ఆర్థిక మాంద్యం దిశగా అడుగులు వేస్తున్న భారత ఆర్థిక వ్యవస్థకు వెన్ను దన్నుగా నిలవాలంటే... రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తప్పనిసరిగా కాష్ రిజర్వు రేషియో (సి ఆర్ ఆర్ - నగదు నిల్వల నిష్పత్తి) ని తగ్గించాల్సి ఉంటుంది. అందరూ ఊహిస్తున్నట్లు కేవలం రేపో రేటు మరో 25 బేసిస్ పాయింట్లు తగ్గించటం వల్ల ప్రస్తుత సమస్యలు తీరవని పరిశ్రమ వర్గాల అంచనా. అందుకే సి ఆర్ ఆర్ ను తగ్గించాలని భారత పరిశ్రమ సమాఖ్య (సీఐఐ) సహా ఇతర పరిశ్రమ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. సి ఆర్ ఆర్ ను కనీసం 50 బేసిస్ పాయింట్లు తగ్గించాలని సూచిస్తున్నారు. తద్వారా ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య లభ్యత పెరుగుతుందని పేర్కొంటున్నారు. ఆర్బీఐ నేడు (గురువారం) ద్రవ్య పరపతి సమీక్ష చేయనున్న విషయం తెలిసిందే.

వ్యవస్థ లోకి రూ 60,000 కోట్లు ...
ఒక వేళ ఆర్బీఐ ఈ రోజు మోనిటరీ పాలసీ కమిటీ ఆధ్వర్యంలో సి ఆర్ ఆర్ ను 50 బేసిస్ పాయింట్ల మేరకు తగ్గిస్తే ... తద్వారా ఆర్థిక వ్యవస్థ లోకి రూ 60,000 కోట్ల ద్రవ్య లభ్యత సమకూరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో, పలు రంగాలకు రుణాలు అందజేసే అవకాశం బ్యాంకులకు లభిస్తుందని వారు చెబుతున్నారు. నిజానికి బ్యాంకులు మూల ధన నిధుల లేమితో ఇబ్బంది పడుతున్న ఈ తరుణంలో కాష్ రిజర్వు రేషియో తగ్గింపు మాత్రమే సరైన నిర్ణయం అవుతుందని అభిప్రాయపడుతున్నారు. బ్యాంకులు అన్ని వాటి నగదు నిల్వల్లో తప్పనిసరిగా కొంత మొత్తాన్ని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా వద్ద జమ చేసే నిష్పత్తిని కాష్ రిజర్వు రేషియో అని అంటారు. ఇది 3 % నుంచి 15% మధ్యలో ఎంత ఉండాలో ఆర్బీఐ నిర్ణయిస్తుంది.

ప్రస్తుత సి ఆర్ ఆర్ 4 %...
ప్రస్తుతం ఆర్బీఐ పాటిస్తున్న సి ఆర్ ఆర్ .. 4% గా ఉంది. దీనికి 3 % వరకు తగ్గించేందుకు ఆర్బీఐ కి అధికారం ఉంటుంది. కానీ ఒకేసారి 100 బేసిస్ పాయింట్లు తగ్గించడం జరగదు. అందుకే పరిశ్రమ వర్గాలు 50 బేసిస్ పాయింట్లను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాయి. కనీసం 25 బేసిస్ పాయింట్లు తగ్గినా కొంత ఉపశమనం లభించటం ఖాయం. 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తే వ్యవస్థ లో రూ 30,000 కోట్ల నగదు లభ్యత పెరుగుతుంది. అదే సమయంలో అటు రేపో రేటును కూడా ఒక 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తే ... వడ్డీ రేట్లు కూడా తగ్గే అవకాశం ఉందని అనలిస్టులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం రేపో రేటు 5.75% గా ఉంది. 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.50% నికి చేరితే, గృహ రుణాలు, ఆటో రుణాలు సహా అనేక రుణాలపై వడ్డీ రేట్లు 0.5% నుంచి 1% మేరకు తగ్గే అవకాశం ఉందని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు.

స్పందించని బ్యాంకులు....
ఈ ఏడాది ఇప్పటి వరకు మూడు సమీక్షలు జరిగాయి. మూడు సార్లూ ఆర్బీఐ రేపో రేటును 25 బేసిస్ పాయింట్ల చొప్పున తగ్గిస్తూ వచ్చింది. దీంతో 6.50% నుంచి 5.75% నికి రేపో రేటు చేరుకొంది. కానీ... రేపో రేటు తగ్గింపు ప్రయోజనాన్ని బ్యాంకులు వినియోగదారులకు చేరవేయలేదు. చాలా బ్యాంకులు కనీసం 25 బేసిస్ పాయింట్ల మేరకు కూడా వడ్డీ రేట్లను తగ్గించక పోవటం విదితమే. దీనికి కారణం బ్యాంకుల వద్ద తగినంత నగదు నిల్వలు లేకపోవటమే. అందుకే ఆర్థిక వ్యవస్థలో నగదు నిల్వలు ఉండేలా చూసేందుకు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా తగిన నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆటోమొబైల్ సహా అనేక రంగాలు మందగమనం ఎదుర్కొంటున్న తరుణంలో నిధుల లభ్యత పెంచి, తక్కువ వడ్డీకే రుణాలు లభించేలా చర్యలు ఉండాలని కోరుతున్నారు. తద్వారా ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు నింపగలమని పేర్కొంటున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications