FPI ఎఫెక్ట్, భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఎఫ్‌పీఐలకు అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందనే వార్తల నేపథ్యంలో మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఏకంగా 255 పాయింట్లు ఎగబాకి 37,581 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 11,100 పాయింట్లకు పైన ముగిసింది.
యస్ బ్యాంక్ 7 శాతం నష్టపోగా, ఇండియాబుల్స్ హౌసింగ్ 14 శాతం లాభాల్లో ముగిసింది. మారుతీ, వేదాంత, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, హిందూస్తాన్ యూనివర్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకు, హీరో మోటో కార్ప్, మహీంద్రా అండ్ మహీంద్రా, రిలయన్స్, యాక్సిస్ బ్యాంకు, ఎల్ అండ్ టీ, ఇన్ఫోసిస్‌లు భారీ లాభాల్లో క్లోజ్ అయ్యాయి.

ఇండస్ ఇండ్ బ్యాంక్, ఓఎన్జీసీ, భారతీ ఎయిర్ టెల్, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, ఎస్బీఐఎన్, పవర్ గ్రిడ్, టాటా మోటార్స్, ఎన్టీపీసీ, ఐటీసీ, టాటా స్టీల్ కంపెనీలు నష్టాల్లో క్లోజ్ అయ్యాయి.


Click it and Unblock the Notifications