తీర్చుకోవడానికి అధిక శాతం మంది రుణం తీసుకోవాలనుకుంటున్నారు.

* తమ జీవన శైలిని మరింతగా మెరుగు పరుచుకోవడానికి చాలా మంది రుణం తీసుకోవాలని భావిస్తున్నారు.

* ఈ సర్వేను 12 నగరాల్లో నిర్వహించారు. ఇందులో 2,571 మంది పాల్గొన్నారు. ఇందులో 33 శాతం మంది కన్స్యూమర్ డ్యూరబుల్స్ కొనుగోలు చేయడానికి రుణం తీసుకోవాలనుకుతున్నట్టు వెల్లడించారు. వంటిలో మొబైల్ ఫోన్, టీవీ, రిఫ్రిజిరేటర్ వంటివి ఉన్నాయి.

* టూవీలర్ల కోసం 23.3 శాతం మంది, వ్యక్తిగత ఖర్చులకోసం 20.3 శాతం మంది, కార్ల కొనుగోళ్ల కోసం 12.5 శాతం, ఇంటి కోసం 12 శాతం, బంగారం కోసం 10.5 శాతం మంది రుణం తీసుకోవాలనుకుంటున్నారు.

* మొత్తంగా చూస్తే దాదాపు 67 శాతం మంది తమ అవసరాల కోసం ఋణం తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు.

* తమ కుటుంబ అవసరాల కోసం రుణం తీసుకోవడానికి 46 శాతం మంది అధికశాతం మంది ప్రాధాన్యం ఇస్తున్నారు.

ఫ్యామిలీ ఓరియెంటేషన్, అవసరాలకు

ఫ్యామిలీ ఓరియెంటేషన్, అవసరాలకు

* ఫ్యామిలీ ఓరియెంటేషన్, అవసరాలకు పాట్నాలో 61 శాతం మంది, లక్నో లో 58 శాతము మంది, నాగపూర్ లో 56 శాతం మంది, జైపూర్ లో 54 శాతం మంది ప్రాధాన్యం ఇస్తున్నారు.

* రుణం తీసుకునే ముందు చాలా మంది తమ కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి సలహాలు తీసుకుంటున్నారు. ముంబైలో 65.1 శాతం మంది స్నేహితుల నుంచి సలహాలు తీసుకుంటున్నారు. లక్నోలో 75 శాతం మంది కుటుంబ సలహాలు తీసుకుంటున్నారు. చండీగర్ లో కొలీగ్స్ నుంచి 54.9 శాతం మంది సలహాలు తీసుకుంటున్నారు.

* రుణం తీసుకునే ముందు ఫైనాన్సియల్ అడ్వైజర్లను సంప్రదించే వారు ముంబై లో 44.2 శాతం, ఢిల్లీలో 38.8 శాతం మంది ఉంటున్నారు.

మారుతున్న ధోరణి...

మారుతున్న ధోరణి...

* కొన్నేళ్ల క్రితం వరకు బ్యాంకులు లేదా ఇతర ఆర్ధిక సంస్థల నుంచి రుణం తీసుకోవాలంటే చాలా మంది వెనకడుగు వేసే వారు. తమకు తెలిసినవారి నుంచి ఎక్కువ మంది రుణం తీసుకునేందుకు ఇష్టపడేవారు.

* అయితే రోజులు మారిపోతున్నాయి. వివిధ రకాల అవసరాల కోసం రుణం ఇచ్చే బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థలు, ఫిన్ టెక్ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి.

* టూ వీలర్, కారు, గృహం కొనుగోలు చేసేందుకు అధిక శాతం మంది రుణం తీసుకుంటున్నారు. సులభ వాయిదాల్లో రుణాన్ని చెల్లించే అవకాశం ఉండటం వల్ల రుణం తీసుకోవడానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు.

English summary

అప్పు తీసుకోవడానికి రెడీ... ఎందుకంటే.. | 67% of Indians ready to take loans

Two out of three Indians are open to taking loans, a new survey by consumer finance provider Home Credit India has revealed.
Story first published: Sunday, August 11, 2019, 9:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X