మొన్నటి వరకు ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడిన స్పైస్ జెట్ క్రమంగా కోలుకుంటోంది. గత త్రైమాసికంలో 38 కోట్ల నికర నష్టాలు వచ్చిన స్పైస్‌జెట్ కంపెనీ ఈ త్రైమాసికంలో రికార్డు స్థాయిలో లాభాన్ని సాధించింది. స్పైస్ జెట్ కంపెనీ మళ్లీ లాభాల్లోకి రావడమే కాకుండా, ఈ ఆర్థిక సంవత్సరం జూన్ క్వార్టర్‌లో సంస్థ ప్రగతి సాధించింది.ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలోస్పైస్‌జెట్ షేర్ 1 శాతం లాభంతో రూ.138 వద్ద ముగిసింది.

ఆర్థిక ఒడిదుడుకులతో మొన్నటి వరకు ఇబ్బంది పడిన స్పైస్ జెట్ క్రమంగా లాభాల బాట పడుతోంది. ఈ త్రైమాసికంలో బోయింగ్ 737 మ్యాక్స్ విమాన సర్వీసులను నిలిపేసినప్పటికీ, ఈ కంపెనీ ఈ క్యూ1లో రూ.262 కోట్ల నికర లాభం సాధించింది. గత క్యూ1లో రూ.38 కోట్ల నికర నష్టాలు వచ్చాయని కానీ ఈసారి నష్టాలను అధిగమించి లాభాలు సాధించామని స్పైస్ జెట్ కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కిరణ్ కోటేశ్వర్ తెలిపారు . ఇక కంపెనీకి సంబంధించి గత క్యూ1లో రూ.2,253 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో రూ.3,145 కోట్లకు పెరిగిందని ఆయన పేర్కొన్నారు.
నష్టాలు వస్తుండడంతో బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల నిలిపివేసిన సంస్థ బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల నిలిపివేత ప్రభావం ఈ జూన్ క్వార్టర్‌లో బాగానే చూపించిందని కిరణ్ కోటేశ్వర్ తెలిపారు. ఈ ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ, నిర్వహణ ఆదాయం రూ.2,220 కోట్ల నుంచి రూ.3,002 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. ఇక సగటువిమాన చార్జీ 11 శాతం పెరిగిందని పేర్కొన్నారు. అందువల్లే నిర్వహణ ఆదాయం ఇంతగా పెరిగినట్లుగా ఆయన పేర్కొన్నారు. అంతేకాదు జూన్ చివరి నాటికి స్పైస్ జెట్ నుండి 107 విమానాలతో సర్వీసులను అందిస్తున్నామని కిరణ్ కోటేశ్వర్ తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్ కల్లా బోయింగ్ 737 ఎన్జీ విమానాలను 5 నుండి 10 వరకు సర్వీసులోకి తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. మొత్తానికి నష్టాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న స్పైస్ జెట్ లాభాల బాట పట్టిన నేపథ్యంలో షేర్ ధర పెరిగే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications