For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లాభాల్లో మార్కెట్లు: సెన్సెక్స్ 637, నిఫ్టీ 177 పాయింట్ల లాభం

|

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 636.86 పాయింట్ల లాభంతో 37,327.36 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 176.95 పాయింట్ల లాభంతో 11,032.45 వద్ద ముగిసింది. మార్కెట్లు ఉదయం నుంచి లాభాల్లోనే కొనసాగుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 0.31 శాతం బలహీనపడి 70.57 వద్ద ముగిసింది. పది గ్రాముల బంగారం (ఎంసీఎక్స్) రూ.465 పడిపోయి రూ.37,753కు తగ్గింది.

<strong>హైదరాబాద్‌లో ఇళ్లు-ఆఫీస్ దొరకక ఇబ్బంది పడుతున్నారా?</strong>హైదరాబాద్‌లో ఇళ్లు-ఆఫీస్ దొరకక ఇబ్బంది పడుతున్నారా?

ఎన్ఎస్ఈ లార్జర్ క్యాప్‌లో ఎక్కువగా లాభపడింది అరబిందో ఫార్మా. ఎన్ఎస్ఈ లార్జర్ క్యాప్‌లో భారీగా నష్టపోయింది టాటా స్టీల్స్. అరబిందో రూ.43.30 మేర లాభపడి రూ.598 వద్ద ముగియగా, టాటా స్టీల్స్ రూ.14.50 నష్టపోయి రూ.367.40 వద్ద క్లోజ్ అయింది.

Markets: Sensex close at 637 pts, Nifty at 177 pts

హెచ్‌సీఎల్ టెక్ షేర్లు 6 శాతం వరకు పెరిగాయి. టాటా మోటార్స్ 5.58 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా (4.06 శాతం), బజాజ్ ఆటో (3.99 శాతం), రిలయన్స్ (3.87 శాతం) లాభాలతో ముగిశాయి. కేవలం టాటా స్టీల్స్ (-4 శాతం) ఇండస్ ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకులు మాత్రమే నష్టాలను చవి చూశాయి.

బీఎస్ఈలో అన్ని ఎనర్జీ సెక్టార్లు కూడా లాభాలబాట పట్టాయి. ఈ సెషన్‌లో 3 శాతం పెరిగాయి. ఆటో 2.77 శాతం లాభపడింది. ఐటీ, టెక్నాలజీ, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు కూడా 1.50 శాతం నుంచి 2 శాతం మేర లాభపడ్డాయి.

English summary

లాభాల్లో మార్కెట్లు: సెన్సెక్స్ 637, నిఫ్టీ 177 పాయింట్ల లాభం | Markets: Sensex close at 637 pts, Nifty at 177 pts

The Sensex and Nifty settled around 1.7 per cent higher at the close on Thursday. The Sensex finished at 37,327, up 636 points or 1.74 per cent firmer, while the Nifty rose 176 points or 1.63 per cent at 11,032.
Story first published: Thursday, August 8, 2019, 16:17 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X