For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సూపర్ ఆఫర్లతో మహేష్ బాబు కొత్త బ్రాండ్ లాంచ్

|

హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన కొత్త వ్యాపారంలోకి బుధవారం అడుగు పెట్టారు. ఇదివరకే సినిమా నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. ఏఎంబీ సినిమా పేరుతో మల్టీప్లెక్స్ బిజినెస్ ప్రారంభించారు. ఇప్పుడు దుస్తుల వ్యాపారంలోకి అడుగిడారు. హంబుల్ బ్రాండ్ పేరుతో దుస్తుల మార్కెట్లుకి వస్తున్నట్లు గతంలోనే చెప్పారు. దీంతో ఫ్యాన్స్ ఈ లాంచింగ్ కోసం వేయి కళ్లతో ఎదురు చూసారు. 7 ఆగస్ట్, బుధవారం రోజున మహేష్ బాబు తన హంబుల్ బ్రాండ్ దుస్తులను పార్క్ హయత్ హోటల్లో అట్టహాసంగా ఆవిష్కరించారు.

<strong>ఫ్యాన్స్‌కు ఆఫర్, కౌంట్‌డౌన్ ప్రారంభం: మహేష్ బాబు కొత్త బిజినెస్</strong>ఫ్యాన్స్‌కు ఆఫర్, కౌంట్‌డౌన్ ప్రారంభం: మహేష్ బాబు కొత్త బిజినెస్

మహేష్ బాబు హంబుల్...

మహేష్ బాబు హంబుల్...

స్పోయిల్ (SPOYL) సంస్థ భాగస్వామ్యంతో మహేష్ బాబు... హంబుల్ బ్రాండ్ పేరుతో 160 రకాల దుస్తులను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చారు. యువకుల నుంచి వృద్ధుల వరకు ఆకర్షణీయంగా, అందుబాటులో ఉండే ధరలతో క్యాజువల్ షర్ట్స్, టీ షర్ట్స్ ఉంటాయి. శుక్రవారం మహేష్ బాబు బర్త్ డే ఉంది. దీనికి రెండు రోజుల ముందు తన బ్రాండ్‌ను లాంచ్ చేశారు.

బ్రాండ్‌లో నా వ్యక్తిత్వం

బ్రాండ్‌లో నా వ్యక్తిత్వం

మా బ్రాండ్‌లో రూట్స్ కలక్షన్ ప్రత్యేకమైనదని మహేష్ బాబు చెప్పారు. ఇధి గ్రామీణ చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలను కూడా అందిస్తోందని చెప్పారు. నిజాయితీగా, వినయంగా ఉండటం తనకు ఇష్టమని, తన బ్రాండ్స్‌లో తన వ్యక్తిత్వం కనిపిస్తుందన్నారు.

స్పోయిల్ లేకుండా సాధ్యం కాలేదు

స్పోయిల్ లేకుండా సాధ్యం కాలేదు

హంబుల్ రాత్రికి రాత్రే ప్రారంభం కాలేదని మహేష్ బాబు చెప్పారు. స్పోయిల్ యొక్క తీరు, వారితో తాను కలిసేందుకు తనను ఉత్తేజపరిచిందని చెప్పారు. స్పోయిల్ లేకుండా ఇది సాధ్యం కాలేదన్నారు. సినిమాలు తన మొదటి అభిరుచి అని, రానున్న రెండేళ్లు షూటింగ్‌తో బిజీగా ఉన్నానని చెప్పారు.

మహేష్ బాబుకు ఇష్టమైన దుస్తులు, రంగు

మహేష్ బాబుకు ఇష్టమైన దుస్తులు, రంగు

తాను సింపుల్‌గా ఉంటానని మహేష్ బాబు తెలిపారు. సౌకర్యవంతమైన దుస్తులు ధరిస్తానని చెప్పారు. జీన్స్, చెక్ షర్ట్స్ తనకు ఇష్టమైన దుస్తులు అన్నారు. తాను మొదటిసారి నమ్రత వద్దకు వెళ్లినప్పుడు చెక్ రెడ్ షర్ట్ ధరించానని చెప్పారు. తనకు ఇష్టమైన రంగు బ్లూ అని, తనకు అది లక్కీ కూడా అన్నారు.

MBని ఎందుకు అండర్ లైన్ చేశారు

MBని ఎందుకు అండర్ లైన్ చేశారు

స్పోయిల్ సీఈవో మాట్లాడుతూ... ఈ బ్రాండును ప్రారంభించాలనుకున్నప్పుడు తమ మదిలోకి వచ్చిన మొదటి పేరు మహేష్ బాబు అన్నారు. ఆరు నెలల తర్వాత ఈ దుస్తులను ఆఫ్‌లైన్‌లో కూడా కొనుగోలు చేయవచ్చునని చెప్పారు. ప్రస్తుతానికి పురుషులకు సంబంధించిన దుస్తులు ఉన్నాయన్నారు. హంబుల్ అనే పేరును యాదృచ్చికంగా పెట్టలేదని, మహేష్ బాబు రియల్ లైఫ్ రిఫ్లెక్ట్ అవుతుందన్నారు. అతనో సూపర్ స్టార్ అయినప్పటికీ వినయం ఎక్కువ అని, కంపెనీ లోకో హంబుల్ (Humbl)లో మహేష్ బాబులోని తొలి రెండు అక్షరాలు MBని అండర్ లైన్ చేశామన్నారు.

హంబుల్ ధరలు ఇలా..

హంబుల్ ధరలు ఇలా..

ది హంబుల్‌లో ధరలు రూ.570 నుండి రూ.2 వేల లోపు ఉన్నాయి. షర్ట్స్, పాయింట్స్ పైన నాలుగు శాతం నుంచి పది శాతం ఆఫర్ ఇస్తున్నారు. లో ప్రైస్ దుస్తులపై నాలుగు శాతం హై ప్రైస్ దుస్తులపై 10 శాతం వరకు ఆఫర్ ఇస్తున్నారు. స్మాల్, మీడియా, లార్జ్ సైజులతో పాటు XL, XXL సైజుల్లోను లభిస్తాయి. వివిధ రంగుల్లో దుస్తులు లభిస్తాయి.

English summary

సూపర్ ఆఫర్లతో మహేష్ బాబు కొత్త బ్రాండ్ లాంచ్ | Superstar Mahesh Babu launches clothing brand THE HUMBL CO

Superstar Mahesh Babu's clothing line, 'The Humbl Co', was launched on Wednesday. The event was graced by the actor, among others.
Story first published: Thursday, August 8, 2019, 12:13 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X