FPI ఎఫెక్ట్, భారీ లాభాల్లో కొనసాగుతున్న మార్కెట్లు
ముంబై: దేశీయ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ, ఆసియన్ మార్కెట్లు కూడా లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ప్రారంభంలోనే నిఫ్టీ 49.40 పాయింట్లు ఎగబాకి 11081.90, సెన్సెక్స్ 141.42 పాయింట్లు ఎగబాకి 37468.78 వద్ద ట్రేడ్ అయింది. ఎఫ్‌పీఐలకు ఊరట లభిస్తుందనే నేపథ్యంలో గురువారం కూడా మార్కెట్లు ఉత్సాహంగా ముగిశాయి.
శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాల ప్రాంతంలో సెన్సెక్స్ 169 పాయింట్లు లాభపడి 37,496కు దూసుకెళ్లింది. నిఫ్టీ 54 పాయింట్లు బలపడి 11,087 వద్ద ట్రేడ్ అయింది. డాలరుతో రూపాయి మారకం విలువ 70.55 వద్ద ఉంది.

కాగా, ప్రభుత్వం ఇటీవల బడ్జెట్లో ఎఫ్‌పీఐలపై ప్రవేశపెట్టిన పన్నును ఉపసంహరించుకొనే అవకాశముందని వార్తలు వచ్చాయి. వరుస నష్టాలతో కుదేలవుతున్న మార్కెట్లకు ఇది ఉపశమనం కలిగించింది. ముఖ్యంగా విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్ల ఆదాయంపై సర్ ఛార్జీ, ఎల్టీసీజీ పన్ను తొలగింపు వంటి నిర్ణయాలు ఉండొచ్చని తెలుస్తోంది. దీంతో మార్కెట్లు గురువారం నుంచి పరుగులు తీస్తున్నాయి.
పెద్దయెత్తున కొనుగోళ్లకు ముందుకు వస్తుండటంతో మార్కెట్లు లాభాలు నమోదు చేస్తున్నాయి. మే 20 తర్వాత సూచీలు ఒక రోజులో నమోదు చేసిన అత్యధిక లాభం గురువారం. బీఎస్‌ఈలో ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ వ్యాల్యూ రూ.1.93 లక్షల కోట్లు పెరిగి రూ.140.75 లక్షల కోట్లకు చేరుకుంది. గురువారం డాలర్‌తో రూపాయి మారకం 20 పైసలు బలపడి 70.69 వద్ద ముగిసింది.


Click it and Unblock the Notifications